నాగ చైతన్యతో డేటింగ్.. ఆఫైర్‌ను బయటపెట్టిన శోభిత ధూళిపాల!
సౌత్ క్వీన్ సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య బాలీవుడ్ బ్యూటీ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా శోభిత లవ్ గురించి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. మరి ఇంతకీ శోభిత లవ్ గురించి ఏం చెప్పింది అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
శోభిత ధూళిపాళ్ల నాగ చైతన్య డేటింగ్ రూమర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఏం చేసినా సరే వీళ్ళిద్దరిని ఆ రూమర్లు మాత్రం వదలడం లేదు. ఇక దానికి తగ్గట్టుగానే వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. పైగా ఆ ఫోటోల్లో పోలికలను కనిపెట్టేసి మరీ వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారు అనే రూమర్లను మరింత స్ట్రాంగ్ అయ్యేలా చేస్తున్నారు నెటిజెన్లు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ ప్రేమ గురించి తన ఆలోచనలను పంచుకుంది. అయితే తను ఎప్పుడూ ప్రేమలోనే ఉంటానని శోభిత ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ అవుతోంది. ఆ ఒక్క మాట ఆమె డేటింగ్ రూమర్లకు బలం చేకూర్చినట్టుగా అయ్యింది.
ఆ ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ తన జీవితంలో నిర్ణయాలు తీసుకోవడంలో ప్రేమ మాత్రమే ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. అలాగే తాను ఉన్నదాంట్లోనే సంతృప్తి పడతాను అంటూ తన లెస్ నీడీ మనస్తత్వాన్ని బయట పెట్టింది.
ఈ నేపథ్యంలోనే శోభిత నాగ చైతన్య డేటింగ్ గురించి నేషనల్ మీడియా కోడై కూస్తోంది. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, డేటింగ్ చేస్తున్నారని, ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అలాగే వాళ్ళు కలసి హాలిడేస్ కూడా స్పెండ్ చేస్తున్నారని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. కానీ ఈ జంట తమ గురించి పబ్లిక్ గా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అని టాక్ నడుస్తోంది. ఈ వార్తలకు తగ్గట్టుగానే ఇటీవల నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల షేర్ చేసిన వైల్డ్ లైఫ్ టూర్ ఫోటోలు వైరల్ అయ్యాయి.
వీళ్ళిద్దరూ ఆ ఫోటోలను ఒకే దగ్గర దిగారని, ఇద్దరూ కలిసే హాలిడేను ఎంజాయ్ చేస్తున్నారు అంటూ రచ్చ రచ్చ చేశారు నేటిజెన్లు. మరి శోభిత, నాగచైతన్య నిజంగానే డేటింగ్ లో ఉన్నారా అంటే వాళ్లు సమాధానం చెప్పేదాకా వెయిట్ అండ్ సి.
కాగా ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహించగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు రీసెంట్ గా మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్ లోకి అడుగు పెట్టింది శోభిత. ఆ మూవీ త్వరలోనే ఇండియాలో కూడా రిలీజ్ కాబోతోంది.


Click it and Unblock the Notifications











