త్వరలోనే తల్లిగా.. ఆయన సహకారం ఉంటే.. శోభితా ధూళిపాల కామెంట్స్ వైరల్

బాలీవుడ్ నటి శోభితా ధూళిపాల జాతీయ మీడియాలో టాప్ సెలబ్రిటీగానే కాకుండా అనేక వార్తలతో ట్రెండింగ్‌గా నిలుస్తున్నది. బాలీవుడ్ స్క్రీన్ మీద హాట్ హాట్‌గా అందాలను ఆరబోస్తూ.. అందం, అభినయంతో ఆకట్టుకొంటూ హిందీ సినిమా పరిశ్రమలో దూసుకెళ్తున్నది. అయితే తాజాగా నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ తర్వాత ఆమె మీడియాలో టాప్ సెలబ్రిటీగా చర్చనీయాంశమైంది. అయితే తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించింది. ఆమె గురించిన వివరాల్లోకి వెళితే..

నాగచైతన్య, శోభితా రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. అయితే వారిద్దరి అఫైర్ గురించి అనేక రూమర్లు వచ్చినా వాటిపై స్పందించకుండా జాగ్రత్త పడ్డారు. కానీ గుట్టు చప్పుడు కాకుండా తమ నిశ్చితార్థాన్ని ప్రకటించి తమ బంధానికి అధికార ముద్ర వేశారు. అయితే పెళ్లి ఎప్పుడనే విషయంపై వారిద్దరు గుంబనంగా ఉన్నారు.

Sobhita Dhulipala opened about Motherhood and husband role life

జీవితం గురించి అంత సీరియస్‌గా తీసుకోకూడదు. ఓ నదీ ప్రవాహంలా సాగిపోవాలి. అంతేగానీ దానికి ఓ లక్ష్యం ఉండకూడదు. నీ జీవితంలో ఏం చేయాలనుకొంటే అది చేసేయాలి. లైఫ్‌ను ప్రతీ నిమిషం ఆస్వాదించాలి. అంతేకానీ కట్టుబాట్లు పెట్టుకొని లైఫ్‌ను కుదించుకోవద్దు. మనకు పెద్దగా లక్ష్యం లేనప్పడు లైఫ్‌పై పెద్దగా ఆసక్తి ఉండదు అని అన్నారు.

లైఫ్‌లో కొందరు ఆర్థికపరంగా అభద్రతాభావానికి లోనవుతారు. ఎవరితోనైనా రిలేషన్‌షిప్‌లో ఉంటే ఇంకా ఆ భయం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్ ఉంటే.. ఎలాంటి భయాలు జీవితంలో ఉండవు. మన పక్కన ఒకరు ఉన్నారంటే.. చాలా విషయాలు సాధించేందుకు వీలు ఉంటుంది. భర్తల సహకారం, స్వేచ్చ ఉన్న మహిళలు గొప్పగా రాణించిన సందర్భాలు ఉన్నాయి. నేను కూడా నా జీవితంలో భర్త పాత్ర ఉంటుందని భావిస్తున్నాని ఆమె తెలిపారు.

Sobhita Dhulipala opened about Motherhood and husband role life

నా జీవితంలో కొన్ని విషయాలను నిజాయితీగా పంచుకోవాలని అనుకొంటున్నాను. త్వరలోనే మాతృత్వాన్ని ఆస్వాదించాలని కోరుకొంటున్నాను. తల్లి కావడానికి నేను పెద్దగా రూల్స్ పెట్టుకోలేదు. అది ఎప్పుడైతే అప్పుడే అని ఎదురు చూస్తున్నాను. మాతృత్వపు అనుభూతి గురించి ఊహిచుకొంటేనే గొప్పగా ఉంటుంది అని శోభితా అన్నారు.

శోభితా ధూళిపాల కెరీర్ విషయానికి వస్తే.. గూఢచారి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇటీవల ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నది, తమిళంలో పొన్నియన్ సెల్వన్ సినిమాలో తన రోల్‌తో మెప్పించింది. ఇక కల్కి చిత్రంలో నటించిన ఆమె ప్రస్తుతం మంకీ మ్యాన్ అనే అమెరికన్ ఇంగ్లీష్ సినిమాలో నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X