Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
నయనతారపై అశ్లీల కామెంట్స్.. తల్లి పాలు తాగలేదా.. కూతుళ్ళను కూడా ఇలానే చూస్తారా: చిన్మయ కౌంటర్
చూడగానే అందమైన చిరునవ్వుతో ఎంతగానో ఆకట్టుకునే నయనతారపై అప్పుడప్పుడు ఊహించిన విధంగా కొంత బాడీ ట్రోలింగ్ కామెంట్స్ కూడా వస్తోంది. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో అలాంటి దారుణమైన కామెంట్స్ అయితే ఊహించని స్థాయిలోనే వస్తున్నాయి. నయనతారపై కొందరు చేసిన వ్యాఖ్యలపై సింగర్ అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

10 ఏళ్ళ తరువాత..
ఇటీవల నయనతార కనెక్ట్ అనే సినిమాలో నటించింది. అయితే ఆమె ప్రమోషన్స్ లో పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ. ఇక కనెక్ట్ సినిమా కోసం ఆమె దాదాపు 10 ఏళ్ళ అనంతరం తెలుగు తమిళ్ లో ప్రమోషన్స్ చేయడం విశేషం. ముఖ్యంగా తెలుగులో ఆమె చేసిన ఒక ఇంటర్వ్యూ బాగా వైరల్ అయ్యింది. మన స్టార్స్ గురించి ఆమె వివిధ రకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

అసభ్యకరంగా కామెంట్స్
ఇక రీసెంట్ గా కనెక్ట్ సినిమాకు సంబంధించిన స్పెషల్ ప్రీమియర్ షోలకు కూడా నయనతార హాజరయ్యారు. అలాగే ఆమెతో పాటు భర్త విగ్నేష్ శివన్ కూడా వచ్చాడు. అయితే ఆ సమయంలో నయనతార వేసిన డ్రెస్సింగ్ స్టైల్ పై సోషల్ మీడియాలో విభిన్నమైన కామెంట్స్ వచ్చాయి. ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ కొందరు అసభ్యకరంగా చేసిన కామెంట్స్ కూడా నయన్ ఫ్యాన్స్ కు చిరాకు తెప్పించాయి.

రంగంలోకి చిన్మయి
నయనతార ఎప్పుడు కూడా వల్గర్ గా కనిపించేలా ప్రవర్తించదు అని ఫ్యాన్స్ అయితే బ్యాడ్ కామెంట్స్ చేసిన వారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ట్రోలింగ్ కామెంట్స్ డోస్ మరింత ఎక్కువ కావడంతో నయనతారకు మద్దతు పలుకుతూ సింగర్ చిన్మయి స్పందించారు. ఆమె అందరికీ అదిరిపోయేలా సమాధానం ఇచ్చారు.

స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సింగర్
సింగర్ చిన్మయి మహిళల సపోర్ట్ చేయడంలో ఎప్పుడు కూడా ముందుంటుంది. ఇక నయనతార పై నెగిటివ్ గా అసభ్యంగా రియాక్ట్ అయిన వారికి ఆమె గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇలాంటి వాళ్ళు తల్లి పాలు తాగే పెరిగారా? ఒక అమ్మాయిని అలా కామెంట్ చేసినప్పుడు ఇంట్లో మహిళలు గుర్తుకు రారా? వీరి ముందు చెల్లి, తల్లి ఎవరైనా సరే దుప్పట కప్పుకొని తిరగాలేమో అని నయన్ దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది.

అడపిల్లలను దూరంగా..
ఇలాంటి కామెంట్స్ చేసేవారు ఆడపిల్లకు తండ్రి అయినా సోదరుడైనా ఇంట్లో కూడా ఇలాంటి దుర్భిద్దితోనే ఉంటాడేమో అని కౌంటర్ ఇచ్చింది. మహిళలు కూడా ఇలాంటి పురుషులకు అడపిల్లలను దూరంగా ఉంచలని.. కూడా ఆమె సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. గతంలో చాలామంది హీరోయిన్స్ పై ఈ తరహా కామెంట్స్ చేసినప్పుడు చిన్మయి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.