గేమ్ ఛేంజర్‌లో కియారా అద్వానీ రెమ్యునరేషన్.. లీక్ చేసిన విలన్.. ఎన్ని కోట్లంటే?

ఇప్పుడు పాన్ ఇండియా ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రాల్లో నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ "గేమ్ ఛేంజర్" కూడా ఒకటి. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సెన్సేషనల్ హిట్ చిత్రం పుష్ప 2 గత ఏడాది డిసెంబర్ నెలకి బ్లాస్టింగ్ ఎండింగ్ ఇస్తే ఇపుడు కొత్త ఏడాది జనవరి మొదటి సినిమాగా బిగ్గెస్ట్ సినిమాగా గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది.

కాగా ఇపుడు గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ని ఇండియా వైడ్ గా చేస్తుండగా ఈ సినిమా కోసం మెగా అభిమానులు సహా దర్శకుడు శంకర్ ఇంకా నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమా ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన చాలా కాలం తర్వాత ఇద్దరు హీరోయిన్స్ నటించారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అలాగే తమిళ్ తెలుగు బ్యూటీ అంజలీ నటించారు.

SJ Suryah leaks kiara advani remuneration for game changer Here is details of Paypack Ram Charan Heroine

అయితే వీరిలో నటి కియారా అద్వానీతో చరణ్ ఇది వరకే వినయ విధేయ రామ లో కనిపించారు. మళ్ళీ గేమ్ ఛేంజర్ తో రెండోసారి కలిశారు. కాగా ఈ సినిమాలో కియారా చాలా అందంగా కనిపిస్తున్నట్టుగా ఇప్పటికే మనం చూసాం. పలు పాటల్లో సహా రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ లో అలరించింది.

కాగా ఈ చిత్రానికి కియారా అద్వానీ రెమ్యునరేషన్ విషయంలో కోలీవుడ్ నటుడు ఈ సినిమా విలన్ అయినటువంటి ఎస్ జె సూర్య చేసిన హాట్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారింది. కాగా ఈ సినిమాలో జరగండి సాంగ్ లో విజువల్స్ చూసాను అవి చూసేందుకు కళ్ళు సరిపోలేదని థియేటర్స్ లో ఈ సాంగ్ ఒక్కదానికే ఆడియెన్ పెట్టిన డబ్బులు వర్త్ అనిపిస్తాయని తెలిపారు. ఇక ఈ సాంగ్ లో చరణ్, కియారాలు ఎంతో అందంగా కనిపిస్తారని..

SJ Suryah leaks kiara advani remuneration for game changer Here is details of Paypack Ram Charan Heroine

కియారా అయితే ఈ సాంగ్ లో ఎంత ట్రీట్ ఇస్తుంది అంటే దిల్ రాజు ఈ సినిమా కోసం కియారా అద్వానీకి ఇచ్చిన రెమ్యునరేషన్ ఆ ఒక్క సాంగ్ కే సరిపోతుంది అనిపిస్తుంది అని మనకి అనిపిస్తుందని తెలిపారు. అంటే ఆ ఒక్క సాంగ్ కే కియారా పెట్టిన ఎఫర్ట్స్ కానీ తన లుక్స్ కానీ మొత్తం సినిమా రెమ్యునరేషన్ కి సమానం అన్నట్టుగా తాను చేసిన కామెంట్స్ ఇపుడు ఆ సాంగ్ కోసం ఇంకా అందులో కియారా ప్రెజెన్స్ కోసం మరింత ఎగ్జైట్మెంట్ ని తీసుకొచ్చేలా చేశారు.

కాగా కియారా అద్వానీ ఒక్క ఈ గేమ్ ఛేంజర్ సినిమా కోసమే 6 నుంచి 7 కోట్ల రెమ్యునరేషన్ ని తీసుకున్నట్టుగా టాక్ ఉంది. ఆ 7 కోట్లు ఒక్క సాంగ్ కే సమానం అంటే అది చూడాలి మరి ఏ లెవెల్లో ఉంటుంది అనేది. ఇక ఈ భారీ సినిమాలో ఒక్క పాటలకే 75 కోట్లు పెట్టినట్టుగా దిల్ రాజు తెలిపారు. ఈ అవైటెడ్ సినిమా ఈ జనవరి 10న పాన ఇండియా భాషల్లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X