Nayanatara: నయనతార ప్రైవేట్ ఫోటో లీక్.. ఆ హీరోతో కలిసి ఓ రేంజ్ రొమాన్స్
Nayantara: సౌత్ ఇండియాన్ లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన హీరోయిన్ నయనతార. ఈ మళయాళి కుట్టి తెలుగు, తమిళ, కన్నడ లోని టాప్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో కుర్రాళ్ల కలల రాణిగా మంచి క్రేజీ స్టార్‌గా వెలుగొందుతోంది. అందం,అభినయంలో ఈ అమ్మడు తానే సాటి. గత మూడేండ్ల కిత్రం డైరెక్టర్ విఘ్నేశ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పైగా ఇద్దరు పిల్లలు తల్లి కూడా. ఇప్పుడు అంతా సాఫీగా ఉన్నా.. ఆమె జీవితంలో బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. లవ్, డేటింగ్ అంటూ ఈ అమ్మడుపై ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే.. తాజాగా ఈ అమ్మడు ఓ హీరోతో కలిసి దిగిన ప్రైవేట్ ఫోటో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరో మీరూ కూడా ఓ లూక్కేయండి.
నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. సాధారణ టీవీ యాంకర్ నుండి కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది. ఈ క్రమంలోని తెలుగు, తమిళం, మలయాళం ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఓ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే ఈమె కెరీర్ ఎంత సక్సెస్ఫుల్గా సాగిందో.. పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, మోసాలను ఎదుర్కొంది. తన కెరీర్ ప్రారంభంలో హీరో శింబుతో ప్రేమాయణం కొనసాగించింది. వీరిద్దరూ కలిసి పార్టీలు, పబ్బులు అంటూ తిరుగుతూ పలుమార్లు మీడియా కంటపడ్డ విషయం కూడా తెలిసిందే..

ఈ క్రమంలో సడెన్ ఈ అమ్మడుకు సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చి సోషల్ మీడియాను కుదిపేసింది. నయన్ తన మాజీ ప్రియుడు సింబుతో కలిసి ఉన్న కొన్ని ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఆ ఫోటోలు అప్పట్లో చాలా సంచలనం సృష్టించాయి. ఈ ఫోటోలు మరోసారి వైరల్ కావడంతో నయనతార అభిమానులు కూడా తీవ్రంగా షాక్ అయ్యారు. ఈ ఫోటోల్లో శింబు,నయనతార ఒకరికొకరు చాలా దగ్గరగా ఉన్నారు. పార్టీలలో ఎంజాయ్ చేస్తున్నటు ఆ ఫోటోలో చూడవచ్చు.
నయనతార, శింబు మధ్య వివాదాలు తలెత్తినప్పుడూ ఈ ఫోటోలు బయటపడ్డాయి. ఈ బాధను తట్టుకోలేక నయనతార శింబుతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకుంది. దీనికి శింబును నయనతార నిందించింది. చాలా సంవత్సరాల తరువాత శింబు ఈ విషయంపై వివరణ ఇచ్చాడు. దీనితో తాను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పాడు. కానీ, తాను ఈ పని చేయలేదనీ, ఆ ఫోటోలు దుబాయ్‌లో తామిద్దరం కలిసి తీసినట్లు అతను అంగీకరించాడు. దీని తరువాత.. ఆ ఫోటోలు ఎలా లీక్ అయ్యాయో తనకు మాత్రం తెలియదన్నారు.
శింబు, నయనతార చాలా సినిమాల్లో కలిసి నటించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుదేంది. కానీ, ఆ తరవాత వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. దీంతో వీరు విడిపోయారు. ఈ బ్రేక్అప్ తర్వాత నయనతార తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలో ప్రభుదేవా తో పరిచయం ప్రేమగా మారింది వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ కూడా ఇండస్ట్రీలో నడిచింది.

కానీ, ప్రభుదేవా మొదటి భార్య దీనికి అడ్డు చెప్పడంతో మీరు కూడా తమ బంధాన్ని పెంచుకోవాల్సి వచ్చింది. ప్రభుదేవాతో విడిపోయిన నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్నాళ్ల తర్వాత ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. వీరికి ఇద్దరు సంతానం ప్రస్తుతం నయన తార.. ఇటు సౌత్ లోనూ.. అటు నార్త్ లోను దుమ్ము రేపుతుంది. సౌత్ ఇండియా లేడీస్ సూపర్ స్టార్ గా రాణిస్తోంది.
అంత సాఫీగా సాగుతున్న తరుణంలో తాజాగా నయనతార కు సంబంధించిన ఓల్డ్ ఫోటోలు వైరల్ కావడంతో అటు నయనతార, ఆమె అభిమానులు కూడా కాస్త కంగారు పడుతున్నారు. ఏది ఏమైనా సెలబ్రిటీల జీవితం తెరిచిన పుస్తకం లాంటిది ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టమేనని చెప్పాలి.


Click it and Unblock the Notifications











