Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్ ఫ్యాన్స్ చేష్టలు సిల్లీ.. ట్రోల్స్ శోభిత.. నాగ్, జగపతిబాబు సర్ అండగా..
Recommended Video
గూఢచారి చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న అందాల తార శోభిత ధూళిపాల ఇటీవల సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవం ఎదుర్కోన్నారు. గూఢచారి చిత్రంలోనే నటీనటులు, సాంకేతిక నిపుణులపై ప్రశంసలు కురిపిస్తూ మహేష్ ట్వీట్ చేయగా, దానికి స్పందిస్తూ ఆమె థ్యాంక్యూ అని రీట్వీట్ చేయడం వివాదంగా మారింది. ఆ వివాదంపై శోభిత స్పందిస్తూ..
ఏంటీ అలా బిహేవ్ చేస్తున్నారే
మహేష్ బాబు చేసిన ట్వీట్‌కు థ్యాంక్యూ అని చెప్పడంపై ఆయన ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సూపర్‌స్టార్ ట్వీట్ చేస్తే కేవలం థ్యాంక్యూ అని చెబుతారా? కనీస మర్యాద, గౌరవం ఇవ్వరా? అని ట్రోల్ చేశారు. వారి చేసిన మాటల దాడికి బాధపడలేదు. కానీ ఏందీ వీళ్లు ఇలా బిహేవ్ చేస్తున్నారని అనుకొన్నాను అని శోభిత వెల్లడించారు.
మహేష్ బాబు అంటే ఇష్టం
సూపర్‌స్టార్ మహేష్ అంటే నాకు ఎనలేని అభిమానం. థ్యాంక్యూ అనే పదంపై రాద్దాంత చేయనవసరం లేదు. ఆ ఎపిసోడ్ అంతా నాకు చాలా సిల్లీగా అనిపించింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ వివాదం సద్దుమణగడంతో కాస్త ఊరట లభించింది అని శోభిత పేర్కొన్నారు.
నకిలీ అకౌంట్లతో ట్రోల్స్
వివిధ రంగాలలో ఉండే ప్రముఖులకు ఇలాంటి ట్రోల్స్ సాధారణంగా మారాయి. కాకపోతే వారి సొంత పేర్లతో కాకుండా నకిలీ అకౌంట్లతో ఇలా ట్రోల్స్ చేయడం దారుణం. కొన్నిసార్లు మంచి చేస్తే అందుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అని శోభిత ఆవేదన వ్యక్తం చేశారు.
నాగార్జున, జగపతిబాబు ప్రోత్సాహం
గూఢచారి చిత్రంలో నా పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున సర్, జగపతి బాబు సర్ నన్ను బాగా ప్రోత్సాహించారు. టాలీవుడ్ నుంచి మంచి స్పందన రావడం నాకు చాలా ఎనర్జీని ఇచ్చింది. ప్రేక్షకుల్లో గుర్తింపు లభించినందుకు ఆనందంగా ఉంది.