'ఎక్స్ పైరీ డేట్' వస్తున్న బాలయ్య భామ
బాలయ్య సరసన సింహా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన భామ స్నేహఉల్లాల్ . ఈ కుర్రది యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది . ఇంచు మించు విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ పోలికలతో ఉండే ఈ భామను జూనియర్ ఐశ్వర్య అని కూడా అంటుంటారు. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫోటోలుపెడుతూ అభిమానులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా 'ఎక్స్ పైరీ డేట్' అనే వెబ్ సిరీస్ లో నటించింది ఈ కుర్రది. ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా జీ5 సంస్థ అధికారికంగా ప్రకటించింది. వచ్చే నెల 2 నుండి స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఈ వెబ్ సిరీస్ లో కూడా యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అడల్ట్ కంటెంట్ చాలానే ఉన్నట్లుగా ప్రోమో చూస్తుంటే అర్థం అవుతోంది.

ఇల్లీగల్ ఎఫర్ కాన్సెప్ట్ తో ఈ వెబ్ సిరీస్ సాగుతుందట. రెండు జంటల మద్య ఇల్లీగల్ ఎఫైర్ పెట్టిన చిచ్చును ఈ వెబ్ సిరీస్ లో కథనంగా చూపించారని తెలుస్తోంది. పది ఎపిసోడ్స్ గా సాగే ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రల్లో స్నేహా ఉల్లాల్ తోపాటు తెలుగమ్మాయి మధు శాలిని, అలీ రెజా మరియు టోనీలుకేలు నటించారు. ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది.


Click it and Unblock the Notifications











