పెళ్లి తర్వాత అందం రెట్టింపు .. చీరకట్టుతో మాయ చేస్తోన్న శోభిత ధూళిపాళ
సమంతతో విడాకుల తర్వాత అక్కినేని నాగచైతన్య జీవితంలో ప్రవేశించారు శోభిత ధూళిపాళ. అక్కినేని కోడలు హోదాతో టాలీవుడ్‌లో ఓ గౌరవాన్ని పొందుతున్నారు శోభిత. పెళ్లి తర్వాత హనీమూన్ ట్రిప్‌లు, వెకేషన్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. వైవాహిక జీవితంతో పాటు తనకు ఎంతో ఇష్టమైన నటనపైనా దృష్టి పెట్టిన ఈమె పలు ప్రాజెక్ట్స్‌లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో శోభిత ధూళిపాళ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
సైలెంట్‌గా ప్రేమాయణం
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శోభిత ధూళిపాళ కుటుంబం.. తండ్రి ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో స్థిరపడింది. 2013లో మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను కొట్టిన శోభిత ఆ తర్వాత సినీరంగ ప్రవేశం చేశారు. రామన్ రాఘవన్ 2.0తో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన శోభిత అనంతరం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాగచైతన్యని తన ప్రేమతో క్లీన్ బౌల్డ్ చేసిన శోభిత ధూళిపాళ.. సైలెంట్‌గా ప్రేమాయణం నడిపించింది. వీరిద్దరి యవ్వారంపై మీడియాలో ముందు నుంచే వార్తలు వచ్చినప్పటికీ ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు.

ఎంగేజ్‌మెంట్‌తో షాకిచ్చిన చై- శోభిత
గతేడాది సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చారు నాగచైతన్య - శోభిత. కొద్దినెలల తర్వాత అన్నపూర్ణ స్టూడియో వేదికగా వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. నాగచైతన్య జీవితంలోకి శోభిత వచ్చిన వేళా విశేషమో ఏమో గానీ ఆయన నటించిన తండేల్ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తోన్న అక్కినేని ఫ్యాన్స్‌కు ఊరట కలిగించింది. తండేల్ సక్సెస్‌మీట్‌లో ఈ విషయాన్ని చెబుతూ నాగార్జున సైతం భావోద్వేగానికి గురయ్యారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి హనీమూన్ ట్రిప్‌లు, వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు శోభిత.
ట్రావెలింగ్ పిచ్చి
సినిమాలు, షూటింగ్స్ బిజీగా ఉన్నప్పటికీ సమయం దొరికినప్పుడల్లా శోభిత ధూళిపాళకు ట్రావెలింగ్ చేయడం హాబీ అట. ఈమెలో నటితో పాటు ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారట. ఎక్కడికి వెళ్లినా, తనతో పాటు కెమెరాను తీసుకెళ్తుంటారట. అందుకే ఆమె కెమెరాను ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటారట. ఇటీవల వైట్ కలర్ టీ షర్ట్, జీన్స్ ప్యాంట్‌లో అడవిలో చక్కర్లు కొడుతూ ఫోటోలు తీస్తూ కనిపించిన శోభిత ఫోటోలు వైరల్ అయ్యాయి.
అఖిల్ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్
నిన్న మొన్నటి వరకు అఖిల్ అక్కినేని - జైనాబ్‌లో పెళ్లి పనులు, తర్వాతి కార్యక్రమాలతో అక్కినేని కుటుంబం మొత్తం సంతోషంగా గడిపింది. అఖిల్ రిసెప్షన్ సందర్భంగా శోభిత కట్టిన రెడ్ కలర్ శారీ, బ్లౌజ్, హ్యాండ్ బ్యాగ్ చర్చనీయాంశమైంది. ఆ బ్యాగు ఖరీదు అక్షరాల 3.37 లక్షల రూపాయలట. ఈ విషయం తెలిసి అభిమానులు, సినీ ప్రముఖులు షాక్ అయ్యారు. అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో శోభిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సాంప్రదాయాలకు విలువ
స్వతహాగా సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన శోభిత ధూళిపాళ.. ఆచారాలు, సాంప్రదాయాలకు విలువనిస్తారు. ఫ్యాషన్‌పరంగా ట్రెండింగ్‌లో ఉంటూనే పాతకాలం పద్ధతులంటే ఆమెకు ఇష్టమట. తాజాగా చీరకట్టులో తన కురులు ఆరబెట్టుకుంటూ ఉన్న ఫోటోలను శోభిత ధూళిపాళ షేర్ చేశారు. దీనికి సంధ్యా వందనం అని క్యాప్షన్ పెట్టారు. ఇప్పటి వరకు మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించిన శోభితను ఇలా పద్ధతిగా చూసి అక్కినేని అభిమానులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పెళ్లి తర్వాత మీ అందం రెట్టింపు అయ్యిందని కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











