Sai Pallavi: స్టార్ హీరోను బాధపెట్టిన ఫిదా హీరోయిన్
Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకుంది. అందాల ఆరబోత దూరంగా ఉంటూ.. కేవలం తన నటనకే ప్రాధాన్యత ఇస్తుంది. అలాంటి సినిమాల్లో నటిస్తూ.. అందరినీ మెప్పిస్తోంది. అలాంటి సాయి పల్లవిపై హీరో శివ కార్తికేయన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ రోజు సాయి పల్లవి అలా మాట్లాడటంతో తాను బాధపడ్డనని తెగ ఫీలయ్యారు. ఇంతకీ ఏమైందంటే..
సాయిపల్లవి మలయాళంలో ప్రేమమ్ అనే మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె తొలి మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో లెక్చరర్ క్యారెక్టర్ లో సాయిపల్లవి నటన అద్భతమనే చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత దుల్కర్ సల్మాన్ తో కలిసి కాళి అనే సినిమాలో నటించింది. ఈ మూవీ తెలుగులో 'హే పిల్లగాడా' పేరుతో డబ్ అయింది. ఈ మూవీ కూడా హిట్ కావడంతో సాయి పల్లవికి కూడా మంచి పేరు సంపాదించుకుంది.

ఈ ఫేమ్ తోనే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సాయి పల్లవి తెలంగాణ పిల్లగా నటించింది. తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పింది. తన అందం, అభినయం, డాన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా వరుస అవకాశాలు అందుకుంటూ.. తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ.. స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది.
ప్రస్తుతం ఈ భామ అమరన్ (Amaran) అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ మూవీలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నారు. నిజ జీవిత ఘటన ఆధారంగా తీస్తున్న ఈ మూవీకి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar) దర్శకత్వం వహిస్తున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan)కు చెందిన RKFI అండ్ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. ఈ మూవీ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ ఆడియో లాంచ్ చెన్నైలో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. సాయి పల్లవిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
Heart of #Amaran ♥️ @Sai_Pallavi92 at #AmaranAudioLaunch
— Raaj Kamal Films International (@RKFI) October 18, 2024
#AmaranDiwali #AmaranOctober31#Ulaganayagan #KamalHaasan #Sivakarthikeyan #SaiPallavi #RajkumarPeriasamy
A Film By @Rajkumar_KP
A @gvprakash Musical@ikamalhaasan @Siva_Kartikeyan #Mahendran @Sai_Pallavi92… pic.twitter.com/kRBCU7ADld
హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. ''మేజర్ ముకుంద్ వరదరాజన్ గురించి గతంలో విన్నా.. రాజ్ కుమార్ ఈ సినిమా స్టోరీ వివరించినప్పుడు భావోద్వేగానికి గురయ్యాననీ అన్నారు. ఈ మూవీని కశ్మీర్‌లో 100రోజుల పాటు పలు యాక్షన్ సీన్స్ షూట్ చేశామనీ, ఆ సమయంలో అక్కడి వాతావారణానికి చాలా ఇబ్బంది పడ్డమన్నారు. మెయిన్ గా రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉండేదన్నారు. ఈ చిత్రం క్లైమాక్స్ మాత్రం ఒక్కర్నీ కంటతడి పెట్టిస్తుందని, ఇది కన్పామ్ అన్నారు. మేజర్ ముకుంద్ గారి జీవితంలోని ప్రతి ఘట్టాన్ని చూపించామని తెలిపారు. ముకుంద్‌కు తమిళ చిత్ర పరిశ్రమ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు.
ఇదిలాఉంటే.. హీరోయిన్ సాయిపల్లవి గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. తాను ఓ టీవీ ఛానల్‌లో వర్క్ చేస్తున్నప్పుడు సాయిపల్లవిని ఇంటర్య్వూ చేసే అవకాశం వచ్చిందనీ, ఈ ప్రొగ్రామ్ కు తానే యాంకర్ గా వ్యవహరించానన్నారు. అప్పట్లో సాయి పల్లవి పేరే ఒక బ్రాండ్. 'ప్రేమమ్'లో మె నటన చూసి ఆశ్చర్యపోయాననీ, వెంటనే తనకు ఫోన్ చేసి ప్రశంసించానని అన్నారు. అయితే.. సాయిపల్లవి 'థ్యాంక్యూ అన్నా' అని రిప్లే ఇచ్చిందనీ, ఆమె అన్నా అని పిలిచినందుకు ఆ క్షణం తాను ఎంతగానో ఫీలయ్యానన్నారు. నిజంగా సాయి పల్లవి ఆమె గొప్ప నటి అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హీరో శివ కార్తికేయన్.
ఇక అమరన్ (Amaran) సినిమా విషయానికి వస్తే.. జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash) సంగీతం అందిస్తుండగా ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్, సినిమాటోగ్రాఫర్ సిహెచ్ సాయి, ఎడిటర్ ఆర్. కలైవానన్, అన్బరివ్ మాస్టర్స్‌తో పాటు స్టీఫన్ రిక్టర్ యాక్షన్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా.. అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Click it and Unblock the Notifications











