twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ ఫ్యాన్స్ చేష్టలు సిల్లీ.. ట్రోల్స్‌ శోభిత.. నాగ్, జగపతిబాబు సర్ అండగా..

    By Rajababu
    |

    Recommended Video

    Sobhita Dhulipala Comments On Mahesh Babu Fans Again

    గూఢచారి చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న అందాల తార శోభిత ధూళిపాల ఇటీవల సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవం ఎదుర్కోన్నారు. గూఢచారి చిత్రంలోనే నటీనటులు, సాంకేతిక నిపుణులపై ప్రశంసలు కురిపిస్తూ మహేష్ ట్వీట్ చేయగా, దానికి స్పందిస్తూ ఆమె థ్యాంక్యూ అని రీట్వీట్ చేయడం వివాదంగా మారింది. ఆ వివాదంపై శోభిత స్పందిస్తూ..

    ఏంటీ అలా బిహేవ్ చేస్తున్నారే

    ఏంటీ అలా బిహేవ్ చేస్తున్నారే

    మహేష్ బాబు చేసిన ట్వీట్‌కు థ్యాంక్యూ అని చెప్పడంపై ఆయన ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సూపర్‌స్టార్ ట్వీట్ చేస్తే కేవలం థ్యాంక్యూ అని చెబుతారా? కనీస మర్యాద, గౌరవం ఇవ్వరా? అని ట్రోల్ చేశారు. వారి చేసిన మాటల దాడికి బాధపడలేదు. కానీ ఏందీ వీళ్లు ఇలా బిహేవ్ చేస్తున్నారని అనుకొన్నాను అని శోభిత వెల్లడించారు.

    మహేష్ బాబు అంటే ఇష్టం

    మహేష్ బాబు అంటే ఇష్టం

    సూపర్‌స్టార్ మహేష్ అంటే నాకు ఎనలేని అభిమానం. థ్యాంక్యూ అనే పదంపై రాద్దాంత చేయనవసరం లేదు. ఆ ఎపిసోడ్ అంతా నాకు చాలా సిల్లీగా అనిపించింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ వివాదం సద్దుమణగడంతో కాస్త ఊరట లభించింది అని శోభిత పేర్కొన్నారు.

    నకిలీ అకౌంట్లతో ట్రోల్స్

    నకిలీ అకౌంట్లతో ట్రోల్స్

    వివిధ రంగాలలో ఉండే ప్రముఖులకు ఇలాంటి ట్రోల్స్ సాధారణంగా మారాయి. కాకపోతే వారి సొంత పేర్లతో కాకుండా నకిలీ అకౌంట్లతో ఇలా ట్రోల్స్ చేయడం దారుణం. కొన్నిసార్లు మంచి చేస్తే అందుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అని శోభిత ఆవేదన వ్యక్తం చేశారు.

    నాగార్జున, జగపతి‌బాబు ప్రోత్సాహం

    నాగార్జున, జగపతి‌బాబు ప్రోత్సాహం

    గూఢచారి చిత్రంలో నా పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున సర్, జగపతి బాబు సర్ నన్ను బాగా ప్రోత్సాహించారు. టాలీవుడ్ నుంచి మంచి స్పందన రావడం నాకు చాలా ఎనర్జీని ఇచ్చింది. ప్రేక్షకుల్లో గుర్తింపు లభించినందుకు ఆనందంగా ఉంది.

    English summary
    Sobhita Dhulipala recently made her debut in Telugu cinema with the film Goodachari, directed by Sashi Kiran Tikka. The film has also found a fan in Mahesh Babu, who took to Twitter to appreciate the filmmaker and the entire crew. He said also praised Adivi for his performance. Sobhita Dhulipala retweeted the post and wrote 'Thank you' to Mahesh Babu. This become contraversy in social media. In this she responded and said that..I was more confused than offended. It is a 'thank you!' that trolls took off over. I have immense respect for him, come on! That whole episode was pretty silly."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X