దేవదాసిగా సాయి పల్లవి న్యూ లుక్స్.. శ్యామ్ సింగరాయ్ లో చూడని స్టిల్స్ వైరల్

నాని ద్విపాత్రాభినయంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమా థియేట్రికల్ గానే కాకుండా ఓటీటీ లో కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి చేసిన పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించింది. దేవదాసిగా ఆమె కనిపించిన అభినయం సినిమాకు ఒక సరికొత్త రూపురేఖలను తీసుకు వచ్చింది. ఇక సినిమా లో ఎవరు చూడని ఒక లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఎంచుకునే ప్రతి పాత్ర కూడా

ఎంచుకునే ప్రతి పాత్ర కూడా

మలయాళం బ్యూటీ సాయి పల్లవి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక సరికొత్త పాయింట్ హైలెట్ అవుతుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె ఎంచుకునే ప్రతి పాత్ర కూడా సినిమా కథలో చాలా కీలకంగా ఉంటుంది. అంతేకాకుండా మునుపెన్నడూ చూడని పాత్రలు ఆమె ఎక్కువగా ప్రెజెంట్ చేయడానికి చూస్తోంది. అందుకే ఇన్నాళ్లు సాయి పల్లవి తన కంటూ ఒక డిఫరెంట్ ఇమేజ్ ను అయితే క్రియేట్ చేసుకో గలిగింది.

డామినేట్ చేసే విధంగా

డామినేట్ చేసే విధంగా

ప్రేమమ్ అనే మలయాళం సినిమాతో వెండితెరకు పరిచయమైన సాయి పల్లవి ఆ తర్వాత ఫిదా సినిమాతో చాలా తొందరగా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయింది. ఆమె చేసిన ప్రతి సినిమా కూడా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటోంది. ఇటీవల వచ్చిన లవ్ స్టోరీ సినిమా కూడా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా ఇతర స్టార్ హీరోలతో ఆమె సినిమాలు చేసినప్పుడు వారి స్టార్ ఇమేజ్ ను కూడా డామినేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తోంది.

దేవదాసిగా..

దేవదాసిగా..

ఇక ఇటీవల వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా సాయి పల్లవి చేసిన ఒక దేవదాసి పాత్ర చాలా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. గతంలో ఎవరూ కూడా ఈ తరహాలో కనిపించింది లేదు. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఆమెను చూపించిన విధానం వెండితెరపై చాలా అద్భుతంగా కనిపించింది. దేవదాసి మైత్రి గా శ్యామ్ కు రోసిగా మంచి ప్రేమకథలో సాయిపల్లవి కనిపించిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 కొత్త అనుభవం..

కొత్త అనుభవం..

ఇక శ్యామ్ సింగరాయ్ లోని దేవదాసు పాత్రకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సాయి పల్లవి ఫోటోలను షేర్ చేస్తు ఇలాంటి చిత్ర యూనిట్ సభ్యులతో పని చేయడం ఒక కొత్త అనుభూతిని ఇచ్చినట్లుగా వివరణ ఇచ్చింది. ముఖ్యంగాక్ రోసి పాత్ర ఆమెకు చాలా బాగా నచ్చినట్లుగా తెలియజేసింది.

బాక్సాఫీస్ హిట్ ..

బాక్సాఫీస్ హిట్ ..

ఇక శ్యామ్ సింగరాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడి కంటే కొంత మంచి లాభాలు అందించింది. 22 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 25 కోట్లకు పైగా షేర్ వసూలు అందుకని బాక్సాఫీస్ వద్ద హిట్ మూవీగా నిలిచింది. కరోనా పరిస్థితుల్లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయంటే ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో కూడా విడుదలవ్వగా భారీ స్థాయిలో స్పందన వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X