హత్య కేసులో యువ హీరోయిన్ అరెస్ట్.. థాయ్‌లాండ్‌కు పారిపోతుండగా..!
బంగ్లాదేశ్‌లో సంచలనం రేపిన హత్య కేసులో యువ హీరోయిన్ నుస్ర్ ఫారియాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను ఢాకాలోని హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకొన్నారు. ఆ తర్వాత ఆమె అరెస్ట్‌ను అక్కడి పోలీసులు అధికారికంగా ప్రకటించారు. నుస్రత్ అరెస్ట్ అక్కడి సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపింది. మర్డర్ కేసులో నుస్రత్‌కు ఉన్న లింక్ ఏమిటి? ఈ కేసు వివరాల్లోకి వెళితే...
నుస్రత్ ఫారియా మజహర్ అలియాస్ నుస్రత్ ఫారియా బంగ్లాదేశ్ సినిమా రంగంలో నటిగా, మోడల్‌గా, టెలివిజన్ హోస్ట్‌గా, రేడియో జాకీగా సుపరిచితులు. బంగ్లాదేశ్ సినిమా ఇండస్ట్రీ డాలీవుడ్‌లోను, అలాగే బెంగాళీ సినిమా పరిశ్రమలో పనిచేశారు. మోడల్‌గా వినోద పరిశ్రమలోకి అడుగు పెట్టి పలు రంగాల్లో తన ప్రతిభతో రాణించే ప్రయత్నం చేశారు.

నుస్రత్ 2015 సంవత్సరంలో ఆషికీ అనే సినిమా ద్వారా బంగ్లాదేశ్ సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత 20 చిత్రాలకుపైగా నటించి మెప్పించే ప్రయత్నం చేశారు. అయితే బాబాహు ఓభిజాన్ సినిమా ద్వారా బెంగాళీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించిన ముజీబ్: ది మేకింగ్ ఆఫ్ ఏ నేషన్ అనే సినిమా ద్వారా భారతీయ సినిమా పరిశ్రమలో గుర్తింపు పొందారు. ఈ చిత్రంలో ముజీబ్ కూతురు షేక్ హసీనా పాత్రను పోషించి అభిమానులను ఆకట్టుకొన్నారు.
బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొద్ది నెలల క్రితం జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో జరిగిన ఓ స్టూడెంట్ మర్డర్ కేసుతో నుస్రత్ ఫారియాకు సంబంధం ఉందనే విషయంపై ఆరోపణలు వచ్చాయి. గత జూలైలో ఢాకాలోని వాటారా ప్రాంతంలో జరిగిన యువకుడి హత్య కేసులో మొత్తం 17 మంది నటులుపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆమెను సోమవారం అదుపులోకి తీసుకొన్నారు అని బంగ్లాదేశ్ మీడియా ప్రకటించింది.
నుస్రత్ అరెస్ట్‌ను వాటారా ప్రాంతపు పోలీసులు ధృవీకరించారు. ఇమ్మిగ్రేషన్ పోలీసుల అందించిన సమాచారంతో ఆమెను అరెస్ట్ చేశాం. కొన్ని రోజుల క్రితం స్టూడెంట్ హత్య కేసుతో ప్రమేయం ఉందని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం మా టీమ్ పర్యవేక్షణలో ఆమెను విచారిస్తున్నాం. ఎయిర్‌పోర్టులో విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మేము ఆమెను అరెస్ట్ చేశాం అని పోలీసులు వెల్లడించారు.
బంగ్లాదేశ్ నుంచి ఆమె థాయ్‌లాండ్‌కు వెళ్తున్నట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు సమాచారం అందించారు. దాంతో ఆమెను ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద అరెస్ట్ చేశాం. ఆమెను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలిస్తామని అధికారులు వెల్లడించారు. నుస్రత్ అరెస్ట్‌తో బంగ్లాదేశ్ సినీ ఇండస్ట్రీలో సినీ వర్గాలు దిగ్బ్రాంతికి గురయ్యారు.


Click it and Unblock the Notifications











