నా భర్తకు మరో అమ్మాయితో అఫైర్.. నా కొడుకు ముందు వాళ్లు అలా..
తెలుగు సినిమా పాటల ప్రపంచంలో ఒకప్పుడు తన మధుర గాత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని కౌసల్య. 'నీకోసం' సినిమాతో సింగర్‌గా కెరీర్ ప్రారంభించిన కౌసల్య, తక్కువ సమయంలోనే ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. "రా... రమ్మని", "లంచ్‌కొస్తావా.. మంచుకొస్తావా", "వల్లంకి పిట్టా.. వల్లంకి పిట్టా" వంటి సూపర్ హిట్ పాటలతో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దాదాపు 300కు పైగా పాటలు పాడిన కౌసల్య, 'సత్యభామ' సినిమాలోని 'గుండెలోన' పాటకు నంది అవార్డు కూడా అందుకున్నారు.
ముఖ్యంగా దివంగత సంగీత దర్శకుడు చక్రి సారథ్యంలో కౌసల్య పాడిన ఎన్నో పాటలు చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. ఆ కాలంలో స్టార్ సింగర్‌గా గుర్తింపు పొందిన ఆమె, ఒక దశలో ఇండస్ట్రీలో హాట్ ఫేవరెట్‌గా మారింది. అయితే కాలక్రమేణా ఆమె వెండి తెర పాటల నుంచి దూరమవ్వడంతో, కౌసల్య గాత్రాన్ని అభిమానులు నేటికీ మిస్ అవుతూనే ఉన్నారు. సక్సెస్‌తో పాటు ఆమె జీవితంలో విషాదం కూడా ఉందన్న విషయం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో కౌసల్య తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ ఇంటర్వ్యూలో ఆమె తన విడాకులు, మాజీ భర్త నుంచి ఎదుర్కొన్న గృహహింస గురించి తొలిసారిగా ఓపెన్‌గా మాట్లాడారు. కౌసల్య మాట్లాడుతూ, తాను ఆరు సంవత్సరాలకు పైగా ఒక అబ్యూసివ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నానని వెల్లడించారు. ఆ పరిస్థితి నుంచి బయటకు రావడానికి చాలా ఆలస్యం కావడానికి కారణం తన తల్లిదండ్రులు, చెల్లి, అలాగే సెలబ్రిటీగా తనపై పడే సామాజిక ఒత్తిడేనని చెప్పింది. "విడాకులు తీసుకుంటే సమాజం, మీడియా ఎలా స్పందిస్తాయో అన్న భయం నన్ను మౌనంగా ఉంచింది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాదు, తన మాజీ భర్తే కోర్టులో ముందుగా కంజూగల్ రైట్స్ కోసం కేసు వేశాడని, తన భార్య తనను ఇంట్లోకి రానివ్వడం లేదని ఆరోపించాడని తెలిపారు. అయితే వాస్తవంగా అతడే తనను ఇంటి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడని కౌసల్య స్పష్టం చేశారు. నిజాలు బయటకు చెప్పలేని పరిస్థితుల్లో తన ప్రతిష్ట, కుటుంబ పరువు కోసం చాలా కాలం బాధను భరించాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. భర్త నుంచి ఎన్నో చిత్రహింసలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తన కొడుకు భవిష్యత్తు కోసమే ఆ బాధలన్నీ మౌనంగా భరించానని చెప్పింది.
'నా సొంత ఇష్టాలకు చోటు లేకుండా చేశారు. నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నదీ భర్తే నిర్ణయించేవాడు' అంటూ తన జీవితంలోని కఠిన అనుభవాలను గుర్తు చేసుకుంది. తనకు ఇంట్లో ఏమాత్రం స్వేచ్ఛ ఉండేది కాదని, భర్తతో పాటు అతని కుటుంబ సభ్యుల నుంచీ కూడా ఒత్తిళ్లు ఎదురయ్యాయని కౌసల్య తెలిపింది. ఆ పరిస్థితులు తట్టుకోలేక చాలాసార్లు లోలోపల బోరున విలపించానని చెప్పింది. అంతేకాదు, తన భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని, వారిద్దరూ కలిసి ఉండటం, కలిసి తిరగడం తన కొడుకు కూడా చూడాలని షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఆ తర్వాతే విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చానని వెల్లడించింది.
డబ్బు విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, తన అనుభవమే అందుకు నిదర్శనమని ఆమె సూచించింది. ఆఫర్లు లేకుండా పోయినప్పుడు, "ఇప్పుడు ఏం చేస్తున్నావ్?" అని ఎవరు అడిగినా సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చిందని చెప్పింది. "స్టార్ డమ్ ఉన్నప్పుడు డబ్బు ఎప్పటికీ ఉంటుందనే భ్రమలో వృథా చేసుకున్నాను. జీవితం నాకు ఇది నేర్పిన పెద్ద పాఠం" అంటూ నిజాయితీగా మాట్లాడింది. ఆ తర్వాతే తనను తాను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మ్యూజిక్ అకాడమీని ప్రారంభించానని వివరించింది.


Click it and Unblock the Notifications











