Sitara Ghattamaneni: నాన్నకు తగ్గ కూతురు.. సినిమా తన డీఎన్ఏలోనే ఉందని చెప్పిన సితార!

Sitara Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ మనుమరాలు, మిల్క్ బాయ్ మహేశ్ బాబు, నర్మత శిరోద్కర్ గారాల పట్టి సితార గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేశ్ బాబు, నమ్రతల కూతురిగా అందరికీ తెలిసిన ఈ క్యూట్ బేబీ చూస్తుండగానే చాలా ఎదిగిపోతుంది. తన తల్లిదండ్రులను చూస్తూ పెరిగిన ఆ బుజ్జాయి కూడా ఇటీవలే కొన్ని ప్రకటనల్లో కనిపించింది. ఆ సందర్భంగానే సితార తల్లి నమ్రతా శిరోద్కర్ మాట్లాడుతూ.. తన కూతురుకు సినిమాలు అంటే ఇష్టం అని చెప్పింది. అలాగే ఫ్యూచర్ లో తాను చాలా సినిమాల్లో నటించాలని కలలు కంటోందని వివరించింది.

అయితే తాజాగా సితార ఘట్టమనేని పోస్ట్ చూస్తుంటే.. నమ్రతా చెప్పిన మాటలన్నీ నిజమని తెలుస్తోంది. ఇంత చిన్న వయుసులోనే సితార చాలా మెచ్యూర్డ్ గా ఉన్నట్లు ఆ పోస్ట్ చూస్తుంటే అర్థం అయిపోతుంది. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే.. సినిమా అనే పదానికి తన జీవితంలో ప్రత్యేకమైన స్థానం ఉందని సితార పేర్కొంది. సినిమా అంటే తన దృష్టిలో కేవలం ఇండస్ట్రీ మాత్రమే కాదని.. ఇదీ తన జీవితంలో ఓ భాగమని చెప్పుకొచ్చింది. అలాగే లెజండరీ, ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తన తాత తనను ఎంతగానో ప్రభావితం చేశారని పోస్టులో రాసుకొచ్చింది.

 Sitara Ghattamaneni Comments About Cinema Industry And Her Latest Instagram Post Goes Viral

ఆయన వారసత్వంలో తానూ ఓ భాగం అయినందుకు చాలా గర్వంగా ఉందని సితార ఘట్టమనేని వివిరించింది. తన నాన్న ఎలా అయితే తన తండ్రి నుంచి స్ఫూర్తి పొందారో.. తాను కూడా తన నాన్న నుంచి అదే విధంగా ప్రేరణ పొందానని వెల్లడించింది. ఈ పోస్ట్ చూస్తుంటే సితార జీవితం అంతా సినిమాలే అని క్లియర్ గా తెలిసిపోతుంది. మహేశ్ బాబు కూతురు చేసిన ఈ పోస్ట్.. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

 Sitara Ghattamaneni Comments About Cinema Industry And Her Latest Instagram Post Goes Viral

తనకు సినిమాలు అంటే చాలా ఇష్టం అని, అవకాశం వస్తే భవిష్యత్తులో తప్పుకుండా సినీరంగంలోకి వస్తానని ఇదివరకే చెప్పుకొచ్చింది ఈ చిన్నారి సితార. అయితే సినిమాలపై ఈమెకు ఉన్న ఇష్టంతోనే ఆమె ప్రస్తుతం డ్యాన్స్ లో శిక్షణ కూడా తీసుకుంటున్నారు. అలాగే ఇటీవలే సితార ఓ వాణిజ్య ప్రకటనలో కూడా నటించింది. చిన్న వయస్సులోనే పీజేఎమ్ జ్యువెల్లర్స్ అనే ఆర్నమెంట్స్ బ్రాండ్ కు ప్రచారకర్తగా కూడా నియామకం అయింది. అంతేకాదండోయ్ ఆ ప్రకటనలో నటించడం ద్వారా వచ్చిన డబ్బును ఛారిటీకి ఇచ్చిందట సితార.

 Sitara Ghattamaneni Comments About Cinema Industry And Her Latest Instagram Post Goes Viral

కేవలం నటన, సినిమాలపై ఇష్టమే కాకుండా సమాజ సేవ కూడా తాత, తండ్రి నుంచే వారసత్వంగా పొందినట్లు మహేష్ బాబు అభిమానులు చెబుతున్నారు. అలాగే జాతీయ సినిమా దినోత్సవాన్ని ఉద్దేశించి తాజాగా సితార చేసిన పోస్టుపై కూడా విపరీతంగా స్పందిస్తున్నారు. ఆల్ ద బెస్డ్, నువ్వూ సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నాం అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి నిజంగానే అటు తాత, ఇటు తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని సితార స్టార్ హీరోయిన్ గా రాణిస్తుందా లేదా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X