Mrunal Thakur: కాబోయే భర్తపై మృణాల్ కామెంట్స్.. దారుణంగా ట్రోలింగ్.. సీతరామం బ్యూటి ఆవేదన!

సీతారామం సినిమా ఎంత పెద్ద క్లాసిక్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ నటించిన బెంగాలీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సీతగా ముద్ర వేసుకుంది. తెలుగులో మొదటి సినిమాతోనే విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది.

ఇక ఇందులో సీతగా మృణాల్ ఠాకూర్ ను తప్ప వేరే హీరోయిన్ ను ఊహించుకోలేకపోతుంది యూత్. అయితే సినీ ఇండస్ట్రీలో ట్రోలింగ్ అన్నది సర్వసాధారణం. సీతగా టాలీవుడ్ ఆడియెన్స్ కు పరిచయమైన మృణాల్ హాట్ ట్రీట్ పై ఇదివరకు ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు ఆమె తనకు కాబోయే భర్తపై చేసిన కామెంట్స్ తో ట్రోలింగ్ బారిన పడింది.

సీరియల్ తో పాపులర్..

సీరియల్ తో పాపులర్..

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ అందులో అతి కొద్దిమంది మాత్రమే మొదటి సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ హాట్ బ్యూటి మృణాల్ ఠాకూర్ ఒకరు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బెంగాలీ భామ మొదట్లో బుల్లితెరపై సందడి చేసింది. 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది.

హిందీ చిత్రపరిశ్రమలో సత్తా చాటుతూ..

హిందీ చిత్రపరిశ్రమలో సత్తా చాటుతూ..

సీరియల్స్ లో లీడ్ రోల్స్ చేస్తూ తన నటనతో ఆకట్టుకుంది బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత 'విట్టి దండు' అనే మరాఠీ మూవీతో వెండితెరపై హీరోయిన్ గా సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో అప్పట్లోనే తెగ పాపులర్ అయింది. సీరియల్ నటిగా గుర్తింపు పొందిన మృణాల్ ఠాకూర్ అనంతరం హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది. సూపర్ 30, జెర్సీ వంటి కంటెంట్ ఉన్న చిత్రాలతో ఎంతగానో అలరించింది బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్.

క్రేజీ ప్రాజెక్టుతో బిజీగా..

క్రేజీ ప్రాజెక్టుతో బిజీగా..

బాలీవుడ్ లో ఆమె నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది మృణాల్ ఠాకూర్.. ఈ క్రమంలోనే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతా రామం' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ సుందరి. ఈ సినిమాలో సీతగా తెలుగు రాష్ట్రాల ప్రజల మనసు దోచుకుంది ఈ చిన్నది. ప్రస్తుతం సూర్య 42వ చిత్రంలో, నాని 30వ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నట్లు టాక్. అలాగే అక్షయ్ కుమార్ సెల్ఫీ మూవీలో గెస్ట్ రోల్ చేస్తోంది ఈ భామ.

రెండు వేర్వేరు సమాధానాలు..

రెండు వేర్వేరు సమాధానాలు..

ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్ ట్రోలింగ్ బారిన పడింది. అయితే తెలుగులో సీతగా పరిచయమైన ఈ భామ హిందీలో హాట్ ట్రీట్ అందించింది. అలాగే సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తుంటుంది. దీంతో సీతగా ఊహించుకున్న మృణాల్ హాట్ ట్రీట్ అందిచండంతో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు తాజాగా రెండు ఇంటర్వ్యూల్లో తనకు కాబోయే భర్త గురించి వేరు వేరు రకాలుగా చెప్పడంతో నెటిజన్లు ట్రోలింగ్ కు దిగారు.

చాలా అందంగా ఉండాలని..

చాలా అందంగా ఉండాలని..

కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలన్న ప్రశ్నకు.. "నాకు కాబోయే వాడు మంచి వాడు అయితే చాలు. అందం చూడను" అని చెప్పింది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఇక తాజాగా కపిల్ శర్మ కామెడీ షోలో పాల్గొన్న ఈ హాట్ బ్యూటి తన భర్త చాలా అందంగా ఉండాలని చెప్పుకొచ్చింది. ఇలా రెండు పరస్పర విరుద్ధమైన సమాధానాలు ఇవ్వడంపై నెటిజన్లు ట్రోలింగ్ కు దిగారు. రెండు వీడియోలను కలిపి ఉంచుతూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

అభిప్రాయాలు మారుతూ ఉంటాయి..

అభిప్రాయాలు మారుతూ ఉంటాయి..

మృణాల్ ఠాకూర్ అబద్ధాల కోరు. అవసరానికి అనుగుణంగా మాట మార్చుతుంది అంటూ కామెంట్స్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. అయితే ఈ ట్రోలింగ్ పై తాజాగా మృణాల్ రియాక్ట్ అయింది. తనపై జరుగుతున్న ఈ నెగెటివ్ ట్రోలింగ్ పై ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి వ్యక్తికి అభిప్రాయాలు మారుతుంటాయని చెప్పుకొచ్చింది. నాకు అప్పుడు అలా అనిపించింది. ఇప్పుడు ఇలా అనిపించిందని బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ వెల్లడించింది.

కొత్త విషయాలు నేర్చుకుంటూ..

కొత్త విషయాలు నేర్చుకుంటూ..

ఈ నెగెటివ్ ట్రోలింగ్ పై స్పందించిన సీతా రామం బ్యూటి మృణాల్ ఠాకూర్.. "చాలా మంది నెటిజన్లు, సెలబ్రిటీలు కూడా మాములు మనుషులే. వారికీ రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అవి మారుతూ ఉంటాయి.

మన చుట్టూ ఉన్నవారు కొత్త విషయాలు నేర్చుకుంటూ తెలివిగా ముందుకు వెళ్తున్నారు. అయినా జీవితాంతం ఒకే ఆలోచనకు కట్టుబడి ఉండాలని ఏం లేదు కదా. ఆ విషయాన్ని మర్చిపోయి కొందరు ప్రవర్తిస్తుంటారు. అది మంచిది కాదు" అని కౌంటర్ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X