రోజుకి లక్షల్లో పారితోషికం.. నోట్ల కట్టలపై నిద్ర.. చివరికి దిక్కులేని అనాధలా..

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని తన గ్లామర్‌తో ఊపేసిన ఓ హీరోయిన్.. రోజుకు లక్షల్లో పారితోషికం తీసుకునేది, నోట్ల కట్టల మీదే పడుకునేదట. లగ్జరీ లైఫ్‌కు కేరాఫ్ అడ్రస్‌ ఆమె జీవితం. కానీ, చివరి దశలో ఆనాథలా చనిపోయిందట. ఇంతకీ ఇంతటి క్రేజ్, రేంజ్ ఉన్న ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు చివరి దశలో ఆనాథలా మారింది. ఇలాంటి ఆసక్తికర విషయాలను వెల్లడించింది ఎవరు?

ఆమె మరెవరో కాదు, గ్లామర్ క్వీన్ సిల్క్ స్మిత.. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని తన గ్లామర్‌తో శాసించింది. తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో భారీ క్రేజ్ సంపాదించింది. ఎలాంటి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన ఆమె, బోల్డ్ పర్సనాలిటీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినిమాల్లో గ్లామర్‌కు నిర్వచనంగా నిలిచిన నటి సిల్క్ స్మిత గురించి తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు మాజీ నటి డిస్కో శాంతి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, స్మితతో తనకు ఉన్న అనుబంధం, ఆమె వ్యక్తిత్వం, జీవితం, ఆర్థిక పరిస్థితుల గురించి ఎన్నో తెలియని విషయాలను పంచుకున్నారు.

Silk Smitha Life Secrets Disco Shanti Reveals Luxury Life and Tragic End

డిస్కో శాంతి మాట్లాడుతూ, "నేను మంచిదాన్ని అయితే, నాకంటే వంద రెట్లు సిల్క్ స్మిత మంచిదే" అంటూ ఆమె గొప్ప మనసును గుర్తు చేసుకున్నారు. అయితే బయట ప్రపంచం ఆమెను గర్వంగా ఉండే వ్యక్తిగా భావించేదని, కానీ అసలు విషయానికి వస్తే ఆమె ఎవరితో ఎలా ఉండాలో బాగా తెలిసిన వ్యక్తి అని తెలిపారు. "నాతో చాలా క్లోజ్‌గా ఉండేది. తన వ్యక్తిగత విషయాలన్నీ నాతో షేర్ చేసుకునేది. కానీ మిగతా వాళ్లతో అంతగా దగ్గరవ్వదు" అని చెప్పారు.\

స్మిత జీవనశైలిపై మాట్లాడుతూ, "ఆమె ఉన్నన్ని రోజులు నిజంగానే మహారాణిలా బతికింది. చదువు పెద్దగా లేకపోయినా ఇంగ్లీష్‌ను చాలా బాగా మాట్లాడేది. ఆమె స్టైల్, డ్రెస్ సెన్స్ పూర్తిగా ప్రత్యేకం. ఆమెకు ప్రత్యేకంగా డిజైనర్లు లేరు. ప్రతి కాస్ట్యూమ్‌ను తానే డిజైన్ చేసుకుని, మేకప్ కూడా తన స్టైల్‌లో చేసుకునేది" అని వివరించారు. అయితే సిల్క్ స్మిత మరణం గురించి చెబుతూ డిస్కో శాంతి భావోద్వేగానికి గురయ్యారు. "ఆమె చనిపోయినప్పుడు నేను చెన్నైలో లేక అవుట్‌డోర్ షూటింగ్‌లో ఉన్నాను. షూటింగ్ సమయంలో మేకప్ మెన్స్ ఆ వార్త చెప్పారు. వెంటనే చెన్నైకి బయలుదేరాను. ఆ బాధను మాటల్లో చెప్పలేను" అంటూ ఆ రోజులను గుర్తుచేసుకున్నారు.

స్మిత వ్యక్తిగత జీవితం గురించి కూడా శాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. "ఆమెకు ఒక మంచి జీవిత భాగస్వామి దొరికిఉంటే పరిస్థితి పూర్తిగా మారిపోయేది. చాలా మంది ఆమెను వాడుకొని వదిలేశారు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆమె సంపాదన గురించి చెబుతూ, 'నెలకు 5 లక్షలు చెల్లిస్తూ అద్దె ఇంట్లోనే ఉండేది. స్మితకు లక్షల్లో పారితోషికం వచ్చేది. కానీ ఆ డబ్బును ఎలా మేనేజ్ చేయాలో తెలియక ఇబ్బంది పడేది. డబ్బును బెడ్ మీద పేర్చి, దానిపై చాప వేసుకుని పడుకునేదని చెప్పేది. ఒకప్పుడు తిండి కోసం కష్టపడిన ఆమె, తరువాత డబ్బును ఎలా దాచుకోవాలో తెలియక అయోమయంలో పడింది' అని చెప్పారు.

అంతేకాదు, స్మిత తీసిన సినిమాల వల్ల జరిగిన నష్టాల గురించి కూడా వెల్లడించారు. "తన సంపాదనతో సినిమాలు తీసి భారీ నష్టాలు చూసింది. ఒకటి కాదు రెండు మూడు సినిమాలు చేసి డబ్బంతా పోగొట్టుకుంది. ఆమె ప్రాపర్టీ ఎక్కడికి వెళ్లిందో నాకు క్లియర్‌గా తెలియదు. చివరకు ఆమె ఒంటరిగా ప్రాణాలు విడిచింది" అంటూ ఎమోషనల్ అయ్యారు. మొత్తానికి, డిస్కో శాంతి చెప్పిన ఈ విషయాలు సిల్క్ స్మిత జీవితం వెనుక ఉన్న తెలియని కోణాలను మరోసారి బయటపెట్టాయి. వెలుపల గ్లామర్, స్టార్‌డమ్ ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఆమె కథ మరోసారి చర్చకు దారితీస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X