నా బాడీ నా ఇష్టం.. నేను ఇలానే ఉంటా.. ఎవ్వరేమన్న పట్టించుకోను..
సినీ సెలబ్రిటీలు ఎప్పుడు ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తారు. కొందరు రిలేషన్స్ విషయంలో వార్తలు నిలుస్తే.. మరికొందరు తమ సెన్సేషనల్ కామెంట్స్ తో వివాదాలలో చిక్కుకుంటారు. అలాగే కొందరు హీరోయిన్స్ తమ డ్రెస్సింగ్ విషయంలో ట్రోలింగ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. కానీ, ఓ టాలీవుడ్ సింగర్ తన డ్రెస్సింగ్ పై వస్తున్న ట్రోల్స్ ను తిప్పికొట్టింది. తాను ఎవరేమన్నా పట్టించుకోనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ టాలీవుడ్ సెన్సేషనల్ సింగర్ ఎవరు? ఓ లుక్కెయ్యండి.
ఆ అమ్మడు ఎవరో కాదు. టాలీవుడ్ గాయని దామిని భట్ల (Damini). ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మధురమైన గొంతుతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ తెలుగు అమ్మాయి.. మొదట కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందింది. ఈ అమ్మడు 'పాడుతా తీయగా', 'సరిగమప లిటిల్ చాంప్స్' వంటి సింగింగ్ షో లలో పాల్గొని మెప్పించింది. ఈ సింగింగ్ షోల ద్వారా వచ్చిన ఫేమ్ తో 2014 నుండి సినిమా పాటలు పాడడం మొదలుపెట్టింది.

ఇలా 'లవ్ ఇన్ లండన్', 'బాహుబలి ది బిగినింగ్', 'మనసంతా', 'నిర్మలా కాన్వెంట్' వంటి సినిమాలలో పాటలు పాడి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.దామిని కెరీర్లో బాహుబలి 1 సినిమాలో పాడిన 'పచ్చబొట్టేసినా పాట' తనకు ఎనలేని గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత బిగ్బాస్ సీజన్ లో పాల్గొని మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అదే సమయంలో ఈ అమ్మడు డ్రెస్సింగ్ పై నెటిజన్లు ట్రోలింగ్ బరిన పడింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్ దామిని మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలను బిగ్ బాస్ లోని అనుభవాలను పంచుకుంది. తనపై వచ్చిన ట్రోలింగ్స్ ను తీవ్రంగా ఖండించింది.
గాయని దామిని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..' నా బాడీ నా ఇష్టం. నా బట్టలు నా ఇష్టం. నేను ఇలానే ఉంటాను. నేను ఎలా ఉన్నా కామెంట్ చేస్తూనే ఉంటారంటూ సెన్సియేషన్ కామెంట్స్ చేసింది. ఉదాహరణకు నేను చీర కట్టుకొని గుడికి వెళ్లాను. కానీ, స్లీవ్ లెస్ బ్లౌస్ వేసుకున్నాననుకోండి. అక్కడ నేను కట్టుకున్న చీరను చూడరు. స్లేవ్ లెస్ బ్లౌస్ వేసుకుని ఎలా వచ్చావ్? అంటూ కామెంట్ చేసే వాళ్లే ఎక్కువ ఉంటారు. అలాగే పాజిటివిటీని కాకుండా నెగటివ్ ని ఎక్కువగా స్ప్రేడ్ చేసేవాళ్లు ఉంటారని, అలాంటి విషయాలను పట్టించుకోకపోవడం బెటర్ అంటుంది సింగర్ దామిని.

'మా ఇంట్లో వాళ్లు కూడా నా డ్రెస్సింగ్ మీద అభ్యంతరం చెప్పారు. కానీ, వారి మాట తను వినలేదని, వారి కూడా తాను ఒకటే విషయం చెప్పానంటూ.. నాకు నచ్చిన డ్రెస్ ను నేను వేసుకుంటాననీ, హీరోయిన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకరి గురించి మన అభిప్రాయం మార్చుకోవాల్సిన అవసరం లేదు అంటూ సమాధానం ఇస్తానని చెప్పింది. ఈ సమయంలో తన తల్లి తనని తిడుతుందని, బుజ్జగించి చెప్తుందని, అయినా.. ఇతరుల కోసం తన అభిప్రాయాన్ని మార్చుకోవడం తనకి ఇష్టం లేదంటూ సింగర్ దామిని కామెంట్స్ చేసింది.
ఇక బిగ్‌బాస్ (Bigg boss 7)విషయానికి వస్తే.. హౌస్‌లో టాస్క్‌ల సమయంలో గెలవడానికి తన వంతు ప్రయత్నం చేశాననీ, కంటెస్టెంట్లతో తాను ఎలాంటి గొడవలు పెట్టలేదని అన్నారు. అలాగే.. తాను హౌస్ లో ఉన్ననని రోజు.. ఎవరిని కూడా కించపరిచేలా మాట్లాడలేదని, ఆరోజు ఏదో అనుకోకుండా మాట జారానని, అది కూడా ఎవర్ని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేయలేదని చెప్పుకొచ్చింది. తనపై వస్తున్న ట్రోలింగ్స్ ను తాను ఎప్పుడు పట్టించుకోలేదని, అలాంటి సమయం కూడా తనకు లేదని చెప్పి సింగర్ దోమిని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











