పెళ్లయి నెల రోజులు కాలేదు మరీ ఇంత మార్పా.. అక్కినేని కోడలు నయా లూక్ వైరల్..
Sobhita Dhulipala: అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల.. ఈ అమ్మడు పేరు తెలియని మూవీ లవర్స్ ఉండరు. ఇటీవల ఇండస్ట్రీలో శోభిత పేరు మార్మోగింది. సోషల్ మీడియాలో చాలా రోజులు ఈ అమ్మడు పేరు ట్రెండింగ్ లో నిలిచింది. గత నెల డిసెంబర్ 4న టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యను వివాహం చేసుకొని అక్కినేని వారింట కోడలుగా అడుగుపెట్టింది. అలా ఈ అమ్మడుకు ఎనలేని పాపులాటి వచ్చేసింది. అయితే.. తాజాగా శోభిత కు సంబంధించిన నయా లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా అక్కినేని కోడలు కొత్త లుక్ చూసేయండి.
శోభితా ధూళిపాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. బాలీవుడ్ మూవీతో ఫేమస్ అయినా శోభితా తెలుగు అమ్మాయే. తొలుత మోడలింగ్ లో అడుగుపెట్టిన శోభిత పలు ఇంటర్నేషన్ ఈవెంట్స్ ల్లో పాల్గొంది. ప్రముఖ మోడల్ గా శోభిత పేరు సొంతం చేసుకుంది. అలాగే.. బ్యూటీ కంటెస్ట్ ల్లో పాల్గొని పలు టైటిట్స్ ను కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శోభిత. ఇలా తొలిసారి విక్కీ విశాల్ హీరోగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన రామన్ రాఘవ్ 2.0' సినిమాలో నటించింది. ఆ తర్వాత 'చెఫ్','కళాకంది'అనే హిందీ సినిమాల్లో నటించి, తన అందం, అభినయంతో బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది.

ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది. అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి'తో టాలీవుడ్ అడుగుపెట్టింది. కానీ, అనుకున్న విధంగా అవకాశాలు రాకపోవడంతో మళ్లి బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్ సినిమాల్లో తన గ్లామరెస్ యాక్టింగ్ తో మూవీ లవర్స్ ను మెస్మరైజ్ చేసింది. ఈ క్రమంలో మరోసారి అడవి శేషు హీరోగా నటించి 'మేజర్' అనే బయోపిక్ లో లీడ్ రోల్ లో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా మారడంతో ఈ అమ్మడుకు మంచి పాపులారిటీ వచ్చింది.
ఇటీవల టాలీవుడ్ హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకుని.. అక్కినేని కోడలిగా మారింది. దీంతో శోభితా మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా మారింది. నాగచైతన్య - శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. వీరి వివాహ వేడుక ఇరు కుటుంబాల పెద్దలు, ఆత్మీయుల సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఇదిలాఉంటే.. నాగచైతన్య ప్రస్తుతం 'తండేల్' తో ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా.. కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదెలా ఉంటే.. అక్కినేని కోడలు శోభిత కేవలం సినిమాలతోనే కాదు.. తన గ్లామరస్ ఫోటో షూట్స్ తో తన అభిమానులకు పలుకరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అమ్మడుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా శోభిత తన ఇన్‌స్టా గ్రామ్ వేదికగా తన లేటెస్ట్ ఫోటో షూట్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫోటో షూట్ లో బ్లాక్ అండ్ వైట్ కలర్ డ్రెస్ కనిపిస్తోంది. డిపరెంట్ హెయిర్ స్టైల్ లో కనిపించింది. ఈ ఫోటో షూట్ నెట్టింట్లో షేర్ చేస్తూ.. 'హాయ్' అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం శోభితా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలను చూసిన నెట్టిజన్లు 'పెళ్లయి నెల రోజులు కాలేదు మరీ ఇంత మార్పా..' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











