మృణాల్ ఠాకూర్ అరుదైన అవార్డు.. సీతారామం హీరోయిన్‌కు ఇంటర్నేషనల్ గుర్తింపు
సినీ పరిశ్రమలో ఆలస్యంగా గుర్తింపు లభించినా.. లేటేస్టుగా సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ అన్ని విధాలుగా దూసుకుపోతున్నారు. 2014 సంవత్సరంలో విట్టి దండు అనే మరాఠీ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ప్రవేశించినా.. సరైన పాపులారిటీ తెచ్చుకోలేకపోయింది. లవ్ సోనియా, సూపర్ 30 సినిమాలు, హిందీ జెర్సీ సినిమాలు ఆమెలోని ప్రతిభను బయటపెట్టాయి. సీతారామం సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పాపులారిటిని సంపాదించుకొన్నది. ఈ క్రమంలో ఆమెకు లభించిన అరుదైన అవకాశం గురించిన వివరాల్లోకి వెళితే..
నటి మృణాల్ ఠాకూర్ కి మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ లో డైవర్సిటీ ఆఫ్ సినిమా అనే పురస్కారానికి ఎంపికయింది. ఇండియాలో విడుదలైన అనేక సినిమాల్లో వివిధ భాషల్లో ఆమె చేసిన పాత్రలకు గాను ఈ ఘనత దక్కింది. తనకు అవార్డు రావడం పై మృణాల్ స్పందించింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ లో డైవర్సిటీ ఇన్ సినిమా అవార్డు అందుకోవడం గౌరవంగా ఉందన్నారు. ఈ అవార్డ్ రావడం వల్ల తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.

"ఒక కళాకారిణిగా ఇలాంటి విభిన్నమైన పాత్రలను చేసేందుకు ముందుంటానన్నారు. అవార్డ్ మరింత సవాళ్ళతో కూడిన పాత్రలు చేసేందుకు తనలో తగిన ధైర్యం నింపుతుందన్నారు. తనకు ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలకు ఆనందంగా ఉందని.. భవిష్యత్తులో కూడా ఇలాంటి విభిన్న పాత్రలు చేసేందుకు ముందుంటానన్నారు. ఆగస్టు 11 తేదీన ఈ అవార్డ్ మృణాల్ అందుకొనున్నారు.
2023 సంవత్సరంలో దక్షిణ భారత లోని చిత్రాల్లో అద్భుత నటనకు అవార్డ్ దక్కటంతో మృణాల్ నటనలో మరో మైలురాయి ని దాటారు. తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో విభిన్న పాత్రల్లో ప్రభావవంతంగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. లవ్ సోనియాలో సోనియా పాత్రను, తెలుగులో తొలిసారిగా సీత మహాలక్ష్మి పాత్రలలో అద్భుతంగా నటించారు. ఘోస్ట్ స్టోరీస్, లస్ట్ స్టోరీస్ 2 వంటి ఓటిటి సిరీస్ లో కూడా నటించింది.

దక్షిణాది సినిమాలో మృణాల్ తన ప్రభావాన్ని చూపిస్తోంది. అందుకు ఉదాహరణ సీతారామంలో దుల్కర్ సల్మాన్‌తో చాలా బాగా నటించటం. రానున్న కాలంలో హీరో నాని, విజయ్ దేవరకొండతో నటించేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ భారత చిత్రాల్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోనుంది. ఐఐఎఫ్ఎమ్ 14వ అవార్డుల ప్రదానోత్సవం ఆగస్ట్ 11 నుంచి 20 వరకు జరుగనుంది.


Click it and Unblock the Notifications











