Sobhita: శోభిత, నాగచైతన్య హానిమూన్ ఫోటోలు ట్రెండింగ్!
యువ సామ్రాట్ నాగచైతన్య, ప్యాన్ ఇండియా యాక్టర్ శోభితా ధూళిపాల తమ దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇటీవల వివాహం చేసుకొన్న వారిద్దరూ కెరీర్, వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. వారిద్దరూ కలిసి ఇటీవల వెకేషన్‌కు వెళ్లగా ఆ ఫోటోలను తమ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్‌లో ఫ్యాన్స్ పంచుకొన్న ఫోటోలు ట్రెండింగ్ అవుతున్నాయి. ఆ ఫోటోల వివరాల్లోకి వెళితే..
నాగచైతన్య, శోభితా ఇద్దరు గత రెండేళ్లుగా అఫైర్‌లో ఉన్నారు. వారిద్దరూ లండన్ వెకేషన్‌కు వెళ్లగా అక్కడ ఓ హోటల్‌లో దిగిన ఫోటోల ద్వారా వారి డేటింగ్ లైఫ్ ప్రపంచానికి తెలిసింది. అయితే అప్పటి నుంచి వారిద్దరి గురించి వస్తున్న వార్తలపై పెద్దగా స్పందించలేదు. కానీ ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత తమ రిలేషన్‌షిప్ గురించి ప్రపంచానికి తెలియజేశారు.

డేటింగ్, అఫైర్ రూమర్ల మధ్య సీక్రెట్‌గా జరిగిన నిశ్చితార్థంతో అధికారికంగా నాగార్జున, శోభిత ఫ్యామిలీ పెళ్లి గురించి ప్రకటించారు. దాంతో వారిద్దరి జోడి గురించి సోషల్ మీడియాలో భారీగా చర్చ జరిగింది. దాంతో వారిద్దరి గురించి రూమర్లకు అలా ముగింపు పలికారు. ఆ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియోలో డిసెంబర్ 4వ తేదీన జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో కన్నుల పండువగా వివాహాన్ని ఇరు కుటుంబాలు జరిపించారు.
పెళ్లి తర్వాత హైదరాబాద్‌తోపాటు ముంబైలో వారిద్దరూ మకాం పెట్టినట్టు వార్తలు వచ్చాయి. పలు సందర్భాల్లో ముంబైలో పార్టీలు, రెస్టారెంట్లలో కనిపించి సందడి చేశారు. నాగచైతన్య దంపతులిద్దరూ ముంబై, హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతూ నూతన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇటీవల కొంత గ్యాప్ తీసుకొని విదేశాల్లో తమ హానిమూన్ ట్రిప్‌ను ముగించుకొని వచ్చారు. అప్పటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్నాయి. అభిమానులు తమ హీరో, హీరోయిన్ల వెకేషన్ ఫోటోలను లీక్ చేసి తమ ఆనందాన్ని పంచుకొంటున్నారు.

ఇక నాగచైతన్య, శోభిత కెరీర్ విషయానికి వస్తే.. చైతూ నటించిన తండేల్ సినిమా రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇక శోభిత తన హాలీవుడ్ సినిమా ప్రమోషన్స్, ఇతర సినిమాల షూటింగులతో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











