బుర్ఖా వేసుకుని, ముస్లింగా కనిపించడంతో... తెలుగు హీరోయిన్‌కు చేదు అనుభవం!

'గూఢచారి' ఫేం, తెలుగు బ్యూటీ శోభితా ధూళిపాళకు ఓ హోటల్‌లో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. అందుకు కారణం బుర్ఖా వేసుకుని ముస్లిం యువతిలా కనిపించడమేనంట. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా పేజీ ద్వారా వెల్లడించారు.

బుర్ఖాలో ఉండటం వల్ల హోటల్ రిసెప్షనిస్ట్ నేను ఒక సెలబ్రిటీ అనే విషయం గుర్తు పట్టలేదు. బుర్ఖాలో, ముస్లిం యువతిగా కనిపిస్తే ఇలా ప్రవర్తించడం నన్ను బాధించింది, దీన్ని బట్టి సాధారణ ప్రజలు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోగలను అని శోభిత వ్యాఖ్యానించారు.

నాతో అనుచితంగా ప్రవర్తించాడు

నాతో అనుచితంగా ప్రవర్తించాడు

నేను ఓ షూటింగ్ కోసం బుర్ఖా ధరించాను. అదే కాస్టూమ్‌లో నా కోసం బుక్ చేసిన హోటల్‌కు వెళ్లడం జరిగింది. అక్కడ రూమ్ కీ ఇవ్వమని అడిగితే రిసెప్షనిస్ట్ నాతో అనుచితంగా ప్రవర్తించాడు. నేను ఎవరో తెలిస్తే అలా ప్రవర్తించే వాడు కాదేమో అని శోభిత వ్యాఖ్యానించారు.

ముస్లింలా కనిపించడం వల్లే..

ముస్లింలా కనిపించడం వల్లే..

నా బ్యాగ్, దుస్తలు దుమ్ముపట్టి ఉన్నాయి. బుర్ఖాలో నేను ముస్లింగా కనిపించడం వల్లే అతడు అలా ప్రవర్తించాడు. ఆ సంఘటనతో వెంటనే పక్కకు వెళ్లాను. చాలా బాధేసింది అంటూ తన అనుభవాన్ని శోభిత పంచుకున్నారు.

క్షమాపణ చెప్పించగలను కానీ...

క్షమాపణ చెప్పించగలను కానీ...

బర్ఖా తీసేసి నేను ఎవరో చెప్పేసి అతడితో క్షమాపణలు చెప్పంచగలను. కానీ నేను కావాలనే అలా చేయలేదు. అక్కడ ఉన్న పరిస్థితి చూసి నాకు చాలా భాదేసింది అని శోభిత ధూళిపాళ వాపోయారు.

ఇది చాలా తప్పు

ఇది చాలా తప్పు

కొన్ని క్షణాలు అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నపుడే నాకు ఎంతో బాధ అనిపించింది. సాధారణ ప్రజల వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైంది. ఏది ఏమైనా ఇలాంటి ప్రవర్తన చాలా చాలా తప్పు.. అని శోభిత వ్యాఖ్యానించారు.

శోభిత ధూళిపాళ

శోభిత ధూళిపాళ

‘గూఢచారి' సినిమాతో తెలుగులో తొలి విజయం అందుకున్న శోభిత ధూళిపాళ... ప్రస్తుతం ‘ది బాడీ' అనే తెలుగు/హిందీ మూవీతో పాటు ‘మేడ్ ఇన్ హెవెన్'(హిందీ), ‘బార్డ్ ఆఫ్ బ్లడ్'(హిందీ) చిత్రాల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X