Mrunal Thakur: బికినీతో మరో బాంబ్ పేల్చిన సీతారమం బ్యూటీ.. ఈ స్థాయిలో ఊహించి ఉండరు..
సీతారామం సినిమాలో నిండైన కట్టుబొట్టులో మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకి భాగా చేరువ అయ్యింది. సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ కి తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఫిదా అయ్యారు. ఆమె ఆహార్యానికి కూడా అంతగా కనెక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆమె గ్లామరస్ ఫొటో షూట్స్ తో షాక్ అయ్యేలా దర్శనమిచ్చింది. రెగ్యులర్ గా అమ్మడు బికినీ అందాలతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. ఇక ఆమెకు సంబంధించిన మరో బికినీ ఫొటో చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఆ వివరాల్లోకి వెళితే..
ఆలోచనలకి తగ్గట్లుగా : సీతారమం సినిమాలో మృణాల్ ఠాకూర్ ని దర్శకుడు హను రాఘవపూడి కూడా తన ఆలోచనలలో సీతని ఎలా ఊహించుకున్నాడో అలా తెరపై చూపించాడు. ఇక మృణాల్ కూడా దర్శకుడి ఆలోచనలకి తగ్గట్లుగా కనిపించడంలో సక్సెస్ అయ్యింది. దీంతో తెలుగులో కొంత గ్యాప్ వచ్చిన కూడా నానికి జోడీగా రెండో సినిమా చేసే ఛాన్స్ ని ఈ బ్యూటీ సొంతం చేసుకుంది.

బయట మాత్రం అలా..: నానితో చేస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ భామలు సినిమాలలో ఎంత పధ్ధతిగా కనిపించిన బయట పాత్ర అల్ట్రా మోడరన్ గా ఉండటానికి ఇష్టపడతారు. అందాల ప్రదర్శన అని అందరూ అనుకున్న వారికి కంఫర్ట్ ఉండే కాస్ట్యూమ్స్ లో ఎక్కువగా కనిపిస్తారు.
మరోసారి బికినీ అందాలు : బీచ్ కి వెళ్ళినపుడు బికినీనే వేసుకోవాలి అనేది వారి ఆలోచన దానికి తగ్గట్లుగానే కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. ఇక మృణాల్ ఠాకూర్ కూడా అల్ట్రా మోడరన్ గానే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడుతుంది. ఇదో ఇండియన్ ట్రెడిషనల్ అమ్మాయి తరహాలో కనిపించడం అంటే తనకి నచ్చదని గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అందుకే రెగ్యులర్ గా మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో ఫ్యాషన్ అవుట్ ఫిట్ లతో హాట్ ఫోటో షూట్ లని షేర్ చేస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో వైరల్ :ఈ ఫోటోలకి విపరీతంగా లైక్స్ వస్తూ ఉంటాయి. కొద్ది రోజుల క్రితం బీచ్ లో బికినీ అందాలతో ఫోటోలని షేర్ చేసిన మృణాల్ ఠాకూర్ తాజాగా మరోసారి అందాల ప్రదర్శనతో రెచ్చిపోయింది. జీజెస్ట్ వెకేషన్ థీమ్ షూట్ కోసం ఆమె శృతి మించి అందాల ప్రదర్శన చేయడం విశేషం. క్రింద ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించకుండా ఇన్నర్ వేర్ తో థైస్ అందాలు కనిపించే విధంగా ఫోజులు ఇచ్చింది.
షాక్ ఇచ్చింది : ఇలా ప్రకృతిలో పరవశించిపోతూ కనిపించడంలో చాలా స్వేచ్చ ఉంది అంటూ, శరీరంతో దగ్గర అనుబంధాన్ని కలిగి ఉన్న అనుభూతి కలుగుతుందనే విధంగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఆ ఫోటోకి పోస్ట్ పెట్టింది. దీనిపై నెటిజన్లు నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మృణాల్ ఈ రేంజ్ లో షాక్ ఇస్తుందని అనుకోలేదు అన కామెంట్స్ చేయగా, మరికొందరు బాలీవుడ్ హీరోయిన్స్ కి పోటీ గట్టిగానే ఇస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఈ లుక్ లో మీరు చాలా అందంగా ఉన్నారంటూ మరికొందరు కామెంట్స్ చేశారు.

ఆ సినిమాలతో బిజీగా..: ఇక ప్రస్తుతం మృణాల్ ఠాగూర్ సినిమాల విషయానికి వస్తే డ్యూటీ నాని 30వ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే హిందీలో కూడా ఈ బ్యూటీ ఇప్పటికే మూడు సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ పూర్తి చేసుకుంది. త్వరలోనే అందులో మరొక సినిమా కూడా విడుదలకు సిద్ధం కానుంది. తమిళంలో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











