ANR Award ఫంక్షన్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా శోభిత.. చైతూతో కెమిస్ట్రీ అదుర్స్!
ANR National Awards 2024: అదృష్టం అనేది ఎవరిని ఎప్పుడు వరిస్తుందో.. ఎవరి ఇంటి తలుపును కొడుతుందో చెప్పడం కష్టం. అలాగే.. ఏ జంట ఎప్పుడు కలుస్తుందో ? ఏ జంట ఎప్పుడు విడిపోతుందో? అనేది కూడా చెప్పడం కష్టమే.. ఏదైనా దేవుడు రాసిన రాత ఎలా ఉంటే.. అలా జరుగుతుందని భావించడమే.. అసలు ఎందుకు ఈ వేదాంతం అనుకుంటున్నారా.. నిన్న మొన్నటి వరకు మోడల్ గా, నటిగా కెరీర్ ను సాగిస్తున్న నటి. నేడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఓ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఆమెనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరు? మీరు కూడా ఓ లూక్కేయండి.
ఇంతకీ ఆ అమ్మడు ఎవరు? అని ఆలోచిస్తున్నారా? అది ఎవరో కాదండీ. అక్కినేన వారికి కాబోయే కోడలు, నటి శోభితా దూలిపాళ్ల ( Shobitha Dhulipala ). అసలేం జరిగిందంటే? నట సామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని 2024 గాను టాలీవుడ్ అగ్ర నటుడు, మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని కుటుంబం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం సోమవారం నాడు హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో చాలా గ్రాండ్ గా జరిగింది.

నటసామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని 2024 (ANR National Awards 2024)ను మెగాస్టార్ చిరంజీవి ఈ అవార్డును అందుకున్నారు. ఈ వేడుకకు స్పెషల్ గెస్ట్ గా బాలీవుడ్ యాక్టర్ అమితాబచ్చన్ రాకా.. ఎంతో మంది సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే అక్కినేని కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్నేహితుడు కూడా పాల్గొన్నారు. ఈ స్పెషల్ ఈవెంట్ లో అఖిల్ చాలా స్టైలిష్ గా కనిపించారు.

అయితే ఈవెంట్ కు ఎవరు ఊహించిన విధంగా అక్కినేని చైతన్యకు కాబోయే భార్య శోభితా కూడా విచ్చేసింది. ఈవెంట్లో నాగచైతన్య బ్లూ కలర్ బ్లేజర్ లో కనిపించగా... శోభిత సింపుల్గా లైట్ గ్రీన్ కలర్ సారీ కట్టుకొని దర్శనమిచ్చింది. ఏదేమైనా శోభిత ట్రెడిషనల్ లుక్ లో అందర్నీ అట్రాక్ట్ చేసిందని చెప్పాలి. ఈ ఈవెంట్ లో నాగచైతన్య శోభితల జంట హైలెట్ గా నిలిచింది. ఇద్దరు కూడా అతిథులను రిసీవ్ చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

అలాగే ఈ వేదిక పైన అక్కినేని నాగార్జున తన కోడలు శోభితను మెగాస్టార్ చిరంజీవి, స్పెషల్ గెస్ట్ గా వచ్చిన అమితాబ్ బచ్చన్ కి పరిచయం చేశారు. అలాగే.. వేదికపై చిరంజీవి ,శోభిత, నాగచైతన్య, నాగార్జున ఇలా అందరూ కూడా చాలా సేపు ముచ్చటించారు. ఈ సమయంలో తనను పెద్ద కోడలు నాగార్జున నే స్వయంగా పరిచయం చేయడంతో శోభిత ధూళిపాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ వెంట్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.


Click it and Unblock the Notifications











