16 ఏళ్లకే స్టార్ డమ్.. కానీ జీవితంలో ఎన్నో కోల్పోయా

ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ముద్దుగుమ్మ స్నేహా ఉల్లాల్. మొదటి సినిమాతోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్‌. ఆ తర్వాత కరెంట్, సింహా లాంటి సినిమాల్లో నటించింది. ఒకట్రెండు విజయాలు అందుకుంది. అయితే.. ఆ తర్వాత పూర్తిగా అందాల ఆరబోతకే ఫిక్సైపోయింది ఈ ముద్దుగుమ్మ. ఈమె ఇండస్ట్రీకి వచ్చినపుడు జూనియర్ ఐశ్వర్యా రాయ్ అన్నారు. పైగా సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా పరిచయం అయింది స్నేహా ఉల్లాల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 16 ఏళ్లకే స్టార్ డమ్ అందుకున్నా, జీవితంలో చాలా కోల్పోయా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమైంది?

హీరోయిన్‌ స్నేహ ఉల్లాల్‌ కెరీర్‌ మొదలైంది బాలీవుడ్ లోనే . లక్కీ: నో టైమ్‌ ఫర్‌ లవ్‌ (2005) సినిమాతో వెండితెరపై తన ప్రయాణం ఆరంభించింది. ఒక్క సినిమాతోనే తన దశ తిరిగిపోయింది. తెలుగు, హిందీలో వరుస ఆఫర్లు అందుకుంది.తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే.. స్నేహ జీవితం బయటకు కనిపించినంత సింపుల్ కాదు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ ప్రారంభం, ఎదుర్కొన్న కష్టాలు, తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న అసలు కారణాలను ఎమోషనల్‌గా పంచుకుంది. ముఖ్యంగా హీరోయిన్ అవ్వాలనే ఆలోచన లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Sneha Ullal Opens Up Early Stardom at 16 Cost Me My Freedom and Teenage Life

స్నేహ ఉల్లాల్ బాలీవుడ్‌లో లక్కీ: నో టైమ్ ఫర్ లవ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమెకు అవకాశం రావడం కూడా యాదృచ్ఛికమే. పదో తరగతి పూర్తిచేసి కాలేజీలో చేరిన సమయంలో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ ఫ్రెండ్స్ ఆమెను చూసి మూవీ ఆడిషన్స్ గురించి చెప్పడంతో ఆమె జీవితమే మారిపోయింది. ముఖ్యంగా ఆ సమయంలో ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంది. ఆమె తల్లి క్యాన్సర్‌తో పోరాడుతుండటం కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది.

ఈ పరిస్థితుల్లో వచ్చిన సినిమా ఆఫర్‌ను స్నేహం ఒక అవకాశంగా కాకుండా, తన కుటుంబానికి ఓ ఉపశమనం ఇవ్వాలనే ఉద్దేశంతో స్వీకరించింది. "ఇంట్లో అంతా బాధలో ఉన్నప్పుడు ఈ సినిమా కొంత డైవర్షన్ ఇస్తుందని అనిపించింది. ఇలా వ్యక్తిగత బాధల మధ్య ఆమె చేసిన ఈ నిర్ణయం ఒక్కసారిగా ఆమెను స్టార్‌డమ్‌కి చేర్చింది. సినిమా రిలీజ్ తర్వాత స్నేహ ఉల్లాల్ ఒక్కరాత్రిలోనే పాపులర్ అయింది. సల్మాన్ ఖాన్ సరసన నటించడం ఆమెకు భారీ గుర్తింపు తెచ్చింది.

అయితే.. ఆ ఫేమ్ వెనుక చాలా త్యాగాలు ఉన్నాయని చెప్పింది. "ఈ ఇండస్ట్రీ నాకెంతో ఇచ్చింది... కానీ అంతకంటే ఎక్కువ తీసుకుంది" అంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన టీనేజ్, కాలేజీ లైఫ్, వ్యక్తిగత స్వేచ్ఛ అన్నీ కోల్పోయానని ఎమోషనల్ అయింది. '16 ఏళ్ల వయసులోనే నేను ఒక్కసారిగా పెద్దవాళ్లలా మారిపోయాను. టీనేజ్ ఎంజాయ్ చేసే అవకాశం రాలేదు. ఆ సమయంలో అది అర్థం కాలేదు... కానీ ఇప్పుడు చూస్తే అది ఒక పెద్ద కాంప్రమైజ్ అని ఉంది' అంటూ ఆమె భావోద్వేగానికి గురైంది. అయితే తన కెరీర్ ప్రారంభంలో సల్మాన్ ఖాన్ తనకు ఎంతో సపోర్ట్ ఇచ్చారని కూడా ఆమె చెప్పింది.

ఆమెను మరో తరచూ ఐశ్వర్య రాయ్ తో పోల్చడం.'లక్కీ' సినిమా సమయంలో ఈ పోలికలు ఎక్కువగా వచ్చాయి. అయితే ఆ తర్వాత తాను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదని స్నేహ చెప్పింది. "చిన్నప్పటి నుంచే నన్ను ఐశ్వర్యలా ఉన్నావని చెప్పేవారు. కానీ నేను చాలా చిన్న వయసులో ఉండడంతో అలాంటి విషయాలు పట్టించుకోలేదు" అని క్లారిటీ ఇచ్చింది. సినిమాల్లో వరుసగా అవకాశాలు వచ్చినప్పటికీ, ఇండస్ట్రీపై ఉన్న భయం కారణంగా చాలా ఆఫర్లను తిరస్కరించానని ఆమె అన్నారు. ఇంట్లో కూడా ఇండస్ట్రీ గురించి నెగెటివ్‌గా చెప్పడంతో కొంత దూరంగా ఉన్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X