షారుఖ్ ఖాన్‌కే షాకిచ్చిన శోభిత ధూళిపాళ్ల.. నాగచైతన్య , నాగార్జునల పరిస్ధితేంటో..?
శోభిత ధూళిపాళ్ల.. ఈ పేరు ప్రస్తుతం సినీ ప్రపంచంలో మారుమోగుతోంది. తెనాలిలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఏకంగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కుటుంబానికి కోడలిగా వెళ్లనుంది. బాలీవుడ్‌లో నటిగా ఎంట్రీ ఇచ్చిన శోభిత.. అనంతరం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించింది. అడవి శేష్ గూడఛారి, మేజర్‌తో పాటు దర్శక దిగ్గజం మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్‌లో కీలకపాత్ర దక్కించుకుంది. మేజర్ సినిమా షూటింగ్ సమయంలో చైతన్యతో శోభితకు పరిచయం ఏర్పడిందని ఫిలింనగర్ టాక్.
ఈ స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ రోజులు పట్టినట్లుగా లేదు. త్వరగానే ఇద్దరు మనసులు కలిసి డేటింగ్‌లోకి దిగారు. వీరి మధ్య ఏదో జరుగుతోందని మీడియా ఎప్పటి నుంచో కోడై కూయగా.. అవి గాసిప్స్‌గానే చాలా మంది కొట్టిపారేశారు. కానీ చివరికి ఆ పుకార్లే నిజమై చైతూ- శోభితలు నిశ్చితార్ధం చేసుకుని, త్వరలో ఏడాడుగులు వేయనున్నారు. నాగార్జున స్వయంగా వీరి ప్రేమ, పెళ్లిని కన్ఫర్మ్ చేస్తూ ట్వీట్ చేయడంతో ఊహాగానాలకు తెరపడినట్లయ్యింది.

ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న తమ హీరో ఓ ఇంటి వాడు కానుండటంతో అక్కినేని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు కొత్త జంటకు విషెస్ తెలియజేస్తున్నారు. కొందరు వీరిద్దరిపై ట్రోలింగ్‌కు దిగినా.. అక్కినేని ఫ్యాన్స్ వాటికి ధీటుగా బదులిస్తున్నారు. వీరు త్వరలోనే విడిపోతారంటూ వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో ఆయన కూడా దెబ్బకు దిగొచ్చారు.
నాగచైతన్య సంగతి అందరికీ తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు మనవడు, కింగ్ నాగార్జున కొడుకు, విక్టరీ వెంకటేష్‌కు మేనల్లుడు. తెలుగు చిత్ర పరిశ్రమను శాసించే పెద్ద కుటుంబానికి వారసుడు. దీంతో శోభిత ఎవరు, ఆమె నేపథ్యంలో ఎంటన్న దానిపై నెటిజన్లు జల్లెడ పడుతున్నారు. ట్విట్టర్, గూగుల్ ట్రెండ్స్‌లో ఆమె టాప్‌లో కొనసాగుతున్నారు. చైతన్యతో ఎంగేజ్‌మెంట్ పుణ్యమా అని నేషనల్ మీడియా సైతం ఆమె గురించి ఎంక్వైరీ చేయడం , కథనాలు ప్రసారం చేస్తుండటంతో శోభిత ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు.

ఆమె పాపులారిటీ ఏ రేంజ్‌కి చేరిందంటే, ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌నే వెనక్కి నెట్టేంత. భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి.. హిందీ ఇండస్ట్రీని శాసిస్తున్నారు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కోట్లాది మంది అభిమానులు కింగ్ ఖాన్ సొంతం. అలాంటి షారుఖ్‌కే శోభిత షాకిచ్చింది. దేశంలోని ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ అయిన ఇండియన్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) ఈ వారం పాపులర్ ఇండియన్ సెలబ్రెటీస్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఇందులో శోభిత సెకండ్ ప్లేస్‌లో నిలవగా.. నటి శార్వరీ నెంబర్‌వన్ ప్లేస్ దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది స్టార్‌లను వెనక్కినెట్టి శోభిత రెండో స్థానంలో నిలిచారు. ఆమె తర్వాత షారుఖ్, కాజోల్, జాన్వీ కపూర్ నిలిచారు.
సో .. అదన్న మాట మేటర్.


Click it and Unblock the Notifications











