మనమంటే చిన్నచూపు.. కనీస గౌరవం కూడా ఇవ్వరు..

90లలో సౌత్ సినిమా ఇండస్ట్రీలో తన అందం,అభినయంతో ఏలిన స్టార్ హీరోయిన్లలో సిమ్రాన్ ఒకరు. ఎంతోమందికి ఈ అమ్మడు ఫెవరేట్ హీరోయిన్. జీరో సైజ్ నడుముతో కుర్రకారును కట్టిపడేసింది. అద్భుతమైన నటనతో పాటు ఆహా అనిపించే అందంతో మెప్పించింది. యంగ్ హీరోల దగ్గర నుంచి అగ్రహీరోల వరకు అందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది . ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలందరి సరసన నటించి వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంది. ఇప్పుడు మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఏమన్నారంటే?

గతంలో తెలుగు, తమిళ ప్రేక్షకులను తన గ్లామర్, డ్యాన్స్, నటనతో అలరించిన సిమ్రాన్.. దాదాపు దశాబ్దకాలం పాటు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగారు. ముఖ్యంగా ఆమె చేసిన డ్యాన్స్‌లు అప్పట్లో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మెరుపు తీగలా కనిపించే ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌కు అభిమానులు ఫిదా అయ్యేవారు. ప్రస్తుతం టాలీవుడ్‌కు కొంత దూరంగా ఉన్న సిమ్రాన్.. తమిళంలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించారు.

Simran Shocking Comments on Bollywood

అలాగే సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటూ డాన్స్ వీడియోలు, వ్యక్తిగత అప్‌డేట్‌లు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉన్నారు. అయితే తాజాగా ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిమ్రాన్ మాట్లాడుతూ హిందీ ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాలను బహిరంగంగా పంచుకున్నారు. "చాలాసార్లు నాకు బాలీవుడ్ నుండి ఆఫర్లు వచ్చాయి. కానీ నేను వాటిని ఎక్కువగా తిరస్కరించాను. ఎందుకంటే అక్కడి వాళ్లతో నాకు సరైన కమ్యూనికేషన్ కుదరలేదు. ముఖ్యంగా మేము సౌత్‌లో సంపాదించిన పేరు, లెగసీని అస్సలు గుర్తించలేదు. మేము ఏదో కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మాతో నటించాము" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

అంతేకాదు, బాలీవుడ్‌లో సీనియర్ నటీనటులకు కూడా సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆమె ఉంది. "సినిమాలే జీవితం అనుకుని పనిచేసే మా లాంటి వాళ్లను కూడా అక్కడ తక్కువ చేసి చూస్తారు. వసతి సౌకర్యాల దగ్గర నుంచి విమాన టిక్కెట్లు, హోటల్ గదుల వరకు ప్రతి విషయంలోనూ బేరసారాలు చేస్తారు. మాతో వచ్చే స్టాఫ్ సంఖ్యను కూడా తగ్గించమంటారు. ఇవన్నీ చిన్న విషయాల్లో కనిపించినా.. ఒక నటిగా అవి మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయి" అంటూ సిమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆమె మాటల్లో ప్రధానంగా వినిపించిన అంశం "ఆధిపత్య భావన". బాలీవుడ్ వర్గాల్లో కొందరు సౌత్ నటులపై ఆధిక్యం చూపించాలని చూస్తారని, అదే తనకు అస్సలు నచ్చలేదని ఆమె స్పష్టం చేశారు. "మేము ఇప్పటికే ఎన్నో ఏళ్లు ఇండస్ట్రీలో పనిచేసి ఒక స్థానం సంపాదించుకున్నాం. కానీ అక్కడ మాత్రం ఆ గౌరవం కనిపించదు" అంటూ సిమ్రాన్ పేర్కొన్నది. దీంతో ప్రస్తుతం దక్షిణాది నటులకు బాలీవుడ్‌లో సరైన గుర్తింపు దక్కుతోందా లేదా అనే అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అయితే బాలీవుడ్‌లో అందరూ ఒకేలా ఉండరని కూడా సిమ్రాన్ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా సన్నీ డియోల్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఎంతో వినయంగా ఉంటారని, తనతో చాలా గౌరవంగా ప్రవర్తించారని అన్నారు. "సన్నీ డియోల్ లాంటి వాళ్లు చాలా మంచివారు. కానీ అందరూ అలా ఉండరు" అంటూ ఆమె చెప్పింది. ఇప్పుడు సిమ్రాన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. చాలామంది నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

Read more about: tollywood simran bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X