సిల్క్ స్మిత కొరికిన యాపిల్‌‌‌‌ వేలం... ఎంత రేటు పలికిందో తెలుసా?

సిల్క్ స్మిత పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.. మత్తెక్కించే కళ్లు, అందమైన రూపంతో హీరోయిన్లను మించిన క్రేజ్‌తో 1980లలో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపింది. కేవలం ఆమెను చూడటానికే కుర్రాళ్లు థియేటర్లకు వెళ్లేవారంటే అతిశయోక్తి కాదు. సిల్క్ స్మిత ఉంటేనే తాము సినిమాలను కొనుగోలు చేస్తామని, లేకపోతే లేదని డిస్ట్రిబ్యూటర్లు సైతం చెప్పేవారంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. మరణించి 30 ఏళ్లు కావొస్తున్నా సిల్క్ స్మిత పేరు నేటికి మారు మోగుతూనే ఉందంటే వెండితెరపై ఆమె ముద్రను అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ఆమె క్రేజ్ గురించి ఓ సీనియర్ దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మీ. అత్తింటి వేధింపులు, ఇతర సమస్యలతో ఇంట్లోంచి పారిపోయి మద్రాస్‌లో తలదాచుకున్న సిల్క్... తొలుత మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. అలాగే సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించి చిన్న పాత్రలను దక్కించుకుంటూ వచ్చారు. ఈ దశలో ఓ దర్శకుడి సూచన మేరకు తన పేరును సిల్క్ స్మితగా మార్చుకున్నారు. 1980లలో భారతీయ సినీ రంగంలో క్లబ్ డ్యాన్స్‌లు, ఐటెం సాంగ్స్‌కు విపరీతమైన గిరాకీ ఉండేది. బాలీవుడ్‌ నుంచి ఈ కల్చర్ దక్షిణాదికి పాకింది. దాంతో ఇక్కడి దర్శక నిర్మాతలు కూడా ఈ తరహా సాంగ్స్‌ను తమ సినిమాలలో పెట్టి ప్రేక్షకులను అలరించేవారు.

Silk Smitha s Unbelievable Craze Her Bitten Apple Reportedly Sold for 25K in auction

స్వతహాగా అద్భుతమైన డ్యాన్సర్, పైగా అందగత్తె కావడంతో సిల్క్ స్మితకు ఐటెం సాంగ్స్ చేసేందుకు ఆఫర్లు వెల్లువెత్తాయి. దాంతో యువతలో ఆమె క్రేజ్ పెరిగిపోయింది. కేవలం 15 ఏళ్ల కాలంలోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో దాదాపు 400కు పైగా చిత్రాలలో నటించిందంటే సిల్క్ స్మిత రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. హీరోలు, హీరోయిన్లను మించిన పారితోషికం అందుకుంటూ సూపర్‌స్టార్ స్టేటస్ అందుకున్నారు సిల్క్ స్మిత. డబ్బు, పేరు, ఫేమ్ సంపాదించి అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారిపోయారు.

సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న ఆమె కెరీర్‌లో అనుకోని కుదుపులు మొదలయ్యాయి. ప్రేమలో విఫలం, సినిమా నిర్మాణంతో ఆర్ధిక కష్టాలు, డిప్రెషన్ చుట్టుముట్టడంతో 1996 సెప్టెంబర్ 23న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు సిల్క్. ఆమె మరణంతో కోట్లాది మంది అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఇన్నేళ్లు గడుస్తున్నప్పటికీ సిల్క్ స్మిత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అంతేకాదు బతికున్న రోజుల్లో ఆమెను చూస్తే చాలని అనుకున్న అభిమానుల సంఖ్యకు అంతేలేదు. ప్రముఖ దర్శకుడు కనగాల జయకుమార్ కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత క్రేజ్, ఆమెతో తన అనుబంధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి నటించిన రక్తబంధం మూవీ సిల్క్‌స్మితకు చేజారిపోవడానికి నేనే కారణమని ఆమె అభిప్రాయం. ఇదే విషయం గుర్తుపెట్టుకుని నన్ను టీజ్ చేస్తూ ఉండేది. కానీ ఇందులో నా పాత్ర ఏం లేదు.. దర్శకుడు సిల్క్ స్మితతో డైలాగులు ప్రాక్టీస్ చేయించమన్నారు. ఆ తర్వాత టెస్ట్‌లో ఆయనకు నచ్చపోవడంతో సిల్క్ స్మితను తప్పించారు. సిల్క్ స్మిత కాలు మీద కాలు వేసుకుని కూర్చొనేది.. ఎంత పెద్ద హీరో వచ్చినా తీసేది కాదు. ఆ అమ్మాయి కళ్లు, ఫేస్ నిజంగా పువ్వులా ఉండేది. నిర్మాత, దర్శకుడు క్రాంతి కుమార్ అంటే ఇండస్ట్రీలో అందరికి భయం.. ఆయన, మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నప్పుడు కూడా కాలు మీద కాలు వేసుకుని కూర్చొంటే బాగోదు కదా అని జయకుమార్ అన్నారు.

ఇండస్ట్రీలో సిల్క్ స్మితకు ఎన్నో అవమానాలు జరిగాయి. వాటిని కసిగా మార్చుకుని సక్సెస్ అయ్యింది. సిల్క్ స్మిత హీరోయిన్ అయిపోయి, మంచి మార్కెట్ వచ్చిన తర్వాత ఒక ఫంక్షన్‌లో ఆమె కొరికిన యాపిల్ పండును వేలం వేస్తే 25 వేల రూపాయలకు కొన్నారు. అంత క్రేజ్ సిల్క్ అంటే. మహారాణిలా బతికింది, సిల్క్ స్మిత్ సాంగ్ ఉంటేనే డిస్ట్రిబ్యూటర్లు సినిమాను కొనేవాళ్లు. వ్యక్తిగతంగా చాలామంచిది, సెట్‌లో మాత్రం మెయింటైన్స్ అలాగే ఉండేది. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని కొందరు.. ఒక డాక్టర్ వల్లే ఆమె చనిపోయిందని మరికొందరు అంటారు. కారణం ఏదైనా సరే ఒక మంచి నటిని కోల్పోయామన్నారు.

సిల్క్ స్మితకి ఓ డాక్టర్ ఫ్రెండ్ ఉండేవాడు.. నువ్వు ఎంతకాలం ఇలాంటి వ్యాంప్ వేషాలు వేస్తావు, హీరోయిన్ అవ్వమని సినిమాలు తీయించాడు. ఆ సినిమాలు బాగా దెబ్బతిన్నాయి. హీరోయిన్‌గా చేస్తుండటంతో సిల్క్‌ను ఐటెం సాంగ్స్‌కు పిలవడం మానేశారు. హీరోయిన్‌గా ఫ్లాప్ కావడం, సినిమాలలో ఆఫర్లు పోయాయి. ఈవిడ డబ్బుని ఆ డాక్టర్ వెనకేసుకున్నాడు, చివరికి సిల్క్ స్మిత ఉరేసుకుని ప్రాణం తీసుకుందని జయకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సిల్క్ స్మిత క్రేజ్‌ తెలిసి షాక్ అవుతున్నారు.

Read more about: silk smitha movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X