త్రిష పెళ్లిని చెడగొట్టిన యువ హీరో.. లేకపోతే సీఎం ఇంట్లో కోడలిగా.. సింగర్ షాకింగ్ కామెంట్స్

ఇళయ దళపతి విజయ్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ భార్య సంగీత డైవోర్స్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సీనియర్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ పేరు మీడియాలో భారీగా ట్రెండ్ అవుతున్నది. విజయ్‌తో ఓ నటికి వివాహేతర సంబంధం ఉందని భార్య సంగీత తన పిటిషన్‌లో పేర్కొనడంతో ఆ నటి త్రిషనే అని ఆమె పేరు ఆపాదించుకొంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో త్రిష గురించి గతంలో వివాదాస్పద గాయని సుచిత్ర చేసిన కామెంట్స్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. అయితే తాజా వివాదం నేపథ్యంలో త్రిష గురించి వచ్చిన రూమర్లు ఏంటి? సింగర్ సుచిత్ర చేసిన కామెంట్స్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..

త్రిష గత రెండు దశాబ్దాలుగా దక్షిణాది సినిమా రంగంలో స్థిరంగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. ఇండస్ట్రీలోని అగ్ర, యువ హీరోలందరితో కలిసి ఆమె నటించి మెప్పించారు. తమిళ, తెలుగు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు పొందిన పాత్రలు పోషించారు. అయితే టాలెంటెడ్ నటిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా పలువురు హీరోలతో ఆమెకు అఫైర్, డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి.

Trisha Krishnan Suchitra

త్రిషకు ప్రధానంగా రానా దగ్గుబాటితో సుదీర్ఘకాలంగా అఫైర్ ఉందనే వార్తలు వచ్చాయి. వారి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చి ఆగిందనే పుకార్లు మీడియాలో వినిపించాయి. అయితే రానా పెళ్లితో ఆ రూమర్లకు తెరపడింది. రానా పెళ్లి తర్వాత వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే ఆ నిశ్చితార్థం పెళ్లి వరకు వెళ్లకుండానే బ్రేకప్ అయింది. ఆ తర్వాత శింబుతో, ఇతర హీరోలతో డేటింగ్ వార్తలు వినిపించాయి.

ఇలాంటి వార్తలు మీడియాలో వినిపిస్తుండగానే.. 2021 నుంచి విజయ్‌తో త్రిషా రిలేషన్‌షిప్ జోరుగా వినిపించింది. ఎప్పుడైతే విజయ్‌తో త్రిషా సెల్ఫీ ఫోటోను షేర్ చేసిందో అప్పుటి నుంచి వారి బంధం పక్కా అయిందని స్పష్టమైంది. కానీ వారు ఎప్పుడూ మీడియా ముఖంగా దానిని ధృవీకరించలేదు. కానీ విజయ్ భార్య సంగీత చేసిన ఆరోపణలతో ఈ విషయంపై స్పష్టత ఏర్పడింది.

విజయ్, సంగీత విడాకుల వివాదం నేపథ్యంలో సింగర్ సునీత గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విజయ్‌కి త్రిషపై ఆత్మీయమైన ప్రేమ ఉండవచ్చు. కానీ, త్రిష మాత్రం ఉదయనిధిపైనే ఆత్మీయమైన ప్రేమను కలిగి ఉంది. ఆమెకు ఉదయనిధితోపాటు రమ్యకృష్ణన్ అంటే చాలా ఇష్టం. అలాగే ఇండస్ట్రీలో ధనుష్ పేరును చక్కగా ఉపయోగించుకుంటుంది అని పేర్కొన్నారు.

త్రిష గురించి వాస్తవంగా చెప్పాలంటే, స్టాలిన్ కోడలిగా మారాల్సింది. కానీ ఆమె ఎవరినీ పెళ్లి చేసుకోదు. ఆమె వివాహానికి అతీతమైన ప్రేమను మాత్రమే ఆస్వాదిస్తుంది. వరుణ్ మణియన్‌తో జరగాల్సిన వివాహం ఉదయనిధి స్టాలిన్ వల్లే నిలిచిపోయింది. వారిద్దరి పెళ్లిని ఉదయ్ జీర్ణించుకోలేకపోయారు. వారి ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ కావడానికి ఆయనే కారణం అని సంచలన రీతిలో బాంబు పేల్చారు. అయితే సుచిత్ర చేసిన వ్యాఖ్యలను నెటిజన్ల సీరియస్‌గానే తీసుకొన్నారు. ఆమె వారి దగ్గరే ఉండి చూసినట్టు మాట్లాడుతున్నారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదు అంటూ కామెంట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X