నాగచైతన్యకు ముందు శోభిత ఫస్ట్ లవర్ ఎవరో తెలుసా? .. వాడు పక్కా స్టుపిడ్ అంటూ
సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ట్రెండింగ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే.. అది శోభిత ధూళిపాల అని చెప్పుకోవచ్చు. త్వరలోనే ఆమె సినీ హీరో నాగచైతన్యతో వివాహం చేసుకోబోతున్న సమయంలో ఆమెకు సంబంధించిన చాలా విషయాలు మరోసారి మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో శోభిత చెప్పిన తన ఫస్ట్ క్రష్ గురించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది. ఆమె చెప్పిన తన తొలి ప్రేమ గురించిన వివరాల్లోకి వెళితే..
శోభిత కెరీర్ విషయానికి వస్తే.. సినిమాల్లోకి ప్రవేశించిన తెలుగు అమ్మాయి మొదట రచ్చ గెలిచి ఆ తర్వాతే ఇంట గెలిచిన ఘనత ఆమె పేరిట ఉంది. తెనాలికి చెందిన అమ్మాయి ముంబైలో స్థిరపడి సినిమా ఇండస్ట్రీలో తన కలల సౌధాన్ని నిర్మించుకొన్నది. ఒక్కో మెట్టు ఎక్కుతూ హాలీవుడ్ స్థాయికి చేరుకొన్నది. బాలీవుడ్‌లో టాలెంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకొన్నది.

అయితే గూఢచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆలరించింది. ఆ తర్వాత నాగచైతన్యతో ఏర్పడిన పరిచయం వారిద్దరి మధ్య ప్రేమకు బాటలు వేసింది. అయితే కొన్నాళ్లు చాటుమాటున ప్రేమాయణం కొనసాగించిన ఆ ఇద్దరు లవ్‌ను పెద్దలకు చెప్పించి పెళ్లికి ఒప్పించడంతో ప్రేమ కథకు మరో మెట్టు ఎక్కింది.
అయితే నాగచైతన్యకు ముందు తాను ఓ వ్యక్తిని చాలా ఇష్టపడ్డాను. కానీ ఆ వ్యక్తి నాపై అటెన్షన్ చూపించలేదు. నేను ఎంత ప్రయత్నించినా.. నా ప్రేమను అంగకరించలేదు. అతడు ఓ స్టుపిడ్. నన్ను చాలా బాధపెట్టింది అంటూ చిలిపిగా తన కోపాన్ని ప్రదర్శించింది. అయితే నా ఫస్ట్ మాత్రం స్కూల్ డేస్‌లో జరిగింది. అతడే నా క్లాస్‌లో కెప్టెన్. అతడంటే నాకు చాలా ఇష్టం ఉండేది అని శోభిత చెప్పింది.
నా లైప్‌లో చాలా ప్రపోజల్స్ వచ్చాయి. నాకు వచ్చిన ప్రపోజల్స్‌లో మెలో డ్రామా ఎక్కువ ఉండేది. స్కూల్ డేస్‌లో క్రష్ అంటే ఏమిటో తెలియని సమయంలో అవన్నీ జరిగాయి. అయితే ఎక్కువగా నేను స్టడీస్‌పైనే దృష్టిపెట్టాను. లైఫ్‌లో బాగా చదువుకొంటే సెటిల్ అవుదామనే ఆలోచనతో.. ఎక్కువగా ఎక్స్‌ట్రా కరికులర్ విషయాలపై దృష్టి పెట్టేదానిని అంటూ శోభిత చెప్పింది.

ఇదిలా ఉండగా, శోభితతో నాగచైతన్య వివాహం డిసెంబర్ 4వ తేదీన అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లికి సంబంధించిన పనులు అన్నపూర్ణ స్టూడియోలో చురుకుగా కొనసాగుతున్నాయి. వీరిద్దరి పెళ్లి కోసం భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేట్ కార్యక్రమంగా సాగే ఈ పెళ్లికి కొద్ది మంది ప్రముఖులు, బంధువులను ఆహ్వనిస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











