50 ఏళ్ల వయసులో 20 ఏళ్ల కుర్ర హీరోయిన్‌లా.. సిమ్రాన్ ధర్మన్ లుక్ ఫోటోలు ట్రెండింగ్
సినీ పరిశ్రమలో ఎందరో ముద్దుగుమ్మలు ఉన్నారు. కానీ కొందరు మాత్రమే తమదైన ముద్ర వేస్తుంటారు. నిజానికి హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. ఇంతటి షార్ట్ పీరియడ్‌లోనే తమను తాము నిరూపించుకోవడంతో పాటు ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ పోరాటం సాగిస్తుంటారు హీరోయిన్లు. వీరిలో కొందరు వయసు పెరుగుతున్నప్పటికీ ఇంకా యవ్వనంగానే కనిపిస్తుంటారు. ఈ కోవలోకే వస్తారు అలనాటి నటి సిమ్రాన్. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
రిషిబాలా నావల్ అంటే ఎవ్వరికీ అర్ధం కాకపోవచ్చు.. కానీ సిమ్రాన్ అంటే చాలు టక్కున గుర్తుపట్టేస్తారు. 90వ దశకంలో తన అందం, నటనతో కుర్రాళ్లకు పిచ్చెక్కించారు సిమ్రాన్. మంచి హైట్, ఫిగర్‌తో నాటి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేశారు. ముంబైలో పుట్టి పెరిగిన సిమ్రన్‌కు జ్యోతి, మోనాల్ అనే తోబుట్టువులు ఉన్నారు. మోనాల్ కూడా నటుడే.. అయితే అనివార్య కారణాలతో చిన్న వయసులోనే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

1995లో సనమ్ హరిజాయ్ అనే హిందీ మూవీతో సిమ్రాన్ బాలీవుడ్‌లో అడుగుపెట్టి తన అందం, నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. 1997లో సుమన్ హీరోగా వచ్చిన అబ్బాయి గారి పెళ్లి మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్.. ప్రియా ఓ ప్రియ, మా నాన్నకు పెళ్లి, సమర సింహా రెడ్డి, కలిసుందాం రా, నరసింహ నాయుడు, నువ్వు వస్తావని తదితర సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా వెలిగొందారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అగ్రనటులు అందరితోనూ కలిసి నటించారు. ప్రస్తుతం ధ్రువ నక్షత్రం, గాబ్రూ, ధర్మన్ సినిమాలలో నటిస్తున్నారు సిమ్రాన్. వెండితెరతో పాటు బుల్లితెరపైనా ఆకట్టుకున్న సిమ్రాన్.. పలు సీరియల్స్‌లో నటించి రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే దీపక్ బగ్గాను పెళ్లాడారు సిమ్రాన్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.
మూడు దశాబ్ధాల కెరీర్‌లో ఎలాంటి వివాదం లేకుండా తన ప్రస్థానాన్ని సాగిస్తున్నారు సిమ్రాన్. అయితే ఇటీవల ఓ అవార్డ్ ఫంక్షన్‌లో మాత్రం ఆమె కాస్త నోరుజారారు. తన ఫ్రెండ్ అయిన ఓ కో స్టార్ చేసిన సినిమాను మెచ్చుకుంటూ మెసేజ్ చేశాను. నిజానికి ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, కానీ ఇలాంటి రోల్స్ ఎందుకు చేశావని అడిగితే ఆంటీ రోల్స్ కంటే ఇలాంటివి చేయడం మంచిదని ఆన్సర్ ఇచ్చిందని సిమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సిమ్రన్ ఎప్పటికప్పుడు తన సినిమాలు, షూటింగ్స్, షోలు, ఇతర వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఈ వయసులోనూ ఫోటోషూట్స్‌తో అలరిస్తుంటారు. తాజాగా పోటోషూట్‌లో పాల్గొన్న సిమ్రాన్ దీనికి సంబంధించిన ఫోటోలు, చిత్రీకరణ తాలూకా వీడియోలను పంచుకున్నారు. అందులో వెరైటీ షర్ట్ ధరించి జీన్స్ ప్యాంట్‌లో ఫోటోలకు ఫోజులిస్తూ అల్లరి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా.. 50 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల యువతిలా మీ అందం ఏ మాత్రం చెక్కుచెదరలేదంటూ సిమ్రాన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications


