Kiara Advani: గర్బవతిగా కియారా అద్వానీ.. శోభిత, సమంత షాకింగ్ కామెంట్స్
తెలుగు సినిమా ఆడియెన్స్ కి ప్రెజెంట్ జెనరేషన్ లో బాలీవుడ్ నుంచి వచ్చిన చాలా తక్కువ మందికి మాత్రమే హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా మంచి ఆదరణ కనిపిస్తుంది. కాగా హిందీ సినిమాలో చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నప్పటికీ అక్కడా ఇక్కడా మాత్రం అవకాశాలు ఎక్కువ దక్కించుకునే అతి తక్కువ మంది గ్లామరస్ బ్యూటీస్ లో నటి కియారా అద్వానీ కూడా ఒకరు అని చెప్పవచ్చు.
కాగా హిందీ సినిమాలో ఎం ఎస్ ధోని లైఫ్ స్టోరీపై తెరకెక్కించిన సినిమా ఎం ఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీతో లైమ్ లైట్ లోకి తాను వస్తే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన మొదటి సినిమా భరత్ అనే నేను తోనే భారీ హిట్ అందుకొని మొదటి సినిమా తోనే తెలుగు ఆడియెన్స్ లో మంచి అటెన్షన్ ని అందుకుంది. కాగా అక్కడ నుంచి తెలుగు ఆడియెన్స్ దృష్టిలో పడ్డ ఈ బ్యూటీ తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసింది.

అది కూడా చేసిన మూడు సినిమాల్లో రెండు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తోనే ఉంది. కాగా వీరి కలయికలో వచ్చిన మొదటి సినిమా వినయ విధేయ రామ భారీ డిజాస్టర్ అయ్యింది కానీ రామ్ చరణ్ తో కియారా చక్కగా కుదిరింది అని తనకి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ చిత్రం తర్వాత మళ్ళీ రామ్ చరణ్ తోనే తెలుగులో గేమ్ ఛేంజర్ సినిమాకి రొమాన్స్ చేసింది.
కాగా ఇలా తెలుగులో మంచి సక్సెస్ రేట్ లేకపోయినప్పటికీ మంచి ఫేమ్ లోనే తాను ఉంది. మరి ఈ టాప్ బ్యూటీ ఇపుడు ఒక ఊహించని క్రేజీ అనౌన్సమెంట్ ని అందించింది. కాగా కియారా అద్వానీ బాలీవుడ్ యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని గత 2023లో ఇదే ఫిబ్రవరి నెలలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా 2023 ఫిబ్రవరి 7న చేసుకున్నారు. కాగా ఇపుడు 2025 ఫిబ్రవరి ఎండింగ్ కి ఈమె తాను గర్భవతి అయ్యినట్టు అసలు విషయం రివీల్ చేసింది.

తన భర్త సిద్ధార్థ్ చేతుల్లో తమకి పుట్టబోయే బిడ్డకి వేయాలి అనుకున్న దుస్తులు పెట్టి మరీ అనౌన్స్ చేసింది కియారా. మా జీవితాల్లో అతి గొప్పదైన బహుమానం అతి త్వరలో రాబోతుంది అంటూ పోస్ట్ చేసింది. దీనితో ఈ పోస్ట్ కి నిమిషాల్లోనే లక్షల లైక్స్ విబాచి పడ్డాయి. దీనితో ఈ శుభవార్త విన్న అభిమానులు ఆమె పట్ల హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు.
వీరితో పాటుగా సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుండగా వారిలో స్టార్ బ్యూటీ సమంత కూడా షాకింగ్ రిప్లై ఇచ్చింది. వారి పోస్ట్ కి గాను ఓ మై గాడ్ కంగ్రాట్యులేషన్ అంటూ కొంచెం ఎమోషనల్ అవుతున్న ఎమోజిస్ కూడా పెట్టడం ఇందులో ఆసక్తిగా మారింది. ఇలా కియారా అద్వానీ నుంచి మాత్రం ఈ లేటెస్ట్ పోస్ట్ ఇపుడు నేషనల్ సినీ వర్గాల్లో కూడా మంచి వైరల్ గా మారింది. శోభిత కూడా లవ్ సింబల్స్ పెట్టి రియాక్షన్ ఇచ్చింది. కియారాకు విషెస్ అందించిన వారిలో కరీనా కపూర్, ఆలియా భట్, అతియా శెట్టి, కృతిసనన్ ఉన్నారు.


Click it and Unblock the Notifications











