ఆ సినిమాలు అనవసరంగా చేశా ... శోభిత ధూళిపాళ షాకింగ్ కామెంట్స్

అక్కినేని వారి కోడలిగా స్టార్‌ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు నాగచైతన్య సతీమణి శోభిత ధూళిపాళ. వివాహం జరిగినప్పటికీ సినిమాలు చేస్తానని చెప్పిన ఆమె.. తన హోదా, స్టార్‌డమ్‌ని దృష్టిలో ఉంచుకుని సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే చీకటిలో అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేశారు శోభిత. ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, జీవితంలో తీసుకున్న నిర్ణయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
Transfer Trimurthulu Movie Review: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Transfer Trimurthulu Movie Review: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

విశాఖపట్నానికి చెందిన శోభిత.. తొలుత మోడలింగ్‌లో అడుగుపెట్టి సత్తా చాటారు. అనంతరం సినీరంగంలో అవకాశాలు రావడంతో రామన్ రాఘవ 2.0, చెఫ్, కాలాకాండి వంటి హిందీ సినిమాలలో నటించారు. అనంతరం అడివి శేష్ సరసన గూడచారి సినిమాతో తెలుగువారిని పలకరించారు. ఈ సినిమా తర్వాతే శోభిత.. తెలుగు అమ్మాయి అని ఇక్కడి వారికి అర్ధమైంది. గూడచారి తర్వాత నాలుగేళ్లకు మేజర్‌తో మరోసారి టాలీవుడ్‌లో నటించారు ఈ ముద్దుగుమ్మ.

Sobhita Dhulipala Opens Up About Career Decisions and Projects

తెలుగుతో పాటు హిందీ, మలయాళం, ఇంగ్లీష్, తమిళ భాషలలో పలు చిత్రాలలో నటించారు. నటిగా బిజీ అవుతున్న దశలో హీరో అక్కినేని నాగచైతన్యతో పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్ల డేటింగ్ తర్వాత పెద్దల అంగీకారంతో 2024 డిసెంబర్ 4న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగచైతన్య- శోభిత ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అక్కినేని కోడలిగా సినీ పరిశ్రమలో, అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శోభిత. పెళ్లి తర్వాత నటనకు దూరం కాకుండా తన స్థాయికి తగిన పాత్రలు చేస్తానని తెలిపారు ఈ ముద్దగుమ్మ.

Recommended For You
Transfer Trimurthulu Day 1 Collections: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు కలెక్షన్స్.. వడ్డే నవీన్ మూవీకి ఫస్ట్ డే ఎంత
Transfer Trimurthulu Day 1 Collections: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు కలెక్షన్స్.. వడ్డే నవీన్ మూవీకి ఫస్ట్ డే ఎంత

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శోభిత ధూళిపాళ తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఫోటో షూట్స్‌తోనూ ఆమె హల్‌చల్ చేస్తుంటారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాళ తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. మీ కెరీర్‌‌లో వెనక్కి తిరిగి చూసుకుంటే నేను అది చేసి ఉండాల్సింది కాదు అని ఎప్పుడైనా అనుకున్నారా? అని యాంకర్ ప్రశ్నించగా దానికి శోభిత సమాధానం ఇచ్చారు. కొన్ని సినిమాలు నేను చేసి ఉండాల్సింది కాదు.. వాటిని తీసేస్తే నేను అందరి ప్రశంసలు పొందే దానినేమో, కానీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి పూర్తి బాధ్యత నాదే, దీనికి ఎవరినీ నిందించనని శోభిత వెల్లడించారు. ఏదైనా చేయగలననే నమ్మకంతోనే ఆ క్షణంలో ముందుకు వెళ్లానని ఆమె చెప్పారు.

You May Also Like
Deewana Movie Review: దీవానా తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Deewana Movie Review: దీవానా తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇక శోభితా ధూళిపాళ సినిమాల విషయానికి వస్తే.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సైన్స్ ఫిక్షన్ డ్రామా వెట్టువంలో కనిపించనున్నారు. ఇవి కాకుండా మరిన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి.

Read more about: sobhita dhulipala
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X