Mrunal Thakur సక్సెస్ జోష్‌లో మృణాల్.. దక్షిణాదిలో భారీ ఆఫర్లు.. ఆ స్టార్ హీరోతో అవకాశం!
సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ నటి మృణాల్ థాకూర్ కెరీర్ గ్రాఫ్ రివ్వున దూసుకెళ్తున్నది. తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషల్లో భారీ ఆఫర్లు ఆమెను పలకరిస్తున్నాయి. అయితే కంటెంట్‌కు, తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఆమె ఎంచుకొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పలు రకాల విభిన్నమైన కథలను వింటూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే తాజా వార్తల ప్రకారం తమిళ, మలయాళ రంగంలోకి ప్రవేశించేందుకు మృణాల్ సిద్దమవుతున్నట్టు సమాచారం. మృణాల్ థాకూర్ కెరీర్ వివరాల్లోకి వెళితే..

నానితో రొమాన్స్‌కు రెడీ
సీతారామం తర్వాత మృణాల్ జాగ్రత్తగా అడుగులెస్తున్నది. నేచురల్ స్టార్ నాని తన కెరీర్‌లో 30 సినిమా Nani30 లో హీరోయిన్‌గా నటించడమే కాకుండా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం తెలుగులో కూడా పలువురు దర్శకులు ఆమెను సంప్రదించినట్టు.. పలువురు నిర్మాతలు భారీగా ఆఫర్ చేసినట్టు మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం హిందీలో కొంటే సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలపైనే ఆమె దృష్టి పెట్టినట్టు సమాచారం.

దక్షిణాదిలో బిగ్ ప్రాజెక్టుల్లో
అయితే ఇటీవల మృణాల్ థాకూర్ ఇన్స్‌టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడుతూ.. బిగ్ బ్యానర్లు, టాప్ డైరెక్టర్లతో కలిసి పనిచేయబోతున్నాను. దక్షిణాదిలో చాలా మంచి సినిమాలు చేయబోతున్నాను. ఒక ఏజెన్సీ సహాయంతో తెలుగు, తమిళ, మలయాళ రంగాల్లో భారీ ప్రాజెక్టుల్లో భాగమయ్యేందుకు ప్లాన్ చేస్తున్నాను. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాను అని మృణాల్ చెప్పారు.

తమిళంలో సూర్యతో కలిసి
ఇక సీతారామం తర్వాత Nani30 చిత్రంలోను, అలాగే సూర్య నటించే తన 42వ చిత్రం Suriya42 చిత్రంలో నటించేందుకు ఒప్పుకొన్నారని దక్షిణాది మీడియాలో ఓ వార్త వైరల్ అవుతున్నది. ఇక ఇటీవల అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన సెల్పీ చిత్రం ద్వారా హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో కూడా భారీ ప్రాజెక్టుల్లో భాగమయ్యేందుకు సిద్దమవుతున్నారు.

మృణాల్ థాకూర్ సినిమా కెరీర్ ఇలా..
మృణాల్ థాకూర్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల జెర్సీ హిందీ రీమేక్, అలాగే సీతారామం, సెల్ఫీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుమ్రా, పూజా మేరి జాన్, పిప్పా, ఆంఖ్ మిచోలి, నాని30 చిత్రాలను అంగీకరించింది. సూర్య42 చిత్రం దాదాపు ఖరారు అవుతున్నది. ఇంకా పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి


Click it and Unblock the Notifications











