శుభవార్త చెప్పిన శోభిత .. పెళ్లై 2 నెలలు కాకుండానే..!
అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్యతో ఇటీవల ఏడాడుగులు వేయించుకున్నా హీరోయిన్ శోభిత ధూళిపాళ. ప్రస్తుతం భర్తతో కలిసి హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ హాట్ హాట్ పోస్టులు పెడుతూనే ఉన్నారు. తాజాగా శోభిత పెట్టిన పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన అమ్మాయి శోభిత . 1992 మే 31న జన్మించింది. ఆమె తండ్రి నేవీ ఆఫీసర్ కాగా.. తల్లి ఓ స్కూల్ టీచర్. తండ్రి ఉద్యోగరీత్యా వీరి కుటుంబం విశాఖపట్నంలో స్థిరపడింది. విశాఖ, ముంబైలలో చదువుకున్న శోభిత ధూళిపాళ .. విద్యాభ్యాసం తర్వాత మోడలింగ్ వైపు వచ్చారు. 2010లో ఆమె నేవీ క్వీన్ కిరీటాన్ని దక్కించుకున్నారు. 2013లో ప్రతిష్టాత్మక ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్నాక శోభిత జీవితం అనూహ్య మలుపు తిరిగింది. ఇదే సమయంలో బాలీవుడ్ నుంచి ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి.

2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో విక్కీ కౌశల్ హీరోగా వచ్చిన రామన్ రాఘవ్ 2.0 ద్వారా శోభిత ధూళిపాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే తన టాలెంట్ చూపించిన శోభిత.. మరిన్ని హిందీ సినిమాలలో ఆఫర్లు దక్కించుకున్నారు. ఈ దశలోనే శోభితకు టాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. అడవి శేష్ హీరోగా వచ్చిన గూఢచారితో తెలుగువారిని పలకరించింది. అటు తమిళ్‌లో కాలకాండి, చెఫ్ వంటి సినిమాలతో పాటు మేడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ సిరీస్‌లతో ఆమె బాగా బిజీ అయ్యారు.
ఈ దశలో దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో శోభిత ధూళిపాల నటించి మెప్పించారు. ఈ క్రమంలోనే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడిన శోభిత ధూళిపాల ఈ వ్యవహారాన్ని అత్యంత గుట్టుగా ఉంచి గతేడాది సడెన్‌గా నిశ్చితార్ధం చేసుకుని షాకిచ్చారు. అనంతరం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా వీరి పెళ్లి జరిగింది. పెళ్లయి 2 నెలలు కాకుండానే తన సినిమాలు, ఇతర ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉంటోంది. ఇది వృత్తి పట్ల శోభిత చూపుతున్న అంకిత భావం, నిబద్ధతకు నిదర్శనం. అలాగే వీలు కుదిరనప్పుడు భర్త, కుటుంబంతో గడిపేందుకు కూడా ఆమె సమయం కేటాయిస్తూ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ శుభవార్త చెప్పింది. ఆమె నటించిన ది మంకీ మ్యాన్ అనే సినిమా ప్రతిష్టాత్మక 2024 బాఫ్తా అవార్డుల్లో బెస్ట్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీస్ కేటగిరీలో నామినేట్ అయినట్లు తెలిపింది. అలాగే రాటెన్ టొమాటోస్ బెస్ట్ రివ్యూడ్ మూవీగానూ నిలిచినట్లు శోభిత వెల్లడించారు. ఇలాంటి అంతర్జాతీయ అవార్డుల్లో నామినేషన్స్ సంపాదించడం సాధారణ విషయం కాదు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు , అక్కినేని అభిమానులు శోభిత ధూళిపాల , నాగచైతన్యలకు విషెస్ తెలియజేస్తున్నారు. సో.. అదన్నమాట శోభిత చెప్పిన గుడ్‌న్యూస్.


Click it and Unblock the Notifications











