అక్కినేని కోడలా మజాకా.. నేషనల్ లో కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్ లో..!
Sobhita Dhulipala: శోభితా ధూళిపాళ్ల.. ఈ అమ్మడు పేరు తెలియని సిని ప్రియులుండరు. ఒకప్పుడు నటిగా, తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇటీవల అక్కినేని నాగ చైతన్యతో ఎంగేజ్ మెంట్ చేసుకుని అక్కినేని కోడలిగా పరిచయమయ్యింది. ఈ ఎంగేజ్ మెంట్ తరువాత శోభితా మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ అమ్మడుపై మరింత ఫోకస్ పెరిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయింది. స్టేట్ లెవల్, నేషనల్ లెవల్ ఫిల్మీ అవార్స్ కో కాదు. ఇంటర్నేషనల్ అవార్డుకు నామినేట్ అయింది. ఇంతకీ అక్కినేని కోడలు ఏ అవార్డుకు నామినేట్ అయ్యిందంటే?
బాలీవుడ్ మూవీతో ఫేమస్ అయినా శోభిత వాస్తవానికి తెలుగు అమ్మాయే. కాలేజ్ డేస్ లోనే మోడలింగ్ లోకి అడుగుపెట్టింది శోభిత. ఇండియాలో ప్రముఖ మోడల్స్ శోభిత పేరు తెచ్చుకుంది. శోభిత బ్యూటీ కంటెస్ట్ ల్లో పాల్గొని పలు టైటిట్ లను సొంతం చేసుకుంది. ఆ తరువాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శోభిత. తొలిసారి విక్కీ విశాల్ హీరోగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన 'రామన్ రాఘవ్ 2.0' మూవీలో నటించింది. ఆ తర్వాత 'చెఫ్','కళాకంది'అనే హిందీ చిత్రాల్లో తన నటనతో మెప్పించింది. తరువాత అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి'తో టాలీవుడ్ అడుగుపెట్టింది శోభితా. మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్, మేజర్ మూవీస్ తో తెగ పాపులారిటీ సంపాదించుకుంది.

ఇదెలా ఉంటే.. శోభిత దూళిపాళ్ల.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డుల నామినేషన్స్ లో నిలిచింది. ఈ ఏదాడి ఎమ్మీ అవార్డులను ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అందజేస్తుంది. 52వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల ఈవెంట్ యూఎస్‌లోని న్యూయార్క్‌లో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు ఇండియన్ కమెడియన్, నటుడు వీర్ దాస్ తొలిసారి వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు. 14 విభాగాల్లో అందజేసే ఈ అవార్డు కోసం ఈ ఏడాది 21 దేశాల నుంచి 56 మంది నామినేషన్స్‌లో ఉన్నారు.
అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, శోభితా ధూళిపాళ్ల నటించిన వెబ్ సిరీస్ 'ది నైట్ మేనేజర్' .. ఎమ్మీ అవార్డ్స్ 2024 లో బెస్ట్ డ్రామా సిరీస్ విభాగంలోనామినేట్ అయ్యింది. ఈ సిరీస్ లెస్ గౌట్టెస్ డి డైయు (డ్రాప్స్ ఆఫ్ గాడ్) (ఫ్రాన్స్), ది న్యూస్ రీడర్ - సీజన్ 2 (ఆస్ట్రేలియా), ఐయోసి ఎల్ ఎస్పియా అర్రెపెంటిడో - సీజన్ 2 (అర్జెంటీనా)లు ఈ అవార్డు కోసం పోటీపడుతున్నాయి. మరోవైపు.. 14 కేటగిరిలలో భారత్ నుంచి ఎన్నికైన.. మొదటి సిరీస్ గా రికార్డ్ సృష్టించింది. దీంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ డ్రామా సిరీస్ కు అవార్డు దక్కుతుందో లేదో చూడాలి.

ఇదెలా ఉంటే.. నాగచైతన్య - శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్‌లో జరగనుంది. వీరి వివాహ వేడుక ఇరు కుటుంబాల పెద్దలు, ఆత్మీయుల సమక్షంలో జరగబోతుంది. చాలా తక్కవ మందిని ఈ వేడుకకు హాజరుకాకున్నారు. వీరి వివాహ వేడుక అన్నపూర్ణ స్టూడియోలో అందమైన సెట్‌లో వీళ్ల పెళ్లి జరగనుంది. రిసెప్షన్ వివరాలను డిసెంబర్ 10 ఏర్పాటు చేయబోతున్నట్లు టాక్. ఇదిలాఉంటే.. నాగచైతన్య ప్రస్తుతం 'తండేల్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా.. కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











