స్పోర్ట్స్ బ్రాలో షాకిచ్చిన సార్ హీరోయిన్: ఎద, నాభి అందాలతో అరాచకంగా!
సాధారణంగా టాలీవుడ్‌లోకి ఎంతో మంది హీరోయిన్లుగా వస్తుంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే ఆరంభంలోనే మంచి సక్సెస్‌ను రేటును సొంతం చేసుకుని సత్తా చాటుతుంటారు. అలాంటి వారిలో సౌత్ బ్యూటీ సంయుక్త మీనన్ ఒకరు. చాలా కాలం క్రితమే హీరోయిన్‌గా వచ్చిన ఈ భామ.. తెలుగులో మాత్రం వరుస విజయాలతో సత్తా చాటుతోంది. ఫలితంగా మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటోంది. అలాగే సోషల్ మీడియాలోనూ సంయుక్త సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దాన్ని మీరే చూసేయండి!
అక్కడ పరిచయం : కేరళకు చెందని సంయుక్త మీనన్ 2016లో వచ్చిన 'పాప్‌కార్న్' అనే మలయాళ చిత్రం ద్వారా నటిగా పరిచయమైంది. దీని తర్వాత అదే భాషలో పలు సినిమాల్లోనూ నటించింది. ఆ తర్వాత తమిళంలోనూ కొన్ని సినిమాలు చేసింది. అలా కెరీర్ ఆరంభంలోనే మలయాళం, తమిళంలో చాలా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. దీంతో ఫాలోయింగ్‌ను కూడా పెంచుకుంది.

తెలుగులోకి కూడా : సౌత్‌లో వరుసగా సినిమాలు చేస్తోన్న సంయుక్త మీనన్ 'భీమ్లా నాయక్' మూవీ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మంచి పాత్రను పోషించిన ఈ అమ్మడు.. అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా వరుసగా అవకాశాలను అందుకుంటోంది. ఈ క్రమంలోనే కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార'లో భాగమైంది. ఇది కూడా హిట్ అవడంతో ఆమెకు మంచి పేరొచ్చింది.
సార్‌తో మాయ చేసి : ఇటీవలే సంయుక్త మీనన్.. ధనూష్ హీరోగా చేసిన 'సార్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో ఆమె అందరినీ తన నటనతో మాయ చేసింది. ఇక, దీని తర్వాత సంయుక్త 'బూమరాంగ్' అనే మలయాళ సినిమాతోనూ వచ్చేసింది.
మెగా హీరోతో మూవీ : తెలుగులో చేసిన అన్ని సినిమాలూ సక్సెస్ అవడంతో సంయుక్త మీనన్‌కు అవకాశాలు వెల్తువెత్తుతోన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడీ బ్యూటీ సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న 'విరూపాక్ష'లో హీరోయిన్‌గా చేస్తోంది. దీనితో పాటు తెలుగులో మరికొందరు హీరోలతో ఈ బ్యూటీ స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని అంటున్నారు. ఇలా ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులను కూడా ఓకే చేసిందని టాక్.

అందులో ఫుల్ బిజీ : టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న సంయుక్త మీనన్.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలు, వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.
హద్దు దాటల్లేదుగా : సోషల్ మీడియాలో హీరోయిన్ సంయుక్త మీనన్ సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె హద్దు దాటకుండానే గ్లామర్ ట్రీట్ ఇస్తూ కవ్విస్తోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను దోరగా చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. తద్వారా తరచూ హైలైట్ అవుతూనే ఉంటోంది.

సంయుక్త హాట్ షో : అటు సినిమాల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ పెద్దగా హాట్ షో చేయని సంయుక్త మీనన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఘాటు ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్పోర్ట్స్ బ్రా వేసుకుని యమ క్లీవేజ్ షో చేస్తోంది. అంతేకాదు, ఈ పిక్‌లో నాభి అందాలను కూడా చూపిస్తూ కవ్విస్తోంది. ఫలితంగా ఈ ఫొటోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











