Sobhita: నీకో దండం సామీ.. చైతుపై చిలిపిగా శోభిత

ఒకప్పుడు తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి మోస్ట్ అడోరబుల్ కపుల్స్ లో స్టార్ హీరో అండ్ హీరోయిన్స్ అక్కినేని నాగ చైతన్య అలాగే సమంతల కాంబినేషన్ కూడా ఒకటి. కాగా ఈ ఇద్దరి జంటకి మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నారు కానీ కొన్నాళ్లకే వీరి వివాహ బంధం బ్రేక్ అయ్యి విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఇదిలా ఉండగా ఆ తర్వాత సమంత, నాగ చైతన్యలు తమ దారులు వేరు చేసుకొని సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో బిజీగా మారారు.

అయితే సమంత విడాకులు తర్వాత ఎలాంటి స్టెప్ పర్శనల్ గా తీసుకోలేదు కానీ చాలా గ్యాప్ తర్వాత నాగ చైతన్య మాత్రం తన రెండో పెళ్లి చేసేసుకున్నాడు. కాగా తన రెండో పెళ్లిగా ప్రముఖ నటి అది కూడా తెలుగమ్మాయి అయినటువంటి శోభిత ధూళిపాళని పెద్దల సమక్షంలో వివాహం చేసుకోగా అక్కడ నుంచి ఇంట్రెస్టింగ్ గా వీరి పెళ్లి లైఫ్ మరింత ఆనందంగా సాగుతూ వస్తుంది.

sobhita dhulipala funny comments on naga chaitanya beard after thandel release

కాగా రీసెంట్ గానే తన భార్యపై నాగ చైతన్య చేసిన పలు కామెంట్స్ మంచి ఆసక్తిగా కూడా మారి వైరల్ అయ్యాయి. అయితే ఇపుడు శోభిత వంతు వచ్చింది అని చెప్పాలి. తన భర్త నటించిన అవైటెడ్ సినిమా తండేల్ నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. కాగా ఈ రిలీజ్ కోసం ఆల్ ది బెస్ట్ చెప్తూనే చైతుపై మంచి ఫన్నీ సెటైర్స్ వేసింది.

అయితే ఏ భార్య అయినా కూడా తన భర్త మంచి అందంగా ఉండాలనే కోరుకుంటుంది అది సగటు భార్య కోరిక అని కూడా చెప్పవచ్చు. అయితే తండేల్ కోసం నాగ చైతన్య దాదాపు సంవత్సరానికి పైగానే ఫుల్ గడ్డం లుక్ లో ఉండాల్సి వచ్చింది. మరి దీనిపైనే చాలా ఫన్నీ గా అండ్ మర్యాదగా సెటైర్ వేసేసింది.

sobhita dhulipala funny comments on naga chaitanya beard after thandel release

"ఫైనల్ గా గడ్డం షేవ్ చేస్తావు.. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ" అంటూ దణ్ణం పెట్టి మరీ ఫన్ సెటైర్ వేసింది. దీనితో సరిగా తండేల్ విడుదల ముందు తన నుంచి వచ్చిన పోస్ట్ అక్కినేని ఫ్యాన్స్ లో మంచి ఫన్ గా మారి వైరల్ అవుతుంది. మరి నాగ చైతన్య షేవింగ్ లుక్ లో చూడాలని ఫాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక చైతూ నటించిన తండేల్ సినిమా ఇపుడు పాజిటివ్ టాక్ ని ఆడియెన్స్ నుంచి అందుకోగా ఈ సినిమాలో సాయి పల్లవి తన సరసన నటించింది. అలాగే కార్తికేయ 1, 2 దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాని నిర్మాణం వహించగా అల్లు అరవింద్ సారథ్యంలో ఈ చిత్రం చైతన్య కెరీర్లోనే అత్యధికంగా 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా రిలీజ్ కి వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X