నాగచైతన్యతో పెళ్లి .. ఆరేళ్ల నాటి విషయాలు బయటికి, శోభిత సంచలనం
ఎవ్వరూ ఊహించని విధంగా నాగచైతన్యకు భార్యగా, అక్కినేని ఇంటి కోడలిగా స్థానం సంపాదించారు శోభితా ధూళపాల. ప్రస్తుతం భర్తతో కలిసి హనీమూన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు శోభిత. పైగా తండేల్ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ ఆనందం మరింత రెట్టింపు అయ్యింది. చైతూతో పెళ్లి తర్వాతి నుంచి ఆమె ఏం చేసినా , ఏం మాట్లాడినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
సమంతతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటోన్న నాగచైతన్య జీవితంలోకి ప్రవేశించారు శోభిత. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని మీడియాలో గాసిప్స్ వినిపించినా వాటిని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. అయితే అనూహ్యంగా ఓ రోజున నాగచైతన్య - శోభితలు నిశ్చితార్ధం చేసుకుని షాకిచ్చారు. కింగ్ అక్కినేని నాగార్జున స్వయంగా వీరి ఎంగేజ్‌మెంట్‌ను కన్ఫర్మ్ చేయడంతో సినీ ప్రముఖులు, అక్కినేని అభిమానులు షాక్ అయ్యారు. ఆ తర్వాత గతేడాది డిసెంబర్‌లో నాగచైతన్య - శోభితల పెళ్లి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది.

పెళ్లయినప్పటికీ తన వ్యక్తిగత పనులను పక్కనపెట్టి వృత్తి జీవితంలో బిజీ అయ్యారు శోభిత. తన భర్త సినిమా ప్రమోషన్స్‌లో ఉండటంతో చైతూకి అన్ని రకాలుగా సాయపడ్డారు. అంతేకాదు.. తండేల్ హిట్ తర్వాత ఇకపై చైతూని క్లీన్ సేవ్‌తో చూడబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఆమె పోస్ట్ పెట్టారు శోభిత. తండేల్ విజయం తర్వాత జరిగిన సక్సెస్‌మీట్‌కు భార్యతో కలిసి వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చారు నాగచైతన్య. చాలా రోజుల గ్యాప్ తర్వాత హిట్ అందుకోవడం, పైగా పెళ్లయిన తర్వాత తొలి విజయం కావడంతో చైతూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సమయం ఉండటంతో భార్య శోభితతో కలిసి హనీమూన్‌కు వెళ్లారు చైతూ.
ఇక అక్కినేని వారింటి కోడలి స్టేటస్ అనుభవిస్తున్న శోభితా ధూళిపాల కూడా ప్రస్తుతం భర్తతో సమయాన్ని గడుపుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తున్నారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈమె 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్‌ను అందుకుంది. దేశంలోని టాప్ బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించిన ఆమె నిదానంగా సినీరంగం వైపు అడుగులు వేసింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శోభిత ధూళిపాల తండ్రి వేణుగోపాల్ రావు విశాఖపట్నంలో నేవీలో పనిచేసేవారు. దీంతో శోభిత బాల్యం అంతా విశాఖలోనే నడిచింది.
2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన రామన్ రాఘవన్ 2.0 సినిమాతో నట జీవితాన్ని ప్రారంభించిన శోభిత ఆ తర్వాత తెలుగు, హిందీలలో వరుస సినిమాల్లో నటించింది. అడవి శేష్ దర్శకత్వంలో వచ్చిన గూఢచారి సినిమాతో శోభితకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 2019లో వచ్చిన మేడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ సిరీస్‌తో ఆమె మరింత పాపులర్ అయ్యారు. ఈ ఏడాదితో ఈ సిరీస్‌కు ఆరేళ్లు నిండిన సందర్భంగా శోభితా ధూళిపాళ ఈ విషయం పంచుకున్నారు.
మేడ్ ఇన్ హెవెన్ సిరీస్‌లో తన క్యారెక్టర్, ఇతర నటీనటుల ఫోటోలను పంచుకున్నారు శోభిత . జోయా అక్తర్ , రీమా కగ్టి సహా దాదాపు ఆరుగురుఈ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు . శోభిత, అర్జున్ మాథుర్, కిమ్ సర్బా, శశాంక్ అరోరా, శివానీ రఘువంశీ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్‌లలో 16 ఎపిసోడ్‌లుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యింది.


Click it and Unblock the Notifications











