హాలీవుడ్‌లోకి తెలుగు అమ్మాయి... 200 కోట్ల బడ్జెట్ మూవీలో.. హీరో ఎవరంటే!
వినోద పరిశ్రమలోకి ఓటీటీల రాకతో ప్రపంచవ్యాప్తంగా సరిహద్దులు చెరిగిపోతున్నాయి. హాలీవుడ్ నటులు తెలుగు సినిమాల్లో.. టాలీవుడ్ తారలు విదేశీ చిత్రాల్లో ఆఫర్లను దక్కించుకొంటున్నారు. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ యువ హీరోయిన్ భారీ ఆఫర్‌ను దక్కించుకోవడం దేశ సినిమా పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఆ హీరోయిన్ ఎవరు? ఆ ప్రాజెక్టు వివరాలు ఏమిటంటే...

గూఢచారి చిత్రంతో
టాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకొన్న గూఢచారి చిత్రంలో నటించిన శోభిత ధూలిపాళ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలపై కన్నేసిన ఈ భామ కొద్దికాలంగా తెలుగు తెరకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు నిర్మాతగా మారి రూపొందిస్తున్న మేజర్ చిత్రంలో నటిస్తున్నారు.

మ్యాంకీ మ్యాన్ హాలీవుడ్ చిత్రంతో
ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ హాలీవుడ్‌లో మంకీ మ్యాన్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నది. ఈ చిత్రంలో స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ దేవ్ పటేల్ హీరోగా నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్మాత్మంగా తెరకెక్కించేందుకు నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది. ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం యూనిట్ ఆడిషన్స్ నిర్వహించారు.

220 కోట్ల బడ్జెట్‌తో రూపొందే సినిమాలో
అయితే ఇటీవల శోభితా ధూలిపాళను ఆడిషన్స్ కోసం రమ్మని కబురు పంపగా వెళ్లి తన టాలెంట్‌ను ప్రదర్శించారు. అయితే శోభితా పెర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిన నిర్మాతలు శోభితాకు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రాన్ని దాదాపు 220 కోట్లతో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

శోభితా ధూలిపాళ కెరీర్ గురించి
ఇక శోభితా ధూలిపాళ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెనాలికి చెందిన తెలుగు అమ్మాయి ఈ ముద్దుగుమ్మ. రమన్ రాఘవ 2 చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీలో చెఫ్, కాలాకాందీ చిత్రాల్లో కనిపించింది. ఆ తర్వాత తెలుగులో గూఢచారి, మలయాళంలో మూతూన్ నటించి మెప్పించింది. ప్రస్తుతం తమిళంలో పొన్నియన్ సెల్వన్, తెలుగులో మేజర్, హిందీలో సితార, ఇంగ్లీష్‌లో మంకీ మ్యాన్ చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











