‘నువ్వు అలా కూడా పనికిరావు’.. అక్కినేని కోడలికి ఘోర అవమానం

Sobhita Dhulipala: శోభితా ధూళిపాళ్ల .. ప్రస్తుతం ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సమంత చైతూ విడాకులపైన తరువాత నుంచి ఈ అమ్మడు పేరు వార్తల్లో వినిపిస్తోంది. చైతూ - నాగ చైతన్య రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. ఈ రూమార్స్ కు తగ్గట్లుగానే వీరిద్దరు కలిసి మీడియా కంటబడటం, వారి ఫోటోలు నెట్టింట్లో వైరల్ కావడం. ఇంతలోనే ఈ వార్తలను నిజం చేస్తూ.. అక్కినేని వారసుడు నాగచైతన్యతో శోభిత ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుక నుంచి శోభితా ధూళిపాళ్ల పేరు మారుమోగిపోతోంది. తాజాగా శోభిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న అవమానాన్ని వెల్లడించింది.

శోభిత ధూళిపాళ.. తెలుగు అమ్మాయే. నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికి ఫేమస్ అయింది. ఈ అమ్మడుకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే.. ఇంట్రెస్ట్. దీంతో భరతనాట్యం, కూచిపూడిలలో ట్రైనింగ్ తీసుకుంది. ఇక కాలేజ్ డేస్ లోనే మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. ఎన్నో కష్టానష్టాలను ఎదుర్కొని ఇండియాలో ప్రముఖ మోడల్ గా పేరు తెచ్చుకుంది. మోడలింగ్ లో ఎన్నో పోటోల్లో పాల్గొని పలు టైటిట్ లను సొంతం చేసుకుంది. ఈ ఫేమ్ తోనే 2016లో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శోభిత.

Sobhita Dhulipala shared bitter experience she faced at the beginning of her career

ఇలా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'రామన్ రాఘవ్ 2.0' మూవీలో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత 'చెఫ్','కళాకంది'అనే మూవీస్ లో నటించి మెప్పించింది. మేడ్‌ ఇన్‌ హెవెన్‌, ది నైట్‌ మేనేజర్‌, మేజర్‌ మూవీస్ తో తెగ పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే.. పలు హిందీ వెబ్ సిరీస్ ల్లోనూ నటించింది. ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ అమ్మడు. అడివి శేష్ 'గూఢచారి' మూవీతో టాలీవుడ్ అడుగుపెట్టింది. ఇటీవల పొన్నియన్ సెల్వన్, కల్కి చిత్రంలో నటించిన ఆమె ప్రస్తుతం మంకీ మ్యాన్ అనే అమెరికన్ ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించి, మెప్పించింది. ఇలా రెగ్యూలర్‌ కమర్షియల్‌ హీరోయిన్‌గా కాకుండా స్టాంగ్‌ ఉమెన్‌ పాత్రలతో ప్రత్యేకత చాటుకుంటుంది శోభితా.

ఇదెలా ఉంటే.. తాజాగా శోభిత ధూళిపాళ్ల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను వివరించింది. శోభితా దూళిపాళ ముంబయిలో డిగ్రీ చేసే సమయంలోనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. అలాగే .. మిస్‌ ఇండియా పోటీల్లోనూ పాల్గొంది. అయితే.. మోడలింగ్‌ రంగంలో అడుగుపెట్టిన తొలినాళ్లలో తాను కలర్‌ డిస్క్రిమినేషన్‌ చేశారని ఎమోషనల్ అయింది. గతంలో ఓ షాంపూ యాడ్‌ చేయడానికి ఆడిషన్‌కి వెళితే.. నల్లగున్నావ్‌ నువ్వు నువ్వు కనీసం బ్యాక్‌ గ్రౌండ్‌ మోడల్‌గా కూడా పనికిరావు అంటూ మోహం మీదనే చెప్పారనీ, తనని ఎంతో మంది రిజెక్షన్‌కి గురయ్యననీ, తెల్లగా లేవని మోడలింగ్‌కి పనికిరావని ఎగతాళి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

Sobhita Dhulipala shared bitter experience she faced at the beginning of her career

అలా అనడంతో తాను ఇంటికెళ్లి అద్దంలో చూసుకుని ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయని తెలిపింది. నెమ్మదిగా తన ఆలోచనల నుంచి బయటపడ్డననీ, అందం అనేది ఎదుటి వారి ఆలోచనలకు సంబంధించినది. కాబట్టి, ఎవరు ఏమనుకుంటున్నారు అనే ఆలోచన మానేశానని అన్నారు. తన పని తాను చేసుకుంటూ వెళ్లడమేమని నిర్ణయించుకున్నారట. ఇదే సమయంలో తన ఫ్రెండ్స్ కూడా తనని బాగా ఎంకరేజ్‌ చేశారని తెలిపింది. తన వాయిస్‌ బాగుందని తన ప్రెంఢ్స్ ప్రోత్సహించారనీ, దీంతో తనలో కాన్ఫిడెన్స్ కాస్త పెరిగిందనీ, దాదాపు 100 ఆడిషన్లను ఫేస్ చేశాక 2016లో అనురాగ్ కస్యప్‌.. రామన్ రాఘవన్ 2లో నటించే అవకాశం వచ్చిందన్నారు శోభిత. ఇలా తనను రిజెక్ట్ చేసిన షాంపూ కంపెనీనే.. తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని ఆఫర్ చేసిందంటూ వెల్లడించింది.

More from Filmibeat

Read more about: naga chaitanya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X