బాత్ టబ్‌లో ఆ భంగిమలో ఫోజులు .. టూ పీస్ బికినీలో రెచ్చగొడుతోన్న మృణాల్ ఠాకూర్
హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన సీతారామంతో తెలుగువారిని పలకరించారు మృణాలు ఠాకూర్. తన అందం, అభినయంతో తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ వెంటనే హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాల్లో నటించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మృణాల్ తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
2012లో ముజ్‌సే కుచ్ కెహ్తీ.. యే ఖామోషియాన్ అనే సీరియల్‌లో బాలనటిగా మృణాల్ ఠాకూర్ ఎంట్రీ ఇచ్చారు. అనంతరం 2014లో విట్టి దండు అనే మరాఠీ చిత్రంతో తొలిసారి వెండితెరపై కనిపించిన ఆమె.. 2018లో లవ్ సోనియా చేశారు. తర్వాత తుఫాన్, ధమాక, జెర్సీ సినిమాల్లో నటించారు. అంతకుముందు కలర్స్ టీవీలో బాక్స్ క్రికెట్ లీగ్‌లో, డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియే సీజన్ 7లోనూ మృణాల్ తళుక్కుమన్నారు.

ఇన్ని సినిమాలు, షోలు చేసినా రాని గుర్తింపు సీతారామంతో ఆమెకు వచ్చింది. టాలీవుడ్‌లో వచ్చిన ఫేమ్, నేమ్‌తో బాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటున్నారు మృణాల్. ప్రస్తుతం సన్నాఫ్ సర్దార్ 2, పూజా మేరీ జాన్, హేజవానీ తో ఇష్క్ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. గ్లామర్ ఇండస్ట్రీలో కొన్ని అంశాలపై మాట్లాడాలంటేనే చాలా మంది బయపడతారు. అలాంటి వాటిపై మొహమాటం లేకుండా ఓపెన్ అవుతారు మృణాల్. ముక్కుసూటితనానికి పెట్టింది పేరైన ఆమె ..ఎవరేమనుకున్నా సరే మనసులో ఉన్న మాటలను చెప్పడానికి వెనకడుగు వేయరు.
ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెకు బాడీ షేమింగ్, ముఖ్యంగా థైస్‌పై ప్రశ్న ఎదురైంది. దీనికి ఘాటుగా బదులిచ్చారు మృణాల్ ఠాకూర్. తనకు థిక్ థైస్ ఉన్నాయని.. ఆ విషయంలో తనకు ఎలాంటి రిగ్రెట్ లేదని తేల్చిచెప్పింది. తాను వర్కవుట్‌కి వెళ్లినప్పుడు కూడా కొందరు .. నీ థైస్ తగ్గడానికి వచ్చావా, నీ ప్రాబ్లం అదేనా అంటూ కామెంట్స్ చేస్తుంటారని మృణాల్ పేర్కొన్నారు. నా థైస్ వల్ల తనకు ఏ సమస్యా లేదని.. నాలాంటి థైస్ కావాలని ఎంతోమంది డబ్బులచ్చి మరీ వర్క్‌వుట్స్ చేస్తుంటారని ఎద్దేవా చేశారు. నా థైసే నా స్ట్రెంత్ అంటూ మృణాల్ బోల్డ్‌గా ఆన్సర్ ఇచ్చారు.
అలాగే ప్రేమ, పెళ్లిపైనా మృణాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను అర్ధం చేసుకునే వాడినే పెళ్లి చేసుకుంటానని.. తనకు పెళ్లి కన్నా ముందు పిల్లల్ని కనాలని ఉందంటూ సీత బాంబు పేల్చింది. తనకు ప్రేమ మీద సదభిప్రాయం లేదని కుండబద్ధలు కొట్టింది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మృణాల్ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్‌లతో సెగలు రేపుతుంటారు. తాజాగా బాత్ టబ్‌లో పడుకుని, టూ పీస్ బికినీ వేసుకుని రెచ్చగొట్టారు మృణాలు. భారీ ఎద అందాలతో నడుము మడతలు చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్ని కోసేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











