నోట్లో సిగరెట్‌తో దొరికిన శోభిత .. సమంతతో పోలుస్తూ దారుణంగా ట్రోలింగ్
సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య జీవితంలో అడుగుపెట్టారు శోభిత హీరోయిన్. చైతన్యతో ప్రేమలో పడినప్పటికీ ఈ విషయాన్ని అస్సలు బయటికి రానీవ్వకుండా గుట్టుగా ఉంచారు శోభిత. అయితే గతేడాది చైతూతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చింది ఈ ముద్దుగుమ్మ. నాలుగు నెలలు గడిచేలోగా చైతన్యతో ఏడాడుగులు నడిచి ఇప్పుడు అక్కినేని వారి కోడలుగా స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నారు శోభిత ధూళిపాళ. అయితే కారణాలు తెలియవు కానీ శోభిత మీద దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
వివాహం తర్వాత నాగచైతన్యతో కలిసి హనీమూన్ నిమిత్తం ఫారిన్ వెళ్లొచ్చారు శోభితా. ఇండియాకు రాగానే దక్షిణ భారతదేశంలోని ప్రముఖ్య పుణ్యక్షేత్రాలను సందర్శించారు. పెళ్లయినప్పటికీ కెరీర్‌లో గ్యాప్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు శోభిత. టాలీవుడ్, బాలీవుడ్‌లలో శోభిత మోస్ట్ వాంటెడ్ అన్న సంగతి తెలిసిందే. పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు ఆమె కోసం వెయిట్ చేస్తున్నాయి. పెళ్లి కావడంతో తన వయసు, ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు శోభిత.

నాగచైతన్యతో వివాహం తర్వాత శోభిత క్రేజ్ పూర్తిగా మారిపోయింది. ఆమె ఏం చేసినా? ఏం మాట్లాడినా? చివరికి సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల ఆమె ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫేమస్ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన బంగారు రంగు గల గౌను ధరించి శోభిత సందడి చేశారు. ఈ గౌనులో ఈవెంట్ మొత్తానికి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిష్ణాతులైన పనివారు దాదాపు 1600 గంటల పాటు శ్రమించి ఈ గౌను తయారు చేసినట్లు ఫిలింనగర్ టాక్. ఇంత స్పెషాలిటీ ఉన్న ఈ గౌను ధర కూడా భారీగానే ఉంటుందని టాక్.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శోభిత ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత వివరాలు, షోలు, సినిమాలు తదితర సంగతులను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఈ కాస్ట్ లీ గౌనులో చేసిన ఫోటో షూట్‌ను కూడా ఆమె షేర్ చేశారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఇందులోని ఓ ఫోటోపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. కారును ఆనుకుని , నల్ల కళ్లజోడు పెట్టుకుని ఉన్న శోభిత నోట్లో సిగరెట్, చేతిలో గన్ పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అక్కినేని అభిమానులు, నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
నాగచైతన్యను పెళ్లాడిన నాటి నుంచి ప్రతి విషయంలోనూ సమంతతో ఆమెను పోల్చి చూస్తున్నారు నెటిజన్లు. ఇక సామ్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు తాజాగా ఫోటోలతో వారు ఆన్‌లైన్‌లో ఏకీపారేస్తున్నారు. సమంత నీ కంటే చాలా బాగుందని, సామ్‌కి లైక్ వేసుకోండి.. సామ్ ఫ్యాన్స్ ఉన్నారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఒకప్పుడు తెలుగు మూలాల గురించి గొప్పగా చెప్పారని.. మీరు చెప్పిన తెలుగు మూలాలు ఎక్కడంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు.
ఇంకొందరైతే సినిమా డైలాగ్స్‌ను వాడుతూ దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు. సమంతను శోభిత ఫాలో అవుతున్నారు.. ఆమెను కాపీ కొడుతున్నారంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలుగు చిత్ర సీమలో హాట్ టాపిక్‌గా మారగా.. సమంత తన అభిమానులను నియంత్రించాలంటూ పలువురు కోరుతున్నారు.


Click it and Unblock the Notifications











