‘సమంత నా సోల్‌మేట్.. తనని అలా చూస్తే కళ్లలో నీళ్లు తిరిగాయి':శోభిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Sobhita Dhulipala: బాలీవుడ్ బ్యూటీ శోభితా ధూళిపాళ్ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల అక్కినేని వారసుడు నాగచైతన్యతో ఆ అమ్మడు ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుక కేవలం ఇరు కుటుంబాల సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. నాటి నుంచి శోభితా ధూళిపాళ్ల పేరు మారుమోగిపోతోంది. తాజాగా ఈ అమ్మడు సమంతపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ సమంతపై శోభితా ఎలాంటి కామెంట్స్ చేసింది.
నాగచైతన్యతో శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ అయిన నాటి నుంచి ఈ అమ్మడుకు తెగ పాపులర్ అయ్యింది. బాలీవుడ్ మూవీతో ఫేమస్ అయినా శోభిత వాస్తవానికి తెలుగు అమ్మాయే. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ తో శోభిత భరతనాట్యం, కూచిపూడిలలో ట్రైనింగ్ తీసుకుంది. కాలేజ్ డేస్ లోనే మోడలింగ్ లోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. ఇండియాలో ప్రముఖ మోడల్స్ శోభిత పేరు తెచ్చుకుంది. శోభిత బ్యూటీ కంటెస్ట్ ల్లో పాల్గొని పలు టైటిట్ లను సొంతం చేసుకుంది.

ఆ తరువాత నటనపై ఇంట్రెస్ట్ 2016లో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శోభిత. తొలిసారి విక్కీ విశాల్ హీరోగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన 'రామన్ రాఘవ్ 2.0' మూవీలో నటించింది. ఆ తర్వాత 'చెఫ్','కళాకంది'అనే హిందీ చిత్రాల్లో తన నటనతో మెప్పించింది. ఆ తరువాత అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి'తో టాలీవుడ్ అడుగుపెట్టింది శోభితా. మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్, మేజర్ మూవీస్ తో తెగ పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే.. పలు హిందీ వెబ్ సిరీస్ ల్లోనూ నటించింది. ఇటీవల పొన్నియన్ సెల్వన్, కల్కి చిత్రంలో నటించిన ఆమె ప్రస్తుతం మంకీ మ్యాన్ అనే అమెరికన్ ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించి, మెప్పించింది శోభన
తాజాగా శోభిత ధూళిపాళ్ల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శోభిత తన ఇష్టాలు, చైతుతో లవ్ గురించి పంచుకుంది. అలాగే.. సమంతపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. తాను ఏపీలోని తెనాలి పుట్టిననీ, తన తండ్రి నేవీ ఇంజినీర్‌గా వైజాగ్‌లో పనిచేసేవార్నీ, తన తల్లి టీచర్ కావడంతో ఎక్కువగా పుస్తకాలు చదివించేది. అలా పుస్తకాలు చదవడం తన హాబీగా మారిందనీ, తాను చదివిన తొలి పుస్తకం 'బుడుగు' అన్నారు. ఇంటర్‌లో చదివే సమయంలో ఎక్కువ ఎకానమీ రిలేట్ న్యూస్ ఎక్కువగా వినడం, చదవడం చేసే దాన్ని అన్నారు. డిగ్రీ ముంబాయిలో చేశాననీ, ఆ సమయంలో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాననీ, మోడలింగ్ చేయడం స్టార్ట్ చేశానన్నారు.
ఇక తన చెల్లి సమంత తన సోల్‌మేట్ అనీ, ఈ మధ్యనే సమంతకు పెళ్లైందనీ, సినిమాలు, షూటింగ్స్ లో బిజీగా ఉండడడంతో తాను కుటుంబానికీ, బంధువులకీ చాలా కాలంగా దూరంగా ఉండాల్సి వస్తుందన్నారని బాధపడ్డారు శోభిత. అయితే తన చెల్లి సమంత పెళ్లిలో తన స్నేహితులను, బంధువులందర్నీ కలుసుకున్నాననీ, పెళ్లిలో అందంగా ముస్తాబై తన చెల్లి సమంతను చూసినప్పుడు మాత్రం కళ్లలో నీళ్లు తిరిగాయని, తన జీవితంలోని బెస్ట్ మూమెంట్స్‌లో అదీ ఒకటి అని ఎమోషనల్ అయ్యింది శోభితా.

తనకు చిన్నప్పటి నుంచి అమ్మా అని పిలిపించుకోవాలన్న కోరిక ఉంది. మాతృత్వపు మాధుర్యం నాకు అద్భుతంగా అనిపిస్తాయి. చైతూ విషయాని కొస్తే.. నాగ చైతన్య చాలా మర్యాదస్తుడనీ, చాలా మంచివాడని పేర్కొన్నారు. తనతో ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడనీ, చైతూ ఎప్పుడూ ప్రశాంతంగా, కూల్‌గా ఉంటాడనీ, ఈ క్వాలిటీస్ చైతూతో ప్రేమలో పడేలా చేశాయని పేర్కొంది హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల . ఇదిలాఉంటే.. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యతో శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది. వచ్చే ఏడాది ఈ లవ్ బర్డ్ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.


Click it and Unblock the Notifications











