చీరకట్టుతో శోభిత ధూళిపాల గ్లామర్ ట్రీట్.. భారతీయ చేనేతకు అక్కినేని కోడలు చేయూత

అక్కినేని నాగచైతన్యకు ఇల్లాలిగా అక్కినేని వారి కోడలు ఇమేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు నటి శోభిత ధూళిపాళ. పెళ్లి తర్వాత కూడా నటనను కొనసాగిస్తున్న శోభిత.. సెలెక్టివ్‌గా కథలు ఎంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటే శోభిత ధూళిపాళ తాజాగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

విశాఖలో పుట్టి పెరిగిన శోభిత ధూళిపాళ కుటుంబ మూలాల గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలో ఉన్నాయి. ఉద్యోగరీత్యా ఆమె తండ్రి విశాఖలో నేవీ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా.. తల్లీ కామాక్షి ఒక స్కూల్ టీచర్. చదువు తర్వాత మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన శోభిత ధూళిపాళ తొలుత అనేక బ్యూటీ కాంటెస్ట్స్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తొలుత 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ సాధించి గ్లామర్ ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు శోభిత. అనంతరం సినీరంగంలో అవకాశాల కోసం ఆమె ప్రయత్నించారు.

Sobhita Dhulipala looks stunning and Stylish in Saree with India s rich textile heritage

2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన రామన్ రాఘవన్ 2.0 అనే హిందీ సినిమాతో హీరోయిన్‌గా ప్రస్థానం ప్రారంభించిన ఆమె.. తొలి చిత్రంతోనే తన అందం, నటనతో ఆకట్టుకున్నారు. ఆపై కాలాకాండి, చెఫ్ సినిమాలతో అలరించారు. ఈ క్రమంలోనే అడివి శేష్ హీరోగా వచ్చిన గూఢచారి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు. ఆమె ప్రతిభను గుర్తించిన మలయాళ, తమిళ సినీ దర్శకులు కూడా శోభితకు అవకాశం కల్పించారు. దిగ్గజ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన పొన్నియన్ సెల్వన్‌తో తమిళ ఇండస్ట్రీలో శోభిత అడుగుపెట్టారు.

ఈ దశలో అక్కినేని నాగచైతన్యతో పరిచయం శోభిత జీవితాన్ని మలుపు తప్పింది. సమంతతో విడాకులు తీసుకుని ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్న చైతూ జీవితంలోకి శోభిత ప్రవేశించారు. ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తమ ప్రేమకు బీజం పడిందని చైతన్య ఓ టాక్ షోలో వెల్లడించారు. తాను ఇంట్లో శోభితని బుజ్జితల్లి అని పిలుస్తానని.. ఆయన తెలిపారు. కొన్నాళ్లు డేటింగ్ తర్వాత పెద్దల అంగీకారంతో 2024 డిసెంబర్ 4న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య- శోభిత ధూళిపాళల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హనీమూన్ కంప్లీట్ చేసుకున్న ఈ జంట ప్రస్తుతం తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. చైతూ- శోభితలు గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని అక్కినేని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శోభిత ధూళిపాళ.. తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. అలాగే సమకాలీన అంశాలు, ఇష్యూస్‌పైనా స్పందిస్తుంటారు. తాజాగా దేశంలోని చేనేత కార్మికులను ఆదుకోవాలని శోభిత నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా గద్వాల్ చీరను ధరించి ఫోటో షూట్ నిర్వహించారు. రాయల్ లుక్‌లో మెరిసిపోతున్న శోభిత.. గద్వాల్ చీరల అందాన్ని తన సొగసుతో రెట్టింపు చేశారు. భారతీయ చేనేత కార్మికుల పనిదనం, వారి నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ చేనేతను ఆదుకోవాలని, మనం ఖర్చుపెట్టే రూపాయి కార్మికులకు వెళ్తుందని నెటిజన్లకు పిలుపునిచ్చారు. దాంతో అక్కినేని అభిమానులు, నెటిజన్లు శోభిత మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X