Sobhita Dhulipala : రెచ్చిపోయిన శోభిత.. ప్యాంట్ లేకుండా బాటమ్ యాంగిల్‌లో కవ్వింపులు

అక్కినేని వారి ఇంటికి కాబోయే కోడలు శోభిత ధూళిపాల సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, హిందీలో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ .. ఇప్పుడు అక్కినేని బ్రాండ్ నేమ్ కూడా తోడు కావడంతో శోభిత ఇండియా వైడ్ పాపులర్ అవుతున్నారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

1992 మే 31న గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టారు శోభిత ధూళిపాళ. తండ్రి వేణుగోపాల్ రావ్ మర్చంట్ నేవీలో పనిచేస్తుండటంతో ఆయన ఉద్యోగ రీత్యా వీరి కుటుంబం విశాఖపట్నంలో స్థిరపడింది. అనంతరం ముంబైలోని హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు శోభిత. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి కార్పోరేట్ లా పట్టా పొందారు. కూచిపూడి, భరత నాట్యంలో శోభితకు మంచి ప్రావీణ్యం ఉంది. 2010లో నేవీ బాల్ ఈవెంట్‌లో నేవీ క్వీన్ కిరీటం గెలుచుకున్నారు.

Sobhita Dhulipala PhotoShoot with modern wear Her latest photos here

2013లో ఫిలిప్పీన్స్‌లో జరిగిన మిస్ ఎర్త్ 2013 పోటీలలో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించారు. 2014లో కింగ్‌ఫిషర్ క్యాలెండర్‌ కోసం ఫోజులిచ్చారు. మోడల్‌గా ట్రాప్ బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించిన శోభిత.. ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో నటించారు. ఈ క్రమంలో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె .. 2016లో విక్కీ కౌశల్ హీరోగా నటించిన రామన్ రాఘవ్ 2.0 ద్వారా వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. 2018లో అడివి శేష్ నటించిన గూఢచారి ద్వారా తెలుగువారిని పలకరించారు శోభిత.

గూఢచారి తర్వాత తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో పలు చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడిన ఆమె సైలెంట్‌గా డేటింగ్ చేసింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో చైతూతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఫోటోలు బయటికి రావడంతో చిత్ర పరిశ్రమ షాక్ అయ్యింది. డిసెంబర్ మొదటి వారంలో శోభిత - నాగచైతన్య వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పెళ్లి పనులు మొదలయ్యాయి.

కొద్దిరోజుల క్రితం శోభిత నివాసంలో పసుపు దంచే పనులకు శ్రీకారం చుట్టారు. పసుపు కొట్టడంతో పాటు పూజలు పాల్గొన్న ఫోటోలను ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇక చిరంజీవికి ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ ప్రదానం చేసే కార్యక్రమంలో పాల్గొన్న శోభితను నాగార్జున అందరికీ పరిచయం చేయగా.. ఆమె ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని శోభిత - చైతూలు అనుకున్నప్పటికీ .. హైదరాబాద్‌లోనే గ్రాండ్‌గా పెళ్లి జరిపేందుకు ఇరు కుటుంబాలు ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శోభిత ధూళిపాళ.. తాజాగా లవ్‌బర్డ్స్ స్టూడియో కోసం దిగిన హాట్ హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మోడ్రన్ ఔట్‌ఫిట్‌లో ఆమె షేర్ చేసిన ఫోటోలు కలకలం రేపుతున్నాయి. ఇంకేందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X