Sobhita Dhulipala: అలా బుట్టలో వేసుకోవాలనుకొన్నా.. గుట్టు విప్పిన శోభిత ధూళిపాల

భారతీయ సినిమా రంగంలోనే కాకుండా హాలీవుడ్ స్థాయికి తన ప్రతిభతో చేరుకొన్న పదహారు అణాల తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాల ప్రస్తుతం నిత్యం మీడియా హెడ్‌లైన్స్‌లో టాప్ లేపుతున్నారు. నాగచైతన్యతో పెళ్లి కారణంగా అనేక రకాలుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. అయితే తెనాలి నుంచి హాలీవుడ్ వరకు జరిగిన ప్రయాణాన్ని గతంలో చెప్పిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్నది. ఆమె షేర్ చేసుకొన్న చిలిపి విషయాల్లోకి వెళితే..

నేను పుట్టింది పెరిగింది అంతా తెనాలి. ఆ తర్వాత వైజాగ్‌కు షిఫ్ట్ అయ్యాం. అనంతరం చదువు కోసం నేను ముంబైకి వెళ్లాను. నాతోపాటి నా పేరెంట్స్ కూడా వచ్చారు. అయితే నాతోపాటు నా పేరెంట్స్ కూడా వచ్చారు. అక్కడే నేను కామర్స్, టాక్సేషన్ సబ్జెక్ట్ చదువుకొన్నాను. అయితే తనకు ఎప్పుడూ యాక్టర్ కావాలని లేదు అని శోభితా చెప్పారు.

Sobhita Dhulipala shares her Miss India days and First Movie with Anurag Kashyap

అయితే మీడియాలో పనిచేసే నా ఫ్రెండ్ ప్రోత్సహించడంతో నా దృష్టి మిస్ ఇండియా పోటీలపై పండింది. ఆ పోటీలో పాల్గొనాలని ముందు అనుకొన్నాను. కేవలం మా కాలేజీలో అబ్బాయిలను ఆకర్షించడానికే పోటీల్లో పాల్గొనాలనుకొన్నాను. అలా మిస్ ఇండియా పోటీల్లోకి ప్రవేశించిన తర్వాత రెండు, మూడు రౌండ్లు గెలిచే సరికి కొంత ఆశ పెరిగింది అని శోభిత చెప్పారు.

ఇక మిస్ ఇండియా పోటీల తర్వాత నాకు మోడలింగ్ చేసే అవకాశం వచ్చింది. చాలా ప్రొడక్ట్స్‌కు పనిచేసిన తర్వాత నేను బిజీగామారిపోయాను. ఆ తర్వాత యాక్టింగ్‌పై దృష్టిపెట్టాను. దాంతో నేను హిందీ నేర్చుకొని ఆడిషన్స్‌కు వెళ్తుండే దానిని. అలా నేను చేసిన ఆడిషన్స్ నచ్చడంతో అనురాగ్ కశ్యప్ సినిమాలో అవకాశం దక్కడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు అని అన్నారు.

Sobhita Dhulipala shares her Miss India days and First Movie with Anurag Kashyap

అయితే నాకు అనురాగ్ కశ్యప్ అంటే చాలా ఇష్టం. నేను ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు ఆ సినిమా డైరెక్టర్ ఎవరో చెప్పలేదు. కేవలం స్క్రిప్టు మాత్రమే ఇచ్చారు. నేను ఆడిషన్ ఇచ్చిన 2 గంటల్లోనే రోల్ కన్ఫార్మ్ అయింది. మరికొద్ది సమయంలోనే అనురాగ్ కశ్యప్‌ను కలిశాను. అలా 48 గంటల్లోనే నేను షూట్‌కు హాజరయ్యాను అని చెప్పారు.

ఇదిలా ఉండగా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో బిజీగా మారిన శోభితా త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి సిద్దంగా ఉంది. నాగచైతన్యతో పెళ్లికి సిద్దమైన ఆమె డిసెంబర్ 4వ తేదీన గ్రాండ్‌గా అన్నపూర్ణ స్టూడియోలో జరిగే కార్యక్రమంలో చైతూతో మూడు మూళ్లు వేసుకోనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X