For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్, ఉదయనిధి స్టాలిన్ ముందు శింబుతో నా పెళ్లి.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్

    |

    తమిళ హీరో శింబుకు సంబంధించిన అఫైర్లు, పెళ్లి వార్తలు నిత్యం మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. చాలా రోజుల తర్వాత శింబు భారీ హిట్‌ను లైఫ్ ఆఫ్ ముత్తు (వేందు తానిందాతు కాడు) సినిమాతో సొంతం చేసుకొన్నాడు. ప్రస్తుతం శింబు ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ ప్రమోషన్ ఈవెంట్లో శింబుకు నాకు పెళ్లి అంటూ హీరోయిన్ సిద్ది ఇద్నానీ చేసి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్త వివరాల్లోకి వెళితే..

    జంబలకిడి పంబ మూవీతో

    జంబలకిడి పంబ మూవీతో

    సిద్దూ ఇద్నానీ విషయానికి వస్తే.. శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన జంబలకిడి పంబ సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తమిళంపై దృష్టిపెట్టింది. ఏకంగా శింబుతో వేందు తానిందాతు కాడు సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం తమిళంలో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొన్నది.

    శింబుతో డేటింగ్ రూమర్లపై

    శింబుతో డేటింగ్ రూమర్లపై

    వేందు తానిందాతు కాడు సినిమా ప్రమోషన్‌లో శింబుతో రిలేషన్ గురించి అడిగిన ప్రశ్నకు సిద్ది ఇద్నానీ కాస్త బ్యాలెన్స్ తప్పింది. తనపై డేటింగ్ రూమర్లు రావడంతో సహనం కోల్పోయిన సిద్ది.. అవును.. శింబుతో రిలేషన్ ఉంది. మా ఇద్దరి పెళ్లి రజనీకాంత్, ఉదయనిధి స్టాలిన్ ముందు జరుగుతుంది అని వ్యాఖ్యానించింది.

    రజనీ, స్టాలిన్ ముందు

    రజనీ, స్టాలిన్ ముందు

    శింబుతో కలిసి మళ్లీ నటిస్తారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఎందుకు నటించం. నేను శింబు.. స్కూల్ మేట్స్. ఇద్దరం కలిసే నటిస్తాం. రజనీకాంత్ నా ఫాదర్. ఉదయనిధి స్టాలిన్ శింబు సోదరుడు. ఒకవేళ మా ఇద్దరి పెళ్లి ఉదయనిధి స్టాలిన్, రజనీకాంత్ చేస్తే బాగుంటుందేమో అని సిద్ది ఇద్నానీ అన్నారు. ఆమె జోక్ చేస్తూ చెప్పిన మాటలు ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    భారీ సక్సెస్ అందుకొన్న శింబు

    భారీ సక్సెస్ అందుకొన్న శింబు

    వేండు తానిందాతు కాడు సినిమా ప్రస్తుతం తమిళంలో విడుదలై మంచి స్పందనను అందుకొంటున్నది. తమిళనాడులోని ఓ చిన్న ఊరుకు చెందిన యువకుడు.. ముంబైలో డాన్‌గా ఎదగడం అనే కథతో ఈ సినిమా రూపొందింది. తెలుగులో లైఫ్ ఆఫ్ ముత్తుగా రిలీజ్ కానున్నది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

    గౌతమ్ మీనన్ దర్శకత్వంలో

    గౌతమ్ మీనన్ దర్శకత్వంలో

    గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందిన లైఫ్ ఆఫ్ ముత్తు సినిమాకు ప్రముఖ రచయిత జయమోహన్ కథను అందించారు. తమిళంలో రూపొందిన గ్యాంగస్టర్ సినిమాల్లో బెస్ట్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఏఆర్ రెహ్మన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా పాటల, మాటలకు మంచి రెస్పాన్స్ వస్తున్నదనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తున్నది. త్వరలోనే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Siddhi Idnani is now cloud nine with Vendhu Thanindadhu Kaadu success. She made comments thtat, Simbu and I will get married in front of Rajinikanth and Udhayanidhi Stalin
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X