నాగచైతన్యతో ఆ తప్పు చేయలేదు.. ఏదీ శాశ్వతం కాదు.. అలా వస్తాం.. అలానే పోతాం.. శోభితా ధూళిపాల
ఇప్పటి వరకు గాసిప్స్‌కు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారిన శోభిత దూళిపాల.. ఇటీవల కాలంలో జాతీయ మీడియాలో ఆమె హాట్ టాపిక్‌గా మారారు. నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ జరగిన తర్వాత ఆమె లైఫ్ మరింత హాట్ టాపిక్‌గా మారింది. అక్కినేని కుటుంబంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఆమెపై మీడియా ఫోకస్ మరింత పెరిగింది. ఈ క్రమంలో ఇటీవల మీడియాతో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే...
నేను పక్కా తెలుగు అమ్మాయిని. నేను పుట్టింది తెనాలిలో పెరిగింది వైజాగ్‌ృలో. మాకు అక్కడే ఇల్లు ఉంది. ఎప్పుడూ వైజాగ్ వెళ్తుంటాను. నాకు ఆ నగరంతో ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. నాకు మంచి ఫ్రెండ్స్ అంటే నా పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ. వారి సలహాలు తీసుకొంటాను. మన జీవితంలో మనం ఒక్కరే వస్తాం.. ఒక్కరే పోతాం. మనకు మనమే అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి, వాటి గురించి ఆలోచించి మనమే నిర్ణయం తీసుకోవాలి అని శోభితా ధూళిపాల అన్నారు.

ఒక తెలుగు అమ్మాయిగా హిందీ, తమిళ భాషల్లో అగ్ర దర్శకుల సినిమాల్లో నటించడం మామూలు విషయం కాదు. మణిరత్నం లాంటి దర్శకుల సినిమాలో నటించడం గొప్ప అదృష్టంగా భావిస్తాను. అలాగే ఏఆర్ రెహ్మాన్ లాంటి మ్యూజిక్ అందించిన పాటల్లో డ్యాన్స్ చేయడం ఇంకా గొప్పగా ఫీలవుతాను అని అన్నారు.
సోషల్ మీడియాలో నా గురించి అంతగా సోషల్ మీడియాలో ఎవరూ అంతగా పట్టించుకొనే వారు కాదు. ఈ మధ్యలో ఓ విషయంలో కొంత మంది కామెంట్స్ చేస్తుంటే వాటిని నేను పట్టించుకొను. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొందరు వాస్తవాల తెలియక ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. సంబంధం లేనప్పుడు .. ఏ తప్పు చేయనప్పుడు ఒకరికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అని నాగచైతన్యతో అఫైర్ గురించి శోభితా ధూళిపాల అన్నారు.

ఇదిలా ఉండగా, శోభితా దూళిపాల, నాగచైతన్య ఎంగేజ్‌మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని ఫోటోలను షేర్ చేయగా.. అవి ట్రెండింగ్‌గా మారాయి. అక్కినేని ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు. గత మూడు, నాలుగు రోజులుగా వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ వ్యవహారం నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.


Click it and Unblock the Notifications











