విడాకులు తీసుకుంటున్న బాలయ్య హీరోయిన్.. భర్తతో చూసి షాకయ్యాను అంటూ!
సాధారణంగా సినీ రంగంలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తుంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే అందం, అభినయంతో ఎప్పటికీ గుర్తుండిపోయేలా మారిపోతారు. అలాంటి వారిలో బొద్దుగుమ్మ నమిత ఒకరు.
చాలా కాలం క్రితమే సినీ రంగంలోకి వచ్చిన ఈ భామ.. ఎన్నో ఏళ్ల పాటు వరుసగా మూవీలు చేసి అలరించింది. అయితే, వివాహం తర్వాత మాత్రం సినిమాలకు కాస్త దూరంగానే ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో నమిత ఇప్పుడు భర్తకు విడాకులు ఇస్తుందని టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె దీనిపై ఏం చెప్పిందో మీరే చూడండి!

అలా వచ్చి.. ప్లాప్ హీరోయిన్‌గా
'సొంతం' అనే సినిమాతో నమిత హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత టాలీవుడ్‌లోని దాదాపు చాలా మంది హీరోలతో కలిసి నటించింది. కానీ, ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. దీంతో ఫ్లాప్ హీరోయిన్‌గా ఆమెకు ముద్ర పడిపోయింది. ఈ కారణంగానే మిగిలిన భాషల సినిమాల్లో నటించి సక్సెస్ బాటలో పయనించింది. దీంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది.

బాలయ్యతో లాస్ట్.. అక్కడలా
నందమూరి బాలకృష్ణ నటించిన 'సింహా' సినిమానే నమితకు చివరిది. ఆ తర్వాత మరో ద్విభాషా చిత్రంలో నటించి టాలీవుడ్‌కు బైబై చెప్పేసింది. కానీ, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ చిత్రాల్లో మాత్రం ఆమె నటించింది. అంతేకాదు, ఓ ఇంగ్లీష్ సినిమాలో సైతం లీడ్ రోల్ చేసింది. తెలుగులో ప్రభాస్ 'బిల్లా' నమిత చేసిన హాట్ షో అందరికీ గుర్తే ఉంటందని చెప్పాలి.
బిగ్ బాస్ ఎంట్రీతో మరింత
తమిళంలో ఎన్నో వివాదాల నడుమ ప్రసారం అయిన షోలలో బిగ్ బాస్ ఒకటి. దీని మొదటి సీజన్‌లో నమిత కంటెస్టెంట్‌గా పాల్గొంది. హౌస్‌లో ఈ అమ్మడు వ్యవహరించిన తీరు, వేసుకున్న బట్టల విషయంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో నమిత ఓ రేంజ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది. షో తర్వాత పలు చిత్రాల్లో నటించే అవకాశాలు సైతం అందుకుంది.

తెలుగు వ్యక్తిని పెళ్లాడింది
కాస్త లావుగా ఉన్నప్పటికీ నమితకు వరుస అవకాశాలు వచ్చాయి. ఇలాంటి సమయంలోనే 2017లో వీరేంద్ర చౌదరి అనే తెలుగు అబ్బాయిని వివాహం చేసుకుందామె. అప్పటి నుంచి సినిమాల వేగం తగ్గించడంతో పాటు ఫిజిక్‌పైనా దృష్టి సారించింది. ఎక్కువ సమయం జిమ్‌లో గడుపుతూ చాలా వరకు బరువు తగ్గిపోయింది. ఆ తర్వాత నమిత ఇద్దరు బిడ్డలకు సైతం తల్లైంది.
భర్తకు విడాకులు ఇస్తోంది
దాదాపు ఇరవై ఏళ్ల పాటు హీరోయిన్‌గా నమిత సినీ రంగంలో యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజకీయాల్లోనూ యాక్టివ్ అయింది. ఇప్పుడు వైవాహిక జీవితాన్ని కూడా చక్కగా నడుపుకుంటోంది. ఈ పరిస్థితుల్లో నమిత తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందని ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది. దీంతో ఈ అమ్మడి పేరు మరోసారి దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయింది.

అవి చూసి నవ్వు వస్తుంది
విడాకుల వార్తలపై నమిత స్పందిస్తూ.. 'ఇటీవలే నేను నా భర్తతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాను. అయినప్పటికీ మేము విడిపోయాం లేదా విడాకులు తీసుకున్నాం అంటూ కొందరు ప్రచారం చేయడం చూస్తుంటే నవ్వు వస్తుంది. నేను నటిగా గతంలో ఎన్నో పుకార్లు ఎదుర్కొన్నాను. కాబట్టి ఈ ప్రచారం నన్ను పెద్దగా ప్రభావితం చేయలేదు' అని చెప్పింది.
షాకై నవ్వుకున్నాం అంటూ
నమిత కంటిన్యూ చేస్తూ.. 'విడాకుల వార్తలు మీడియాలో చూసి మేము షాకయ్యాం. తర్వాత నవ్వుకున్నాం. ఇలాంటి పుకార్లను పుట్టించడం ద్వారా మీకు ఏం వస్తుంది? ఇప్పటికైనా ఈ చెడు ప్రచారం చేయడం ఆపుతారని ఆశిస్తున్నా. ముందు ముందు అయినా ఆగుతాయి అని నమ్ముతున్నాను' అని వెల్లడించింది. తద్వారా విడాకుల వార్తలను నమిత ఖండించింది.


Click it and Unblock the Notifications











