Mrunal Thakur's Net Worth మృణాల్ థాకూర్ ఆస్తుల విలువ ఎంతంటే? నానికి షాకిచ్చేలా!

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరోయిన్ మృణాల్ థాకూర్ టాలీవుడ్‌లో భారీ ప్రాజెక్టుల్లో క్రేజీ ఆఫర్లు అందుకొంటున్నది. సీతారామం అందించిన విజయంతో దక్షిణాదిలో అగ్ర నటులు సరసన అవకాశాలు ఎదురుపడ్డాయి. అయితే తాజాగా ప్రముఖ నిర్మాత మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల నిర్మాణంలో శౌర్యు దర్శకత్వంలో రూపొందుతున్న హాయ్ నాన్న చిత్రంలో నాని సరసన నటించింది. ఈ సినిమా రిలీజ్‌కు సిద్దమైన నేపథ్యంలో మృణాల్ థాకూర్, నానితో కలిసి సరదాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..

మ‌ృణాల్ థాకూర్ మరాఠీ, హిందీ సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైంది. నటనకు ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ సీతారామం సినిమా సాధించిన విజయంతో ఆమెకు ఇండియా వైడ్‌గా గుర్తింపు తెచ్చుకొన్నది. ఆ తర్వాత వస్తున్న ఆఫర్లను ఆచీతూచి అంది పుచ్చుకొంటున్నారు.

Sita Ramam Heroine Mrunal Thakurs Net Worth revealed with Nani in Hi Nanna Promotion Event

సీతారామం తర్వాత ఫెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రతో హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకొనే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇటీవల నానితో జరిగిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో మృణాల్ చలాకీగా సమాధానాలు ఇస్తూ ఆకట్టుకొన్నారు. అయితే నాని అడిగిన చిలిపి ప్రశ్నలకు అంతే చిలిపిదనంతో సమాధానాలు ఇచ్చారు.

హాయ్ నాన్న సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ కార్డు‌లో ఉన్న ప్రశ్నలను ఒక్కొక్కటిగా నాని అడుగుతూ.. మృణాల్ థాకూర్ వయసు ఎంతంటే? తొలుత 16 ఏళ్లు మొన్ననే వచ్చాయంటూ ఆమె ఆట పట్టించింది. ఆ తర్వాత తన వయసు 31 సంవత్సరాలు అంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది. ఆ తర్వాత మృణాల్‌కు పెళ్లి జరిగిందా? అంటే.. ఆమెకు పెళ్లి జరిగిందా? ఎదురు ప్రశ్న వేసింది. చివరకు లేదు.. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అంటూ అని సమధానం చెప్పింది.

Sita Ramam Heroine Mrunal Thakurs Net Worth revealed with Nani in Hi Nanna Promotion Event

ఇక మృణాల్ థాకూర్‌పై నాని ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. మీ ఆస్తుల విలువ ఎంత? అంటే.. మీరెవ్వరూ ఊహించినంత.. నా సంపదను ఎవరు వెలకట్టలేరు. వెల కట్టలేనంతగా నా ఆస్తి ఉంది అంటూ విషయం చెప్పకుండా తప్పించుకొన్నారు. చిన్నతనం నుంచే నాకు నటనపై ఆసక్తి ఉంది. కానీ డెంటల్ కోర్స్ చదువుతుండగా నాకు అవకాశం లభించింది అని తెలిపారు.

మృణాల్ థాకూర్ సినిమాల విషయానికి వస్తే.. ఆంఖ్ మిచోలి, పూజా మేరీ జాన్, పిప్పా, ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్ దేవరకొండతో కలిసి ఆమె ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇంకా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X